కలుపు తీయండి.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

కలుపు తీయండి..

రోజూ చేసే అర గంట గార్డెనింగ్‌ మంచి వ్యాయామం. శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అందువల్ల కెలోరీలు మరీ ఎక్కువయి.. ఊబకాయం దరిచేరకుండా మంచి ఆరోగ్యం, అందమైన గార్డెన్‌ సొంతం చేసుకోవాలంటే కలుపు తొలగించాల్సిందే. గడ్డి పీకడానికి కూడా చిట్కాలా అనుకోకుండా ఇవి ప్రయోగించి చూడండి..
మట్టి తడిగా ఉన్నప్పుడే కలుపు తీయాలి. అప్పుడే వాటిని వేళ్ళతో సహా పీకడం సులభమవుతుంది.
చిన్నగా ఉన్నప్పుడే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తే అవి మళ్ళీ పెరగకుండా ఉంటాయి.
కలుపు మొక్కలు పెద్దవైతే ముందుగా వాటిని పెకిలించడానికి మట్టిని నీళ్లతో బాగా తడపాలి.
వీటి వేళ్ళు బాగా లోతుగా ఉన్నట్టయితే అక్కడ మట్టిని తవ్వి కలుపు తొలగించాలి.
కలుపు మొక్కలను తొలగించడానికి 'V'-ఆకారంలో ఉన్న పదునైన పనిముట్టు ఉపయోగకరంగా ఉంటుంది.
పీకేసిన కలుపు మొక్కలను విధిగా సమూలంగా నాశనం చేయాలి. వీటి విత్తనాలు కూడా విస్తరించకుండా జాగ్రత్తపడాలి. 

కలుపు తీయండి..

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు మారుతున్నారా..?

13-03-2020

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి సామాను షిఫ్ట్‌ చేసే టైమ్‌లో పడే శ్రమ అంత ఇంతా కాదు. అందుకే కొత్త ఇంటికి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్‌ చేయడంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

manavi

గృహాలంకరణ

అలంకరణలో కళాత్మకం...

04-03-2020

ఇంటికి అలంకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌.. ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా, కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ

manavi

గృహాలంకరణ

పాతతో కొత్త అందం

19-02-2020

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో

manavi

గృహాలంకరణ

చక్కగా సర్దండి...

15-02-2020

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి