చక్కగా సర్దండి... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

చక్కగా సర్దండి...

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్ళే పెద్దలవరకు అందరికి తిప్పలు తప్పవు.
- ముందుగా అలమారలో పేపర్‌ వేసి ఆ తర్వాత క్రమంగా ముదురు రంగు నుంచి లేతరంగు బట్టలు పెట్టుకోవాలి. ప్రతి వరుసలో చక్కగా గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. లేదంటే తేమ చేరి క్రిమికీటకాలు చేరే ప్రమాదం ఉంది. వీటి వల్ల దుస్తులు పాడవడమే కాక పలు రకాల ఎలర్జీలకు దారి తీస్తాయి. ఇవి దరిచేరకుండా అరల్లో మధ్యమధ్యలో కలరా ఉండలు వేయాలి.
- అలగే నెలకోసారైనా వార్డ్‌రోబ్‌ను శుభ్రం చేసి మళ్లీ దుస్తులను నీట్‌గా సర్దుకోవాలి. ముఖ్యంగా అన్ని దుస్తులు ఒకే చోట గందరగోళంగా ఉండకూడదు. అలమారాలో కుటుంబసభ్యులకు విడివిడిగా ఒక్కో అరను కేటాయించి వాటి ప్రాధాన్యాన్ని బట్టి పద్ధతిగా అమర్చుకోవాలి. దీనివల్ల వెతుక్కునేందుకు సమయం వథా కాకుండా ఉంటుంది.
- ఎక్కువ స్పేస్‌ ఆక్యూపై చేసే జీన్స్‌ ప్యాంట్‌లను సగానికి మడిచి హ్యాంగర్లకు వేలాడదీసుకోవాలి. ఏవైనా వాడని దుస్తులుంటే వాటిని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల్లో వేసి మరో చోటకు మార్చుకోవాలి. దీనివల్ల అలమారలో స్థలం కలిసిరావడమే కాక చూడడానికి నీట్‌గా ఉండి, బట్టలు తీసుకోవడానికి సులువవుతుంది. అలమార సరిపోదు అనుకున్నప్పుడు రోజువారీ బట్టలు మాత్రమే ఇక్కడ సర్దుకొని మిగతావి సూట్‌కేస్‌లలో తగు జాగ్రత్తలతో సర్దుకోవడం ఉత్తమం.
- చాలా సందర్భాల్లో పిల్లలే కాదు, పెద్దలు కూడా ఏం అవసరం వచ్చినా.. అలమారా అంతా సర్దేసి.. దుస్తులన్నీ బయటకు లాగేసి.. నానా హంగామా చేస్తుంటారు. అందుకనే కంటికి కావలసిన దుస్తులు ఇట్టే కనిపించడంతో పాటు అలమార అందంగా కనిపించాలి. అప్పుడే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న దుస్తులు, అలాగే ఎంత ఖరీదైనవైనా నాణ్యత లోపించకుండా కాపాడుకలుగుతాం.

చక్కగా సర్దండి...

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు మారుతున్నారా..?

13-03-2020

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి సామాను షిఫ్ట్‌ చేసే టైమ్‌లో పడే శ్రమ అంత ఇంతా కాదు. అందుకే కొత్త ఇంటికి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్‌ చేయడంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

manavi

గృహాలంకరణ

అలంకరణలో కళాత్మకం...

04-03-2020

ఇంటికి అలంకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌.. ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా, కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ

manavi

గృహాలంకరణ

కలుపు తీయండి..

21-02-2020

రోజూ చేసే అర గంట గార్డెనింగ్‌ మంచి వ్యాయామం. శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి

manavi

గృహాలంకరణ

పాతతో కొత్త అందం

19-02-2020

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో