ఇల్లు మారుతున్నారా..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

ఇల్లు మారుతున్నారా..?

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి సామాను షిఫ్ట్‌ చేసే టైమ్‌లో పడే శ్రమ అంత ఇంతా కాదు. అందుకే కొత్త ఇంటికి మారుతున్నప్పుడు సామాను ప్యాకింగ్‌ చేయడంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే మన సామాను పదిలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ఇంట్లోని పాత వస్తువులపై ఎంతో మమకారం పెంచుకుంటాం. ఇది మంచిదే కానీ, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇల్లు మారేటప్పుడు వాటన్నింటినీ మోసుకుపోవడం వృధా. అందుకే మీరు ఉపయోగించని వస్తువులను పక్కనపెట్టేయడం, వేరేవారికి వాటి అవసరం ఉంటే వారికి ఇవ్వడం, లేని వారికి ఇవ్వడం వంటివి చేయడం వల్ల మీకు ఓ తృప్తి ఉంటుంది.
వస్తువులను వర్గీకరించండి
బట్టలు, పుస్తకాలు, పాత్రలు ఇలా అన్నింటిని వేర్వేరుగా ప్యాక్‌ చేసుకోవాలి. ఎందులో ఏం ప్యాక్‌ చేసామనే విషయాన్ని కొన్ని సార్లు మరిచిపోతుంటాం. అయితే, లోపల ఉన్నదాన్ని గుర్తించడానికి దాని పైన నెంబర్‌, గుర్తుగా ఎదో ఒకటి రాయండి. దీని వల్ల మీరు త్వరగా వాటిని గుర్తించొచ్చు. అన్‌ ప్యాక్‌ చేసేటప్పుడు ఇది పనులను సులభతరం చేస్తుంది. వస్తువులను అన్నిటికంటే జాగ్రత్తగా ప్యాక్‌ చేయించుకోవాలి. ముఖ్యంగా గాజు సామాన్లు. సున్నితమైన వస్తువులను బబుల్‌ ర్యాప్‌ లో ప్యాక్‌ చేయాలి. లేదా మీరు వాటిని బట్టలు, టవల్స్‌తో చుట్టొచ్చు. అప్పుడు అవి పగలకుంగా ఉంటాయి.
ఎప్పుడు మారాలి
ఇల్లు మారెటప్పుడు వస్తువులను ప్యాక్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. అందుకే కొన్ని ఆన్‌లైన్‌ సేవల్ని వినియోగించుకోవచ్చు. హెవీ ఫర్నిచర్‌, ఇతర గృహోపకరణాలను మీరే స్వయంగా మార్చలేరు. అందుకే సరైన వారిని ఎంచుకుంటే వారే మీ వస్తువులను భద్రంగా మీ కొత్త ఇంటికి మార్చుతారు. వస్తువులను షిఫ్ట్‌ చేసేటప్పుడు శనివారం, ఆదివారం కాకుండా వారం మధ్యలో అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే వీకెండ్స్‌లో చేస్తే ఎక్కువ ఖర్చు అవ్వొచ్చు. అందుకే మీరు వారపు రోజుల్లో మీ వస్తువులను షిఫ్ట్‌ చేసుకుంటే ఆ సంస్థల నుండి కొన్ని తగ్గింపులను కూడా పొందొచ్చు. సాధారణంగా వారాంతాల్లో ఎక్కువ బిజీగా ఉంటారు. కాబట్టి రేట్‌ కూడా పెరుగుతుంది. అయితే ఇల్లు మారేటప్పుడు మెయిన్‌ ఐటెమ్స్‌ని ముందుగానే ఫొటో తీసుకోండి. ఫొటోలు తీయడంలో తప్పు లేదు. ఒకవేళ సామాన్లు తెచ్చేటప్పుడు ఏదైనా నష్టం జరిగితే మీరు దానిని క్లెయిమ్‌ చేయవచ్చు. రవాణా చేసే ముందు మీ వస్తువులకు ఎంత నష్టం జరిగిందో తెలపడానికి ఈ ఫొటోలను చూపించొచ్చు .కొత్త ఇంటికి మారేటప్పుడు సర్టిఫికెట్స్‌, ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని మీతో పాటు తీసుకెళ్లడం మరీ మంచిది. ఎందుకంటే ఇలాంటి టైమ్‌లో వాటిని మిస్‌ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఇల్లు మారుతున్నారా..?

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

అలంకరణలో కళాత్మకం...

04-03-2020

ఇంటికి అలంకరణే వన్నె తెస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, లివింగ్‌ రూం, డ్రెస్సింగ్‌ రూం, కిచెన్‌.. ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా, కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ

manavi

గృహాలంకరణ

కలుపు తీయండి..

21-02-2020

రోజూ చేసే అర గంట గార్డెనింగ్‌ మంచి వ్యాయామం. శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి

manavi

గృహాలంకరణ

పాతతో కొత్త అందం

19-02-2020

చాలా మందికి ఇంటిని అలంకరించుకోవడమంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎలా సర్దాలో తెలియదు. ముఖ్యంగా పాత కుర్చీలు, టేబుల్స్‌, సూట్‌కేసులు ఇలాంటివన్నీ పాతగా అయిపోయాయని పక్కనపడేస్తారు. అయితే కొద్దిగా క్రియేటివిటీని వీటికి జోడిస్తే అవి కూడా కొత్తగా మెరవడమే

manavi

గృహాలంకరణ

గాజు పాత్రల్లో గార్డెన్‌

17-02-2020

ఇంట్లోని గాజు పాత్రలు, సీసాలు వృథాగా ఉంటున్నాయా..? వాటితో ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారా? అయితే వాటిని బయటకు తియ్యండి. వాటితో మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేయవచ్చు. మనం మామూలుగయితే మొక్కలను మట్టి కుండల్లో పెంచుతాం. కానీ ఈ గాజుపాత్రలలో

manavi

గృహాలంకరణ

చక్కగా సర్దండి...

15-02-2020

బట్టలు ఉతికి, ఐరన్‌ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్‌కి వెళ్లే పిల్లల నుంచి