పాతతో కొత్త అందం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

పాతతో కొత్త అందం

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే కాకుండా మీ ఇంటికే కొత్త అందాన్ని తీసుకొస్తాయి. అది ఎలాగో చూద్దాం..
పాత కుర్చీలను కొత్తగా..
చాలా మంది ఇళ్లల్లో వుడెన్‌ చైర్స్‌ ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం వాడుతుంటాం కాబట్టి.. చూడ్డానికి పాతగా అయిపోతాయి. అయితే ఇవి మరీ పాతగా అయిపోతే వాటిని స్టోర్‌ రూమ్‌లో పడేస్తుంటారు. ఇలా కాకుండా వీటిని మీరు ఏ రూమ్‌లో పెట్టాలనుకుంటున్నారో ఆ రూమ్‌ గోడలకు సరిపోయే కలర్స్‌ని ఎంచుకుని ఆ కలర్‌ని వాటికి వేయండి. అంతే కాదు... వాటికి కుషన్లు, పిల్లో కవర్స్‌ మార్చండి. దాంతో అవి మళ్లీ కొత్తగా కనిపిస్తాయి.
పాత కిటీకీ తలుపులను...
చాలా మంది పాత తలుపులు, కిటికీలను తీసి పడేస్తుంటారు. అయితే కాస్తా క్రియేటివిటీగా ఆలోచిస్తే వీటిని కొత్తగా మలుచుకోవచ్చు. అదెలాగంటే.. ఆ కిటికీలను, తలుపులను మీకు ఇష్టమైన ఆకారంలో అంటే త్రిభుజాకారం, గుండ్రని ఆకారాల్లో కట్‌ చేయండి. వీటిని ఓ నాలుగు దిక్కులను కలుపుతూ అతికించండి.. ఇప్పుడు దీనిపై మార్కెట్లో దొరికే రకరకాల డిజైన్స్‌లో ఉండే గ్లాస్‌ స్లాబ్‌ తీసుకొచ్చి అతికించండి. అంతే మీకు మంచి సైడ్‌ టేబుల్‌ రెడీ అయినట్టే. చూడ్డానికి కూడా ఎంతో బావుంటుంది.
లాంప్‌ షేడ్‌...
చాలా మంది ఇంటికి అందం తీసుకొచ్చేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఒకటి మంచి రఫుల్‌ లాంప్‌ షేడ్‌.. దీన్ని తయారు చేయడం కోసం పాత లాంప్‌ షేడ్‌ని తీసుకుండి.. దీనికి లెనిన్‌ క్లాత్‌తో రఫుల్స్‌లా కట్‌ చేసి అతికించండి. లాంప్‌ షేడ్‌కి ఏదైనా మంచి రంగుతో పేయింట్‌ వేయండి. అదే రంగులో లెనిన్‌ క్లాత్‌తో తీసుకుంటే లాంప్‌ షేడ్‌ మరింత అందంగా ఉంటుంది. దీన్ని తయారు చేశాక కాస్తా ఆరిన తర్వాత అందులో మంచి లైటింగ్‌ పెట్టండి. ఇది మీ ఇంటికి కచ్చితంగా కొత్త అందాన్ని తీసుకొస్తుంది.
సూట్‌ కేసులు..
సూట్‌ కేసులు చాలా మంది కొంటుంటారు. కొత్తవి కొనగానే పాత వాటిని పడేస్తుంటారు. అలా కాకుండా వాటిని మీ వార్డ్‌రోబ్‌లో పెట్టేయండి. లేదా బెడ్‌ చివర, కిందగానీ పెట్టేయండి. ఇందులో మీ బుక్స్‌ కానీ, దుప్పట్లు కాని పెడుతుంటుండి. ఇలా చేయడం వల్ల మీ పాత సూట్‌కేసులను వాడుతున్నట్లు ఉంటుంది. ఇంటిలో పాత వస్తువులను కూడా దాచినట్లు కూడా ఉంటుంది.
పాత కర్టెన్లని కొత్తగా...
కర్టెన్స్‌ కూడా చూసి చూసి బోర్‌ కొడుతుంటే వాటిని కొత్తగా మార్చొచ్చు. కర్టెన్ల చివర రకరకాల రంగుల పొంపోలను అతికించండి. ఇదే ఐడియా దిండ్లు, కుషన్లకి కూడా వాడొచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మీ ఇంటి రూపే మారి అందంగా కనిపిస్తుంది. 

పాతతో కొత్త అందం

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు మారుతున్నారా..?

13-03-2020

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి సామాను షిఫ్ట్‌ చేసే టైమ్‌లో పడే శ్రమ అంత ఇంతా కాదు. అందుకే కొత్త ఇంటికి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్‌ చేయడంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

manavi

గృహాలంకరణ

అలంకరణలో కళాత్మకం...

04-03-2020

ఇంటికి అలంకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌.. ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా, కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ

manavi

గృహాలంకరణ

కలుపు తీయండి..

21-02-2020

రోజూ చేసే అర గంట గార్డెనింగ్‌ మంచి వ్యాయామం. శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో

manavi

గృహాలంకరణ

చక్కగా సర్దండి...

15-02-2020

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి