అలంకరణలో కళాత్మకం... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

అలంకరణలో కళాత్మకం...

ఇంటికి అలంకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌.. ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా, కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఇంట్లో కొన్ని చిన్న మార్పులను తీసుకురావడంతో మీ మనసుకు కొంత సానుకూలత కూడా వస్తుంది. అయితే దీనికోసం షాపులకు తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి. వీటిలో మీ అలంకరణకు కావాల్సిన కొన్ని వస్తువులను ఎంచుకోండి.
ఫోల్డబుల్‌ అవుట్‌ డోర్‌ సెట్‌
ఫోల్డబుల్‌ అవుట్‌ డోర్‌ సెట్‌... మీ ఇంటికి మరింత అందాన్ని తెస్తుంది. ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. అవసరం లేనప్పుడు దీన్ని మడతపెట్టి గదిలో మూలాన పెట్టచ్చు. అవసరమైతే అదనపు సీటింగ్‌ను కూడా పెంచుకోవచ్చు. టేకు చెక్కతో ఆయిల్‌ ఫినిష్‌తో ఇది తయారు చేసినవి ఎంతో అందంగా ఉంటాయి. ఈ ఫర్నీచర్‌కు కుషన్లు తోడైతే ఆ లుక్కే వేరు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో లభిస్తాయి.
3 డి ప్రింటెడ్‌ కార్పెట్‌
మీరు మీ ఇంట్లో కార్పెట్‌ ఉపయోగించకపోతే ఈ 3 డి ప్రింటెడ్‌ కార్పెట్‌ మంచి ఎంపిక. అపార్టుమెంటులలో 3 డి ప్రింటెడ్‌ కార్పెట్‌ ఇంటికి అదనపు అందాన్ని ఇస్తుంది. తక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాక ఎంతో సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. దీన్ని బెడ్‌ రూమ్‌లో, లాంజర్‌ ముందు లేదా బాల్కనీలో కూడా అలంకరణగా పెట్టొచ్చు. వీటిలో ఎన్నో ఆసక్తికరమైనా, ప్రత్యేకమైన డిజైన్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి.
పౌఫ్‌ స్టూల్స్‌
ఏడాది నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన గృహాలంకరణ ఫర్నిచర్‌లో పౌఫ్‌ స్టూల్స్‌ ఒకటి. ఇవి చిన్నగా, అందంగా ఉంటాయి. ఈ అందమైన స్టూల్స్‌ కాంపాక్ట్‌ మోడల్‌గా ఉన్నందున తక్కువ కాలంలోనే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఈ పౌఫ్‌ స్టూల్స్‌ మీ ఇంటికి అదనపు అందాన్ని ఇస్తాయి. అందుకే మీరు కూడా మీ ఇంటి అలంకరణ కోసం వీటిని ఎంపిక చేసుకోవచ్చు.
వింగ్‌ కుర్చీ
ప్రస్తుతం ఈ కుర్చీలకు కూడా డిమాండ్‌ ఎక్కువ గానే ఉంది. ఈ కుర్చీలు గది సీటింగ్‌కు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ కుర్చీలు అధునాతన డిజైన్లతో పాటు మరిన్ని రంగుల్లో లభిస్తాయి. అందుకే అనేక మంది తమ ఇంటి ఈ కుర్చీలే బెస్ట్‌ అంటున్నారు. ఈ కుర్చీ మీ ఇంటికి మరింత అందాన్ని మాత్రమే కాక ఆకర్షణీయమైన వాతావరణాన్ని ఇస్తుంది.
ఫ్లోర్‌ లాంప్స్‌
ఏదైనా గది అందంగా కనిపించాలంటే లైటింగ్‌ చాలా అవసరం. సరైన లైటింగ్‌ మన మానసిక స్థితిని సెట్‌ చేస్తుంది. ఇటీవల ''మినిమలిస్ట్‌ ఇంటీరియర్స్‌'' ఇంటి రూపు రేకలనే మార్చేస్తున్నాయి. ఈ ఫ్లోర్‌ లాంప్స్‌ ఇంటికి అదనపు అందాన్ని ఇస్తాయి. ఒకప్పటిలా స్థలాన్ని ఆక్రమించేలా కాకుండా తక్కువ స్థలంలోనే మీ ఇంటికి క్లాసీ లుక్‌ ఇచ్చేలా ఈ ఫ్లోర్‌ లాంప్‌లు రకరకాల డిజైన్‌లలో దొరుకుతున్నాయి. మీరు దీన్ని బెడ్‌ రూమ్‌, హల్‌ ఇలా ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్‌ లాంప్స్‌ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు మనసుకి ప్రశాంతతను ఇస్తాయి. ఫ్లోర్‌ లైట్స్‌ వల్ల వచ్చే కాంతి కింద కూర్చొని చదువుకోడానికి ఉపయోగపడుతుంది.
మల్టీపర్పస్‌ లాప్‌ టాప్‌ టేబుల్‌
ఈ మధ్య కాలంలో ల్యాప్‌టాప్‌ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అయితే లాప్‌ టాప్‌లో వర్క్‌ చేసేటప్పుడు వడిలో పెట్టుకోకుండా దీనికి ఓ టేబుల్‌ ఉంటే మంచిది.. ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తినటానికి, పిల్లలని చదివించటానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ టేబుల్‌లో లాప్‌టాప్‌తో పాటు పెన్స్‌, కాఫీ కప్‌ వంటి వస్తువులను పెట్టుకునే సదుపాయం కూడా దీనికి ఉంది. ఈ టేబుల్స్‌ అందరికి అందుబాటు ధరల్లో ఆన్‌ లైన్‌లో దొరుకుతున్నాయి. ు

అలంకరణలో కళాత్మకం...

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

ఇల్లు మారుతున్నారా..?

13-03-2020

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి సామాను షిఫ్ట్‌ చేసే టైమ్‌లో పడే శ్రమ అంత ఇంతా కాదు. అందుకే కొత్త ఇంటికి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్‌ చేయడంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

manavi

గృహాలంకరణ

కలుపు తీయండి..

21-02-2020

రోజూ చేసే అర గంట గార్డెనింగ్‌ మంచి వ్యాయామం. శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి

manavi

గృహాలంకరణ

పాతతో కొత్త అందం

19-02-2020

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో

manavi

గృహాలంకరణ

చక్కగా సర్దండి...

15-02-2020

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి