కష్టాలకు ఓదార్పు... కళ | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

కష్టాలకు ఓదార్పు... కళ

సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ వయసులో చిత్రకళా ప్రదర్శనలకోసం దేశ విదేశాలు తిరుగుతున్నది. ఇటీవల ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆమె చిత్రాల ప్రదర్శనతో చిత్రకళా ప్రపంచమంతా ఆమె వైపుచూసింది.
మరింత సాధించాలి...
''అంతర్జాతీయంగా నా పెయింటింగ్స్‌కు గుర్తింపు లభించిందంటే ఆనందంగాఉన్నది. నేను పెయింటింగ్‌ వేస్తున్నప్పుడు నా బాధలు, కన్నీళ్లు అన్నీ పోయిహాయిగా ఉంటుంది. పెయింటింగ్‌ వేస్తున్నప్పుడు నేను మరో లోకంలోకి వెళ్లిపోతాను... స్వేచ్ఛా విహంగంలా భావిస్తాను. ఇదిఒక గుర్తింపు మాత్రమే. ఇంకా మరింత సాధించాలి. ముఖ్యంగా ఆదివాసీ కమ్యూనిటీకి మేలు జరగాలి. సరైనవిద్య అందాలి. నేను చేసే పని.. నా తెగలో మరింత మందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నా''
ఆదివాసీ తెగకు చెందిన మహిళ బైగా. తెగలో ఎవరో ఒకరు చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప.. అందరూ జీవికకోసం అడవి మీద ఆధారపడాల్సిందే. విద్య, రవాణా, ఉపాధికి ఆ మారుమూల గ్రామం ఇంకా ఆమడ దూరం. ఆమెకు 40 ఏండ్ల వయసులో భర్త చనిపోయాడు. ఇద్దరు కొడుకులతో కలిసి జీవిస్తున్న బైగా.. కూతురు పెండ్లి చేసింది. బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆ తరువాత అందరూ ఈ వయసులో ఏం చేస్తాం అనుకుంటారు. కానీ... ఆమె జీవితం రంగులమయంగా ఉండాలనుకుంది. సాధారణంగా ఆదివాసీ, గిరిజన తెగల్లోని ప్రజల వస్త్రధారణ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ రంగులనే పట్టుకుందామె. 70 ఏండ్ల వయసులో తన పెయింటింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. జీవితకాలం అడవిలో, పనుల్లో కాలం వెళ్లదీసిన ఆమెకు.. పెయింటింగ్‌లో ఓ విశ్రాంతి దొరికింది.
ఆ స్వేచ్ఛా విహంగం చిత్రకళా ప్రయాణం ఎలా మొదలైందంటే.. శాంతినికేతన్‌ పూర్వ విద్యార్థి అయిన ఆశిష్‌ స్వామి... మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ స్థానిక కళలకు ప్రాచుర్యం కల్పించేవారు. అలా ఓసారి ఆయన లోహ్రాకి వచ్చారు. ఉచితంగా నేర్పిస్తానని చెప్పాడు. తానూ నేర్చుకోవాలనుకుంది బైగా. చిన్నప్పటినుంచి ఆమెకు ఆర్ట్‌ మీద ఆసక్తి ఉన్నది. కానీ కుటుంబం, బాధ్యతలు, ప్రయత్నించింది. అలా మొట్ట మొదటిసారి... పెయింటింగ్‌ మీద ఆమెకున్న ప్యాషన్‌ను గుర్తించింది. స్థానికంగా 15 మంది మహిళలతో కలిసి ఆమె కూడా పెయింటింగ్‌ను సీరియస్‌గా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె చిన్న చెట్టు గీసినా... మిగిలిన వాళ్ల కన్నా భిన్నంగా కనపడింది. మేఘాల్లో ప్రశాంతత, అటవీ జంతువుల్లో అమాయకత్వం... భిన్నమైన ప్రపంచాన్ని కాన్వాస్‌పై చిత్రీకరించడం మొదలుపెట్టారు. చెట్లు, పక్షులు, జంతువులు, కొలనులు, నదులు, మనుషులు.. అన్నీ ఊహకందని రీతిలో చిత్రించడం మొదలుపెట్టింది. కేవలం కాన్వాస్‌ మీద చిత్రాలేకాదు.. మ్యూరల్స్‌, కలపతో బొమ్మలు చేసి వాటికి రంగులద్దేది. అడవిలో రోజూ తన చుట్టూ చూసే జంతువులు, పక్షలనే తన కళకు వస్తువులుగా ఎంచుకున్నది. అయితే వాటిని చూసి ఆనందిస్తే ఫలితం లేదు. వాటిని బయటి చిత్రకళా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు స్వామి. అలా దేశమంతటా జరిగే ఎగ్జిబిషన్స్‌లో బైగా చిత్రాలను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. 300 నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు బైగా చిత్రాలు అమ్ముడుపోయాయి. ఆమెకు ఆశ్చర్యం. డబ్బులొస్తున్నాయి. కానీ... డబ్బులకంటే తమ సంప్రదాయపు కళలను, తన గ్రామాన్ని ప్రపంచ చిత్రపటాన ఉంచడమే లక్ష్యంగా పెయింటింగ్స్‌వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె ప్రతిభ ప్రపంచవ్యాప్తమయ్యింది. విదేశాల్లో సైతం అనేక ఎగ్జిబిషన్స్‌కు ఆమె చిత్రాలు వెళ్లాయి. ఇటీవల ఇటలీలోని మిలన్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నది.

కష్టాలకు ఓదార్పు... కళ

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

సంక్రాంతి రుచులు

09-01-2020

సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది పిండి వంటలు. ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. బోలెడు వెరైటీలు నోరూరిస్తాయి. వంటలతో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. పిల్లాపాపలతో కేరింతలు కొడుతుంది. ప్రతి ఒక్కరి నోరు కొత్త రుచులు చూస్తుంది. సంక్రాంతి పండుగలో వందల

manavi

గృహాలంకరణ

లెదర్‌... జాగ్రత్తగా..

09-01-2020

లెదర్‌ వస్తువులను ఓ శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఎయిర్‌ కండిషన్‌, హీటర్‌ ఉన్న గదుల్లో లెదర్‌ వస్తువులను ఉంచకూడదు. వీటి వల్ల వాటి సహజత్వం దెబ్బతింటుంది.

manavi

గృహాలంకరణ

జ్ఞాపకాల పొదరిల్లు

01-01-2020

జీవన ప్రయాణంలో ఎన్నో ఘటనలు.. వాటిలో మరెన్నో తీపి, చేదు జ్ఞాపకాలు.. అన్నింటినీ మన మస్తిష్కంలో దాచలేం కదా..! అందుకే గతంలో డైరీ రాయడం చాలామందికి అలవాటుగా ఉండేది. అందులో

manavi

గృహాలంకరణ

చిందరవందరగా లేకుండా..

29-12-2019

ఇల్లు పరిశుభ్రంగా, అందంగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ తప్పకుండా పాటించాలి. అవి... - ఇంట్లో దుమ్ము చేరకుండా చూసుకోవాలి. దుమ్ము లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కువ సామాను చేర్చకూడదు.

manavi

గృహాలంకరణ

పిల్లలకు ఇష్టంగా...

27-12-2019

సేఫ్టీగాపిల్లల గది అనగానే మనకు ముందుగా గొర్తొచ్చేది బొమ్మలు. అయితే అవి మాత్రమే కాదు.. గది రంగులు... ఫర్నీచర్‌, కప్‌బోర్డ్స్‌ ఇలా ప్రతీది ముఖ్యమే. వారి అభిరుచికి తగ్గట్టుగా ఉంటే ఆ బుజ్జాయిల ఆనందానికి అవధులుండవు.

manavi

గృహాలంకరణ

రంగు పోకుండా..

27-12-2019

కొన్ని రకాల దుస్తులు రెండు, మూడు సార్లు ఉతగ్గానే రంగు మారి, వెలిసినట్లవుతాయి. అందుకే బట్టలు ఉతికే విషయంలో ఈ చిట్కాలను పాటిస్తే వాటి రంగు మారకుండా ఉంటుంది.

manavi

గృహాలంకరణ

కార్పెట్లపై మరకలు పడితే...

25-12-2019

కార్పెట్లపై మరకలు పడితే వాటిని తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఉతకడానికి బరువుగా ఉండటంతో పాటు.. ఆరడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మరకలు తొలగించడం మంచిది.

manavi

గృహాలంకరణ

ఇల్లు విశాలంగా కనిపించాలంటే..

23-12-2019

తమ ఇంటిని అందంగా చూసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారు తమ ఇంటిని అందంగా, విశాలంగా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి ఆ మార్పులు ఏమిటో

manavi

గృహాలంకరణ

ఇంట్లోనే కూరగాయల సాగు

19-12-2019

ఇటీవలి కాలంలో పట్టణ, నగర వాసులూ ఇంట్లోనే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యపరమైన సహ, డబ్బు ఖర్చు పెడుతున్నా తాజా కూరగాయలు లభించకపోవటం, లభించినా వాటిపై పురుగుమందుల

manavi

గృహాలంకరణ

కంచుని మెరిపించండిలా...

19-12-2019

చిన్న చిన్న చిట్కాలతో కంచు పాత్రలను తళతళా మెరిసేలా చేయొచ్చు.. ఎలాగంటే..ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ పేస్టుని కంచు వస్తువులపై రాసి కాటన్‌ వస్త్రంతో లేదా మెత్తని టూత్‌బ్రెష్‌తో