ఇల్లు శుభ్రం చేస్తున్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

ఇల్లు శుభ్రం చేస్తున్నారా?

ఇన్ఫెక్షన్‌లకి మూలకారణం ఇల్లు మురికిగా ఉండటం.ఈ ఉరుకుల పరుగుల జీవనంలో మనకి ప్రతిరోజూ ఇల్లు శుభ్రంచేయటం కుదరకపోవచ్చు. అది కూడా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే అసలు కుదరదు. సాధారణంగా మనలో చాలామంది వారానికోసారి ఇల్లు శుభ్రం చేస్తూ పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు. ఇది కూడా మంచిదే కానీ, ఎలా చేస్తున్నామనేదే ముఖ్యం. ఇంట్లో కొన్ని మూలలను వదిలేసి కొన్నిటిని మాత్రమే శుభ్రం చేస్తుంటాం. అందుకే అలా వదిలేసిన వాటిని అప్పుడప్పుడైనా శుభ్రం చేస్తుండాలి.
షవర్‌ హెడ్స్‌: రెగ్యులర్‌గా శుభ్రపర్చకపోతే దుమ్ము పేరుకునే ప్రదేశాలలో ఇదీ ఒకటి. నిజానికి రెండువారాలకోసారి పొడిగుడ్డతో దీన్ని తుడవాలి. అలాగే ఏడాదికి రెండుసార్లు చక్కగా పైపైన కాకుండా పూర్తిగా శుభ్రం కూడా చేయాలి.
కార్పెట్లు: ఇంట్లో ముఖ్యంగా చంటిపిల్లలు లేదా పెంపుడు జంతువులుంటే కార్పెట్లపై ఎక్కువ మురికి చేరుతుంది. వీటిని వారానికోసారి శుభ్రపర్చాలి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా వాక్యూమ్‌ క్లీనర్‌తో కార్పెట్‌ను శుభ్రపర్చటమే. ఇది రెగ్యులర్‌గా చేస్తే కార్పెట్లపై ఎక్కువ మురికి పేరుకోకుండాఉండి శుభ్రపర్చటం తేలికవుతుంది.
వాషింగ్‌ మెషీన్‌: వాషింగ్‌ మెషీన్‌ లోపలి భాగాల్లో ముఖ్యంగా ఫంగస్‌, బట్టల దారపుపోగులు పేరుకుంటాయి. ఇలా జరగకుండా ఆపాలంటే మీరు పావు కప్పు బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి మెషీన్‌ను ఖాళీగా తిప్పాలి. లేదా ఫుల్‌వాటర్‌ ఆప్షన్‌తో మూడు చెంచాల బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి కూడా తిప్పవచ్చు. ఇలా చేస్తే వాషింగ్‌ మెషీన్‌ లోపలినుండి శుభ్రపడుతుంది.
ఓవెన్‌ అరలు: చేసే వంటలను బట్టి ఓవెన్‌ అరల్లో గ్రీజు మరకలు, బేకింగ్‌ పదార్థాలు అతుక్కొని - తీయడానికి కష్టంగా ఉంటాయి. వీటిని శుభ్రపర్చటానికి పావు కప్పు తెల్ల వెనిగర్‌, పావుకప్పు అంట్లుతోమే లిక్విడ్‌ను తీసుకుని దానికి ఒక కప్పు నీటిని కలపాలి. ఆ తరువాత ఈ ద్రావణాన్ని స్ప్రేయింగ్‌ సీసాలో నింపాలి. ఓవెన్‌ అరలను ఈ మిశ్రమంతో స్ప్రే చేసి అరగంట అలానే ఉండనివ్వాలి. ఆ తరువాత శుభ్రం చేస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి.
షూ ర్యాక్‌: ఇంట్లో వీటిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ చేయాల్సింది కూడా వారానికోసారి శుభ్రమైన గుడ్డతో చక్కగా తుడవటమే. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మురికి పేరుకోదు.
పరుపులు: మీరెంత జాగ్రత్తగా ఉన్నా, అప్పుడప్పుడయినా మీ పరుపుల మీద కొన్ని మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు మీరు డైల్యూట్‌ చేసిన లాండ్రీ సర్ఫ్‌తో ఆ మరకల ప్రాంతాన్ని మైక్రోఫైబర్‌ టవల్‌ను వాడుతూ రుద్దండి. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని మామూలు టవల్‌ను నీళ్లలో ముంచి రుద్దితే మరకలు తొలగిపోతాయి.
పుస్తకాలు: మీకు పుస్తకాలంటే పిచ్చి అయితే ఇంట్లో ఎక్కడో అక్కడ పుస్తకాలు అలా సర్దకుండా పడేసి ఉండటం కన్పిస్తూనే ఉంటుంది. ఇది చెడ్డ అలవాటు కాకపోయినా, వారానికోసారి వీటికి పట్టే దుమ్ము కూడా దులుపుతుండటం మంచిది.
సాఫ్ట్‌ టార్సు:ఈ సాఫ్ట్‌ టార్సుకి పైన ఫర్‌ ఉండటం వలన చాలా మురికి, దుమ్ము పేరుకుపోతాయి. పిల్లలకి వీటినుంచి అలర్జీలు రాకుండా ఉంచాలంటే, నెలకోసారి ఈ బొమ్మలను కడగండి. దీనికి మీరు చేయాల్సింది.

ఇల్లు శుభ్రం చేస్తున్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

సంక్రాంతి రుచులు

09-01-2020

సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది పిండి వంటలు. ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. బోలెడు వెరైటీలు నోరూరిస్తాయి. వంటలతో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. పిల్లాపాపలతో కేరింతలు కొడుతుంది. ప్రతి ఒక్కరి నోరు కొత్త రుచులు చూస్తుంది. సంక్రాంతి పండుగలో వందల

manavi

గృహాలంకరణ

లెదర్‌... జాగ్రత్తగా..

09-01-2020

లెదర్‌ వస్తువులను ఓ శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఎయిర్‌ కండిషన్‌, హీటర్‌ ఉన్న గదుల్లో లెదర్‌ వస్తువులను ఉంచకూడదు. వీటి వల్ల వాటి సహజత్వం దెబ్బతింటుంది.

manavi

గృహాలంకరణ

జ్ఞాపకాల పొదరిల్లు

01-01-2020

జీవన ప్రయాణంలో ఎన్నో ఘటనలు.. వాటిలో మరెన్నో తీపి, చేదు జ్ఞాపకాలు.. అన్నింటినీ మన మస్తిష్కంలో దాచలేం కదా..! అందుకే గతంలో డైరీ రాయడం చాలామందికి అలవాటుగా ఉండేది. అందులో

manavi

గృహాలంకరణ

చిందరవందరగా లేకుండా..

29-12-2019

ఇల్లు పరిశుభ్రంగా, అందంగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ తప్పకుండా పాటించాలి. అవి... - ఇంట్లో దుమ్ము చేరకుండా చూసుకోవాలి. దుమ్ము లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కువ సామాను చేర్చకూడదు.

manavi

గృహాలంకరణ

పిల్లలకు ఇష్టంగా...

27-12-2019

సేఫ్టీగాపిల్లల గది అనగానే మనకు ముందుగా గొర్తొచ్చేది బొమ్మలు. అయితే అవి మాత్రమే కాదు.. గది రంగులు... ఫర్నీచర్‌, కప్‌బోర్డ్స్‌ ఇలా ప్రతీది ముఖ్యమే. వారి అభిరుచికి తగ్గట్టుగా ఉంటే ఆ బుజ్జాయిల ఆనందానికి అవధులుండవు.

manavi

గృహాలంకరణ

రంగు పోకుండా..

27-12-2019

కొన్ని రకాల దుస్తులు రెండు, మూడు సార్లు ఉతగ్గానే రంగు మారి, వెలిసినట్లవుతాయి. అందుకే బట్టలు ఉతికే విషయంలో ఈ చిట్కాలను పాటిస్తే వాటి రంగు మారకుండా ఉంటుంది.

manavi

గృహాలంకరణ

కార్పెట్లపై మరకలు పడితే...

25-12-2019

కార్పెట్లపై మరకలు పడితే వాటిని తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఉతకడానికి బరువుగా ఉండటంతో పాటు.. ఆరడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మరకలు తొలగించడం మంచిది.

manavi

గృహాలంకరణ

ఇల్లు విశాలంగా కనిపించాలంటే..

23-12-2019

తమ ఇంటిని అందంగా చూసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారు తమ ఇంటిని అందంగా, విశాలంగా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి ఆ మార్పులు ఏమిటో

manavi

గృహాలంకరణ

ఇంట్లోనే కూరగాయల సాగు

19-12-2019

ఇటీవలి కాలంలో పట్టణ, నగర వాసులూ ఇంట్లోనే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యపరమైన సహ, డబ్బు ఖర్చు పెడుతున్నా తాజా కూరగాయలు లభించకపోవటం, లభించినా వాటిపై పురుగుమందుల

manavi

గృహాలంకరణ

కంచుని మెరిపించండిలా...

19-12-2019

చిన్న చిన్న చిట్కాలతో కంచు పాత్రలను తళతళా మెరిసేలా చేయొచ్చు.. ఎలాగంటే..ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ పేస్టుని కంచు వస్తువులపై రాసి కాటన్‌ వస్త్రంతో లేదా మెత్తని టూత్‌బ్రెష్‌తో