కాస్త సృజనాత్మకత జోడిస్తే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

కాస్త సృజనాత్మకత జోడిస్తే...

ఇప్పుడంతా పండుగల సీజన్‌. అంతేకాదు వానలు ముదిరి వరదలుగా మారిన కాలం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వరదలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌ నగరమయితే తెరిచిన నాలాల్లో పడి కొట్టుకుపోయిన వాళ్ళు ఎందరో. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అసలే కరోనా వైరస్‌ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కరోనాకు తోడుగా నీళ్ళు అండగా నిలిచాయి. మరి నీళ్ళనూ తప్పుబట్టలేం. వాటి స్థలాలను, చెరువులను, వాగులను, వంకలను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టేస్తున్నారు మనుషులు. కబ్జా చేసిన మనుషులను నీరు వదిలిపెట్టక ఖాళీ చేయిస్తున్నవి. అందుకని వానల్లో బయట తిరగవద్దు. చిన్నచిన్న చప్టాల దగ్గర పారే నీళ్ళు ఏం చేస్తాయిలే అని దాటటానికి ప్రయత్నించ వద్దు. స్కూటర్లు, కార్లు కూడా నీటి ఉదృతికి వాగుల్లోకి కొట్టుకుపోతున్న వీడియోలు మనం యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం అలక్ష్యం చేసినా పెద్ద జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అందుకే పండుగలున్నా ఇంట్లోనే జరుపుకోండి. కాస్త సృజనాత్మకతతో ఈ బొమ్మలు ప్రయత్నించండి.

మాస్క్‌ తాళ్ళతో
మనం మాస్క్‌లకు అలవాటు పడిపోయాం. ప్రతి ఇంట్లో ప్రతి మనిషి మాస్క్‌ ధరించాల్సి వస్తోంది. ఇంట్లో మిగిలిపోయిన, వాడేసిన మాస్కులతో ఏం చేద్దామా అనుకున్నపుడు చాలా ఐడియాలు వచ్చాయి. మొదటగా మాస్క్‌కున్న తెల్లటి తాళ్ళు నాకు బాగా నచ్చాయి. వాటిని కత్తిరించి పువ్వులు చేద్దామనుకున్నాను. ఇంతకుముందే మూడు, నాలుగు వెరైటీ పువ్వులు, బొమ్మలు చేశాను. మీకూ వివరించాను. ఎలాస్టిక్‌ గుణం కలిగిన తెల్లటి తాళ్ళను కత్తిరించి పెట్టుకున్నాం కదా! వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. పూల రెక్కలు ఎంతవి కావాలి అన్న అంశంపై ఎంత ముక్కలు కత్తిరించాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క ముక్కను మధ్యకు మడిచి సూదికి గుచ్చాలి. ఆరు రెక్కలు సూదికి గుచ్చి దారము దగ్గరకు లాగి గట్టిగా ముడివేయాలి. అప్పుడు చుట్టూ రెక్కలతో ఉంటుంది. మేము చిన్నప్పుడు టాటింగ్‌తో పూలు అల్లాము. అందుకే నాకీ ఐడియా వచ్చిందనుకుంటాను. ఇలా పూలన్నీ చేసుకొని ఏదైనా బొమ్మను సృస్టించవచ్చు. నేనలా విడిగానే ఉంచాను.
సీసాల మూతలతో
నేను సూది మందు సీసా మూతలతో తేనె టీగలను తయారు చేశాను. వేప, రావి, చింత లాంటి పెద్ద వృక్షాలకు, ఇంటి మూలలకు తేనెపట్టు పెడుతుంది. ఒక్కో తేనెపట్టులో దాదాపు 50 వేల తేనె టీగలు ఉంటాయి. వీటిలో రాణి ఈగలు, కూలీ ఈగలు, మగ ఈగలు ఉంటాయి. తేనెపట్టును నిర్మించేది కూలీ తేనెటీగలు మాత్రమే. రాణీ ఈగలు ప్రత్యేకమైన గదిలో ఉంటాయి. మనం తేనె కొనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక తేనెటీగను ఇంట్లో పెంచుకుంటే సరి. అయితే నిజమైన తేనెటీగను పెంచుకుంటే తేనెను తయారు చెయ్యటమే గాకుండా మనల్ని కూడా కుడుతుంది. అందుకని సీసా మూతలతో తేనెటీగలను తయారు చేశాను. నేను మందుల సీసాల మూతల్ని సేకరించి చక్కని తేనెటీగను తయారు చేశాను. ఫొటో చూసి మీరు కూడా చెయ్యొచ్చు. కార్డుబోర్డు మీద తేనెటీగ బొమ్మను వేసుకొని అతికించుకుంటే సరిగ్గా వస్తుంది.
రేల పూలకాయలతో
మా అబ్బాయి వాళ్ళ కాలేజీలో రేలపూల చెట్లున్నాయి. బంగారు ముద్దలు వేలాడినట్టుగా పూలు చాలా అందంగా ఉంటాయి. కాయలు మాత్రం గుండ్రంగా పొడుగ్గా అడుగు, అడుగున్నర పొడవుతో నల్లగా ఉంటాయి. నాలుగైదేండ్ల కిందట చాలా కాయలు కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఈ రోజు వీటితో ఒక సీస్టార్‌ను చెయ్యాలనుకున్నాను. ఐదు కాయల్ని తీసుకొని నక్షత్రాకారంలో అమర్చాలి. ఇవి ఐదు పాదాలన్నమాట. మధ్యలో శరీరం ఉంటుంది. శరీరం కొరకు నల్లని ప్లాస్టిక్‌ మూతను పెట్టాను. మేము డీజిల్‌ స్టోర్‌ చేసే క్యాన్‌ మూత ఇది. ఇలా పనికొచ్చింది. ఈ సముద్ర నక్షత్రాలు అనబడే సముద్ర జీవులు నక్షత్రాకారపు ఎకైనోడెర్మ్‌లు. ఇవి ఆస్టరాయిడియా తరగతికి చెందిన సముద్ర నక్షత్రాలు. ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నిటిలో కలిపి దాదాపు 1500 జాతులు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మాస్కులతో
ఒక నలుచదరపు డబ్బాను తీసుకున్నాను. దేని ప్యాకింగో గుర్తులేదు. కొద్దిగా గట్టిగా ఉండే అట్ట డబ్బాను తీసుకుంటే బాగా వస్తుంది. దీని మీద పిస్తా తొక్కల్ని వరసగా అతికించాను. బాగున్నాయి కానీ కింద అట్ట కనిపిస్తోంది. అందుకే బంగారపు రంగును స్ప్రే చేశాను. మొత్తం అట్ట, పిస్తా తొక్కలతో సహా బంగారంగా మారిపోయింది. మరి ఇందులో ఏ పవ్వులు పెడదామా అనుకున్నాను. కాస్త వెరైటీగా ఉండాలి కదా! అదీ అందంగా ఉండాలి. అందుకని ఇంట్లో వాడేసిన మాస్కుల్ని తీసుకున్నాను. వాటిని క్రమ పద్ధతిలో మడిచి పెట్టి వాటిని అందులో అమర్చాను. అప్పుడు పువ్వుల్లా, పూల కుండీలా కనిపిస్తున్నది. ఇంకోలా కూడా చేయవచ్చు. వాడని కొత్త మాస్కుల్ని కూడా ఇలా స్టోర్‌ చేసుకోవచ్చు. అందులో నుంచి రోజూ ఒకటి తీసుకొని వాడుకోవచ్చు.
మాస్కుల నెమలి
ఇది కూడా మాస్కులతోనే చేయవచ్చు. మొదటగా మాస్కుల్ని సేకరించి పెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటి తాళ్ళు కత్తిరించేయాలి. తరువాత మాస్కుల అంచుల నాలుగువైపులా కత్తిరించాలి. కానీ ఈ అంచుల్నీ పార వేయకూడదు. అలాగే తాళ్ళు కూడా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మధ్యలో మిగిలిన మాస్కును సన్నగా మడవాలి. సూది దారం తీసుకొని మాస్కును మడిచి కుట్టుకోవాలి. ఇలా అన్నీ మాస్కుల్ని కుట్టుకోవాలి. వీటిని 'బౌ'లంటారు. ఆడ పిల్లల గౌనులకు ముందు భాగాన పువ్వుల్లా కుడ తారు. ఇలా బౌలన్నీ తయారు చేసి పక్కనుం చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ఆకారంలో అమర్చుకోవాలి. నెమలి బొమ్మ ఆకారం గీసుకొని దాని ఆకారం ప్రకారం వీటిని అలంకరించాలి. మాస్కుల బౌలను లైనులో అమర్చి మధ్యలో పొట్ట దగ్గర కొన్ని పువ్వుల్ని అమర్చాను. ఇవి మాస్కుల తాళ్ళతో తయారైన పూలు, నెమలి, పించంలో వాడిన పూలన్నీ మాస్కుల అంచుల తోనూ, మాస్కుల తాళ్ళతోనూ చేయవచ్చు. ఇంకోసారి వాటి గురించి చెబుతాను.
పాతబల్బుతో
ఇంట్లో ఫీజు ఎగిరిపోయిన బల్బులను పారేయకుండా దాచండి. వాటితో ఎన్నో రకాల బొమ్మలు వచేసుకోవచ్చు. ఈరోజు బొంగరం చేద్దాం. బొంగరాలు గుర్తున్నాయా? చెక్క బొంగరాలకు చివర మేకు ఉంటుంది. దానికో తాడు చుట్టి ఒడుపుగా నేల మీదకు ఒదిలితే గుండ్రంగా గిరిగర తిరుగుతుంది. ఇప్పుడు పిల్లలకు ఇవేమీ రావు. సరే పాత బల్బుకు చివర అల్యూమి నియం మూతను తీసేస్తే గాజు మొన మిగులు తుంది. ఈ బల్బు మీద మొదట పసుపు రంగు ను వేశాను. వెనక భాగమంతా రంగులు, డిజైన్లు వేశాను. చక్కని బొంగరం లాగా తయారయింది. పాత బల్బుతో అంద మైన బొంగరం తయారయింది. కానీ జాగ్రత్త... ఆడుకోవటానికి మాత్రం పనికిరాదు.

- డా|| కందేపి రాణీప్రసాద్‌

కాస్త సృజనాత్మకత జోడిస్తే...

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇలా తరిమేయండి

29-10-2020

పులావులో వేసే బే ఆకులతో తేలిగ్గా బొద్దింకల్ని తరిమి కొట్టొచ్చు. కిచెన్‌ లోని వేర్వేరు ప్రదేశాల్లో బే ఆకుల్ని చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు బొద్దింకలు పారి పోతాయి.

manavi

గృహాలంకరణ

ఈ మొక్కల్ని పెంచుకోండి

05-10-2020

మనం పెంచుకునే మొక్కల్లో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. తులసి మొక్క ఎంత మంచిదో మనకు తెలుసు. దాని నిండా ఔషధ గుణాలే. అలాంటివే మరికొన్ని ఉన్నాయి. అవి మనం

manavi

గృహాలంకరణ

పాతతో సరికొత్తగా...

03-10-2020

మనం కాలు బయట పెట్టామో కరోనా ఇంటి బయటే కాసుక్కూర్చుంది. కాబట్టి కరోనా మహమ్మారి పూర్తిగా పోయేవరకూ పదిమంది జనం ఉండే చోటుకు వెళ్ళవద్దు. గుంపులుగా ఉన్నపుడు కరోనాకు వ్యాపించే

manavi

గృహాలంకరణ

దుర్వాసన రాకుండా...

27-08-2020

ఈ వర్షాకాలంలో రెగ్యులర్‌ డిటర్జెంట్‌ పౌడర్‌ మాత్రమే సరిపోదు. వెనిగర్‌ అలాగే బేకింగ్‌ సోడా బట్టల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించేస్తాయి. కాబట్టి బట్టలను ఉతికేటప్పుడు కాస్తంత వినేగార్‌, బేకింగ్‌ సోడాను డిటర్జెంట్‌లో

manavi

గృహాలంకరణ

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ...

10-08-2020

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే వుంది. వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి వైరస్‌లకు ఓ ప్రధాన కారణం. మన పర్యావరణానికి హాని కలిగించే వాటిలో ప్లాస్టిక్‌ కూడా ఒకటి. మనకు చేతనైనంత వరకు ప్లాస్టిక్‌ను నియంత్రిస్తే పర్యావరణాన్ని