పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పనికొచ్చేలా.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పనికొచ్చేలా..

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పలు ఆకారాల్లో భలే అందంగా ఉంటాయి. అందుకే పర్‌ఫ్యూమ్‌ అయిపోయినా వాటిని బయట పడేయాలంటే మనసొప్పదు. మనసొప్పనప్పుడు ఆ పని చేయడం ఎందుకు సింపుల్‌గా వాటిని ఫ్లవర్‌ వేజ్‌లుగా మార్చేయండి. అదెలాగంటే... ముందుగా సీసా మూతి బయటి వైపు ఉన్న క్యాప్‌ను లాగేయాలి. ఇది సులభంగానే వచ్చేస్తుంది. తరువాత సీసా మూతను తీసేందుకే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ మూత కూడా తీసేశాక సీసాలో పర్‌ఫ్యూమ్‌ అరకొరా ఉన్నా తీసేయాలి. ఆ తరువాత సీసాను సబ్బు, గోరువెచ్చటి నీళ్లతో శుభ్రంగా బాగా కడిగేయాలి. అలాకాని చేయకపోతే ఆ సీసాలో ఉంచిన పూలు పాడయిపోతాయి. శుభ్రం చేశాక నీళ్లు పోసి కాడలతో సహా పూలను సీసాలో ఉంచాలి. అందమైన పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌లో అమరిన పూలు మనసును మురిపించడం ఖాయం. ఈ పూల వేజ్‌కు ఇంకాస్త గ్లామర్‌ జోడించేందుకు సీక్వైన్స్‌, మెరుపులను వేజ్‌లోని నీళ్లలో వేయొచ్చు. మరో విషయం ఏమిటంటే పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌లో పూలకు బదులుగా అగరొత్తులు కూడా ఉంచొచ్చు.
ఖాళీ అయిన పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ను మరోలా కూడా ఉపయోగించొచ్చు. పర్‌ఫ్యూమ్‌ అయిపోయినా సువాసనలు మాత్రం సీసాను అంటే ఉంటాయి. అందుకని వార్డ్‌రోబ్‌లో ఈ సీసాను ఉంచితే మీ బట్టలు కూడా పరిమళాలను వెదజల్లుతాయి.

పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ పనికొచ్చేలా..

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

సంక్రాంతి రుచులు

09-01-2020

సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది పిండి వంటలు. ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. బోలెడు వెరైటీలు నోరూరిస్తాయి. వంటలతో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. పిల్లాపాపలతో కేరింతలు కొడుతుంది. ప్రతి ఒక్కరి నోరు కొత్త రుచులు చూస్తుంది. సంక్రాంతి పండుగలో వందల

manavi

గృహాలంకరణ

లెదర్‌... జాగ్రత్తగా..

09-01-2020

లెదర్‌ వస్తువులను ఓ శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఎయిర్‌ కండిషన్‌, హీటర్‌ ఉన్న గదుల్లో లెదర్‌ వస్తువులను ఉంచకూడదు. వీటి వల్ల వాటి సహజత్వం దెబ్బతింటుంది.

manavi

గృహాలంకరణ

జ్ఞాపకాల పొదరిల్లు

01-01-2020

జీవన ప్రయాణంలో ఎన్నో ఘటనలు.. వాటిలో మరెన్నో తీపి, చేదు జ్ఞాపకాలు.. అన్నింటినీ మన మస్తిష్కంలో దాచలేం కదా..! అందుకే గతంలో డైరీ రాయడం చాలామందికి అలవాటుగా ఉండేది. అందులో

manavi

గృహాలంకరణ

చిందరవందరగా లేకుండా..

29-12-2019

ఇల్లు పరిశుభ్రంగా, అందంగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ తప్పకుండా పాటించాలి. అవి... - ఇంట్లో దుమ్ము చేరకుండా చూసుకోవాలి. దుమ్ము లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కువ సామాను చేర్చకూడదు.

manavi

గృహాలంకరణ

పిల్లలకు ఇష్టంగా...

27-12-2019

సేఫ్టీగాపిల్లల గది అనగానే మనకు ముందుగా గొర్తొచ్చేది బొమ్మలు. అయితే అవి మాత్రమే కాదు.. గది రంగులు... ఫర్నీచర్‌, కప్‌బోర్డ్స్‌ ఇలా ప్రతీది ముఖ్యమే. వారి అభిరుచికి తగ్గట్టుగా ఉంటే ఆ బుజ్జాయిల ఆనందానికి అవధులుండవు.

manavi

గృహాలంకరణ

రంగు పోకుండా..

27-12-2019

కొన్ని రకాల దుస్తులు రెండు, మూడు సార్లు ఉతగ్గానే రంగు మారి, వెలిసినట్లవుతాయి. అందుకే బట్టలు ఉతికే విషయంలో ఈ చిట్కాలను పాటిస్తే వాటి రంగు మారకుండా ఉంటుంది.

manavi

గృహాలంకరణ

కార్పెట్లపై మరకలు పడితే...

25-12-2019

కార్పెట్లపై మరకలు పడితే వాటిని తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఉతకడానికి బరువుగా ఉండటంతో పాటు.. ఆరడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మరకలు తొలగించడం మంచిది.

manavi

గృహాలంకరణ

ఇల్లు విశాలంగా కనిపించాలంటే..

23-12-2019

తమ ఇంటిని అందంగా చూసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారు తమ ఇంటిని అందంగా, విశాలంగా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి ఆ మార్పులు ఏమిటో

manavi

గృహాలంకరణ

ఇంట్లోనే కూరగాయల సాగు

19-12-2019

ఇటీవలి కాలంలో పట్టణ, నగర వాసులూ ఇంట్లోనే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యపరమైన సహ, డబ్బు ఖర్చు పెడుతున్నా తాజా కూరగాయలు లభించకపోవటం, లభించినా వాటిపై పురుగుమందుల

manavi

గృహాలంకరణ

కంచుని మెరిపించండిలా...

19-12-2019

చిన్న చిన్న చిట్కాలతో కంచు పాత్రలను తళతళా మెరిసేలా చేయొచ్చు.. ఎలాగంటే..ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ పేస్టుని కంచు వస్తువులపై రాసి కాటన్‌ వస్త్రంతో లేదా మెత్తని టూత్‌బ్రెష్‌తో