నీట్‌ గా కనిపించడం లేదా..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

నీట్‌ గా కనిపించడం లేదా..?

ఒక్కోసారి ఎంత క్లీన్‌ చేసినా ఇల్లు నీట్‌గా కనిపించనే కనిపించదు. శుభ్రం చేసీ చేసీ విసుగొస్తుంది.. చిరాకొస్తుంది.. ఏం చేయాలో తెలియదు. ఎలా క్లీన్‌ చేస్తే ఇల్లు ఇల్లులా కనపడుతుందో అర్ధం కాదు. అయితే మనకి తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుంది. అవేమిటో తెలుసుకుంటే ఆ తప్పులు మన ఇంట్లో జరగకుండా జాగ్రత్తపడొచ్చు. మరి అవేంటో చదువుదామా...
- నేల మీద ఏం వస్తువులు ఉండకూడదు అనే లక్ష్యంతో ఒక్కోసారి అవన్నీ తీసి అల్మారాల్లో, టేబుల్‌ మీద పెట్టేస్తూ ఉంటాం. దాంతో కౌటర్స్‌, సర్ఫేసులు క్లట్టర్‌తో నిండిపోయి ఉంటాయి.
- కౌంటర్స్‌ మీద అసలేమీ లేకపోయినా కూడా చూడ్డానికి అంత బావుండదు. అందుకని కాఫీ మేకర్‌, మిక్సీ లాంటివైనా కౌంటర్స్‌ మీద ఉండాలి.
- ఫ్రిజ్‌ మీద ఇన్విటేషన్స్‌, టేకెవే మెన్యూలు కిక్కిరిసిపోయి ఉంటాయి. ఆ ఇన్విటేషన్స్‌ తాలూకు శుభకార్యాలు ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి కూడా. కనీసం నెలకి ఒకసారైనా ఫ్రిజ్‌ మీద ఉండేవన్నీ క్లీన్‌ చేయాలని రూల్‌ పెట్టుకోండి.
- మీ కిచెన్‌ అల్మారాÛల్లో డబ్బాలు ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉన్నా కూడా నీట్‌గా కనిపించదు. మీకు వాడుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు సర్దేసుకోండి.
- కొంత మంది ఇంట్లోకి వస్తూనే చెప్పులు, షూస్‌, బ్యాగ్స్‌, పిల్లల లంచ్‌ బ్యాగ్స్‌ అన్నీ గుమ్మం పక్కనే పెట్టేస్తారు. వీటికి లోపల ఒక ప్లేస్‌ కేటాయించి ఆ ప్లేస్‌లోనే ఉంచాలని ఇంట్లో అందరికీ చెప్పండి.
- గోడల మీద ఫొటోలు, క్యాలెండర్లు, గోడ గడియారాలు వంటివన్నీ చాలా ఉన్నాయంటే ఇల్లు ఇరుగ్గా అనిపిస్తుంది. గోడల మీద ఎన్ని తక్కువ పెట్టగలరో చూసి అన్నే ఉంచండి.
- ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ బొమ్మలకే ఎంత ప్లేస్‌వున్నా సరిపోదు. అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, అత్తలు, ఫ్రెండ్స్‌ అందరూ పిల్లలకి బొమ్మలు కొంటూనే ఉంటారు. వాటిని రెగ్యులర్‌గా క్లియర్‌ చేయకపోతే ఇంట్లో ఇంకేం పెట్టుకోవడానికీ చోటుండదు.
- ఇంటినిండా ప్లగ్‌ పాయింట్స్‌, వాటిల్లో చార్జెర్స్‌ అవి నేల మీద పడుతూ ఉంటాయి. వాటికి కాలు చిక్కుకుంటే పడతారు కూడా. వాడని వాటిని లోపల పెట్టేయండి.
- మీరు మంచి మంచి ఆర్ట్‌ పీసెస్‌ని కలెక్ట్‌ చేసి ఉండవచ్చు. కానీ అవన్నీ డిస్‌ప్లే చేస్తే అన్నీ ఇరుకిరుగ్గా పెట్టినట్టు ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మీ కలెక్షన్‌ని మారుస్తూ ఉండండి.
- ఉతకాల్సిన బట్టలు ఒక గుట్టలా పడేసి ఉన్నా కూడా ఇల్లు నీట్‌గా కనిపించదు. రెగ్యులర్‌గా అవన్నీ వాషింగ్‌ మెషీన్‌లో వేసేస్తూ ఉండాలి. లేదా హ్యాండ్‌ వాష్‌ ప్రిఫర్‌ చేస్తే ఆ పని చేసేయాలి. కనీసం వాటిని మూత ఉన్న టబ్‌లో పెట్టాలి.
- ప్రతి వస్తువుకీ ఇంట్లో ఒక ప్లేస్‌ ఉంటుంది. ఆ ప్లేస్‌లో కాకుండా ఆ వస్తువులని ఇంకొక ప్లేస్‌లో పెట్టినా కూడా చూడ్డానికి బాగుండదు. కాబట్టి ఏ వస్తువు ఎక్కడ వుండాలో ముందే నిర్ణయించుకోండి.
- మీకు అక్కర్లేని, మీరు ప్రస్తుతం వాడని వస్తువులు మీ ఇంట్లో ఎన్నో ఉండి ఉంటాయి. ఆరు నెలలకి ఒకసారి ఈ క్లీనింగ్‌ ప్రోగ్రాం పెట్టుకుంటే ఇల్లు హయిగా ఉంటుంది.
- కొంత మంది షూస్‌ని ఇంటి బయట విడిగా పెట్టేస్తూ ఉంటారు. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే కనీసం ఏడెనిమిది జతల చెప్పులు కచ్చితంగా ఉంటాయి. వీటిని ఒక మంచి షూ ర్యాక్‌లో పెట్టకపోతే మీ ఇంటి గుమ్మం ముందే చెత్త పేరుకుపోతుంది.
- బాల్కనీలో తడి తడిగా ఉన్న మాప్స్‌ పెట్టేస్తే అవి వాసన వస్తూ ఉంటాయి. ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉన్న మాప్స్‌ మంచి ఇంప్రెషన్‌ని ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి.
- డైనింగ్‌ టేబుల్‌ మీద నేతి గిన్నె, పచ్చళ్ళ సీసాలు, ఉప్పు, పెప్పర్‌, స్పూన్‌ స్టాండ్‌, టిష్యూస్‌.. అన్నీ కలిసి డైనింగ్‌ టేబుల్‌ని ఇరుగ్గా చేసేస్తాయి. దేనికవి విడివిడిగా పెట్టుకోవాలి.
- మూత లేని డస్ట్‌ బిన్‌ ఒక్కటి ఉంటే చాలు మీరు ఇల్లు ఎంత నీట్‌గా ఉంచినా సరే చూడ్డానికి బావుండదు.. వాసన కూడా వస్తుంది. అందుకే వెంటనే మూత ఉన్న బిన్‌ పెట్టుకోండి. 

నీట్‌ గా కనిపించడం లేదా..?

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

పాతవస్తువులతో కళకళలాడేలా...

05-03-2021

సోమవారం నుండి అంటే మార్చి ఒకటో తేదీ నుండి మూడో దశ వ్యాక్సిన్ల పంపిణీ మొదలయ్యింది. కోవిడ్‌ యాప్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే

manavi

గృహాలంకరణ

వాడేసిన వాటితోనే వైభవంగా

26-02-2021

దేశ రాజధానిలో కరోనా మళ్ళీ విజృంభిస్తుందన్న వార్తలు మనల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ మధ్యనే కేసుల నమోదు ఎక్కువై 14 వేలకు చేరుకున్నాయి.

manavi

గృహాలంకరణ

ఇలా శుభ్రం చేయండి

22-02-2021

హాల్లో ఉండే వస్తువులు టీవీ పర్నిచర్‌.. కిచెన్‌లో ఉండే ఫ్రీడ్జ్‌, స్టవ్‌.. బెడ్‌ రూంలో ఉండే అద్దంపై తరుచుగా దుమ్మూధూళీ చేరుతుంది. వాటిని తొలగించడానికి దాన్ని తరచూ శుభ్రం చేయాల్సి

manavi

గృహాలంకరణ

పాత వస్తువులతో పసందుగా

19-02-2021

కరోనా వైరస్‌ ఓ అడుగు వెనక్కు వేసిందని కొద్దిగా సంతోషపడుతున్నాము. అదే సమయంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చేసిందనీ, అదీ మొదటగా కరోనా వారియర్స్‌కు ఇస్తున్నారనీ విని

manavi

గృహాలంకరణ

ఇంటి వస్తువులతో ఇంపుగా

12-02-2021

కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ వేయించుకున్న వాళ్ళలో కొందరిని సమస్యలు చుట్టుముట్టి మరణం దాకా తీసుకెళ్తున్నాయి. వ్యాక్సిన్లు కనుక్కున్న తొలినాళ్ళలో ఇలాంటివి జరగడం సాధారణమైనప్పటికీ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన కుటుంబాల

manavi

గృహాలంకరణ

ఇంటికి అతిథులు వస్తున్నారా..?

08-02-2021

ఇంటికి ఎవరైనా అతిథులు వస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. పాత విషయాలు కలబోసుకోవచ్చు. అయితే గెస్టులు వస్తున్నారంటే ఇంట్లో మాత్రం కొద్దిగా పనే. ఇలా చేయడం కూడా పెద్ద పనేనా అనుకుంటారు

manavi

గృహాలంకరణ

వ్యర్థాలతో వైభవంగా...

05-02-2021

ప్రపంచ మానవ జాతినంతా సంవత్సర కాలంపాటు తన ఆధీనంలో ఉంచుకున్న కరోనా వైరస్‌ వికటాట్టహాసానికి తెర పడింది. కోవాగ్జిన్‌లు కరోనాపై విజయవంతంగా ప్రయోగింపబడుతున్నాయి. కావాల్సిన రూపంలోకి మారల మాయా

manavi

గృహాలంకరణ

సమయాన్ని విలక్షణంగా...

29-01-2021

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. జనం మధ్యలోకి వచ్చేసి వారి శరీరాల్లోకి దూరేసింది. ఇక అది తుపాకీ పుచ్చుకొని దేహంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. జనవరి 16వ తేదిన గవర్నమెంటు ఆసుపత్రిలో పనిచేసే ఫ్రంట్‌లైన్‌ వారియర్లు

manavi

గృహాలంకరణ

ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం

22-01-2021

కోవిడ్‌ 19 వైరస్‌కు వ్యాక్సిన్లు వస్తున్నాయని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. జనవరి 16వ తేదీ నుంచి మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి కోవిషీల్డు, కోవాగ్జిన్‌

manavi

గృహాలంకరణ

ఇలా తరిమేయండి...

17-01-2021

ప్రతి ఇంట్లో బల్లులు ఉండడం సాధారణమై విషయమే. వీటితో మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. పైగా ఇంట్లోని కీటకాలను తింటూ మనకే మేలుచేస్తాయి. ఐనప్పటికీ మనలో చాలా మందికి బల్లులంటే నచ్చదు. వాటిని చూస్తేనే