ఇలా శుభ్రం చేయండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

ఇలా శుభ్రం చేయండి

హాల్లో ఉండే వస్తువులు టీవీ పర్నిచర్‌.. కిచెన్‌లో ఉండే ఫ్రీడ్జ్‌, స్టవ్‌.. బెడ్‌ రూంలో ఉండే అద్దంపై తరుచుగా దుమ్మూధూళీ చేరుతుంది. వాటిని తొలగించడానికి దాన్ని తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని శుభ్రం చేసినప్పటికీ తిరిగి వాటిపై దుమ్ము కనిపిస్తూ ఉంటుంది. అందుకే వాటిని శుభ్రం చేయడం అనుకున్నంత సులభం కాదు. మనం వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా గుడ్డను వాడుతుంటాం. ఇలా క్లీన్‌ చేసే సమయంలో వాటిపై గీతలు పడొచ్చు. ముఖ్యంగా టీవీ, కంప్యూటర్‌ స్క్రీన్‌ను శుభ్రం చేసే సమయంలో చేసే పొరపాట్లు వల్ల వాటిపై గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వాటిపై గీతలు పడకుండా చూసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం...
- సాధారణ గుడ్డతో స్కిన్స్‌ను శుభ్రం చేయొద్దు. ఇంట్లో ఉండే బట్టలతో టీవీ అద్దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. దీనికి బదులుగా మైక్రోఫైబర్‌ క్లాత్‌ను ఉపయోగించాలి. రిటైల్‌ షాప్‌లో ఇది దొరుకుతుంది. దీంతో శుభ్రం చేయడం వల్ల టీవీ అద్దంపై ఎలాంటి గీతలూ పడవు.
- క్లిన్‌ చేయడానికి లిక్విడ్స్‌ లాంటివి ఉపయోగిస్తుంటారు. ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మా స్క్రీన్‌లు రసాయనాలు ఉండే వాటితో క్లీన్‌ చేయడం వల్ల అద్దాన్ని పాడు చేస్తాయి. అలా కాకుండా మైక్రోఫైబర్‌ వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. అలా తుడిచినప్పటికి మరకలు పోనట్లయితే మానిటర్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన క్లీనింగ్‌ సొల్యూషన్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని వాడడం మంచిది.
- స్క్రీన్‌ పై నేరుగా స్ప్రే చేయొద్దు. ముందుగా క్లీనింగ్‌ సొల్యూషన్‌ను మైక్రోఫైబర్‌ వస్త్రంపై చల్లి స్క్రీన్‌ పై తుడిస్తే సరిపోతుంది. అలాకాకుండా నేరుగా ఉపయోగిస్తే ఆ ద్రవాలు స్క్రీన్‌ లోపాలికి వెళ్ళి పాడు చేస్తాయి.
- మన చేతిలో తరుచుగా ఉండే రిమోట్స్‌, వీడియో గెమ్‌ కట్రోల్స్‌, మౌస్‌ లాంటి వాటిని కూడా శుభ్రం చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిపై ఎక్కువగా సూక్ష్మజీవులు పేరుకుని ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేస్తుండాలి. వీటిలో ఉండే బ్యాటరీలను తీసేసి మృదువైన వస్త్రంతో తుడుస్తుండాలి.

ఇలా శుభ్రం చేయండి

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

అందమైన ఆకృతులను సృష్టిద్దాం

02-04-2021

కరోనా మళ్ళీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. గతనాలుగు నెలలుగా కొద్దిగా తగ్గు ముఖం పట్టిందనుకున్నాం. అందరం వ్యాక్సిన్లు వేయించుకునే

manavi

గృహాలంకరణ

పారవేసే వస్తువులకు ముస్తాబులు

26-03-2021

కొవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు రెండూ దేశీయ సంస్థలతో రూపొందబడటం భారతదేశానికే గర్వకారణం. అందరూ టీకాలు తీసుకునేదాకా జాగ్రత్తగా

manavi

గృహాలంకరణ

పాతవస్తువులతో కళకళలాడేలా...

05-03-2021

సోమవారం నుండి అంటే మార్చి ఒకటో తేదీ నుండి మూడో దశ వ్యాక్సిన్ల పంపిణీ మొదలయ్యింది. కోవిడ్‌ యాప్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే