ఆమె కూచిపూడికే 'శోభ' | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

ఆమె కూచిపూడికే 'శోభ'

భారతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటే నత్య రూపకాలలో కూచిపూడిది ప్రత్యేక స్థానం. తెలుగు భాష అంటే మనలో ఆత్మాభిమానం ఎలా ఉప్పొంగుతుందో తెలుగువారి నత్యరీతి కూచిపూడి నత్య ప్రదర్శన చూసినా వెలకట్టలేని ఆనందం కలుగుతుంది. అటువంటి కూచిపూడి నత్య వైభవాన్ని ఆమె ప్రపంచానికి చాటారు. కూచిపూడికి పర్యాయపదం ఆమే అంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ నత్యమే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకుని వేదికపై నాట్యం చేస్తుంటే ఆ పాత్రలు ఆమెలో అలా ఒదిగిపొతాయి. అంకుటిత దీక్ష, కఠోర శ్రమతో నత్యాన్ని అభ్యసించి, కళాకారిణి అయిన వ్యక్తి డా|| శోభానాయుడు. కూచిపూడి నత్యరీతిని సాధారణ ప్రజలకు సైతం చేరువు చేస్తున్న ఘనత ఆమెది. కళ కళ కోసం కాదు సమాజహితం కోసం అని నమ్మిన ప్రముఖ కూచిపూడి కళాకారుల్లో పద్మశ్రీ శోభా నాయుడు ఒకరు.
శోభానాయుడు అనకాపల్లిలో 1956లో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. ఈమె కూచిపూడి నత్యంలో ఎదుగుతారని తల్లి చిన్నప్పుడే గుర్తించారు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నప్పుడు.. శోభానాయుడు కాళ్లుచేతుల కదలికలను ఆమె గమనించారు. అప్పుడే కూతురుకు నత్యం నేర్పించాలని భావించారు. ఇందుకోసం ఆమె కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశారంట. ఇదే విషయాన్ని శోభానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మూడో ఏటన ఆ కుటుంబం రాజమండ్రికి వెళ్లిపోయింది. అక్కడ నాల్గో ఏట నుంచే శోభానాయుడికి కూచిపూడిలో శిక్షణ ఇప్పించేందుకు తల్లి దష్టి సారించారు.
తల్లి ప్రోత్సాహంతో...
నత్యంలో ఆమె ఇచ్చిన హావభావాలు, అభినయం చూసి తల్లి.. మరింత బాగా తీర్చిదిద్దాలని చెన్నైలోని చిన వెంపటి సత్యం వద్ద శిక్షణకు పంపించారు. ఆడపిల్లను అంత దూరం పంపించే విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరోజనిదేవి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమార్తెలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. తల్లి ఇచ్చిన ప్రేరణే శోభానాయుడిని ఈ స్థాయికి తీసుకెళ్లిం దనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా 12 ఏండ్లకే ప్రదర్శనలివ్వడం ప్రారంభించిన శోభా నాయుడు సత్య భామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె బహుముఖ ప్రతిభకు అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఎన్నో పురస్కారాలు, వివిధ దేశాల్లో నత్య ప్రదర్శనల అవకాశాలు దక్కించుకున్న ఆమె కూచిపూడి కళాప్రియుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోయారు. నత్యానికే అంకితమయిపోయి, ఎన్నోసార్లు సినిమాల్లో అవకాశాలు వచ్చినా వద్దనేవారు. ఇది ఆమెకు కళ పట్ల ఉన్న దీక్షకు, క్రమశిక్షణకు నిదర్శనం. జీవితంలో ఎంతో సాధించినా శోభనాయుడు మాట సున్నితం, మనసు నవనీతం.
దేశ విదేశాలలో వేలాది ప్రదర్శనలు
దేశంలో కొన్నివేల నత్య ప్రదర్శన లిచ్చారు శోభా నాయుడు. అలాగే యుకె, యుఎస్‌ ఎస్‌ఆర్‌, సిరి యా, టర్కీ, హాంగ్‌కాంగ్‌, బాగ్దాద్‌, కంపూ చియా, బాంకాక్‌, వెస్ట్‌ ఇండీస్‌, మెక్సికో, వెనిజులా, ట్యూ నిష్‌, క్యూబా, మారిషిస్‌ మొద లగు ఎన్నో దేశాలు పర్యటించి మన కూచిపూడి కీర్తి పతాకాను ఎగురవేశారు. ఆమె ప్రదర్శనకు విదేశీ పత్రికలు India outstanding  అని ప్రశంసించాయి.
గురువుగా శిక్షణ
1980లో హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్‌ అకాడమీకి ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు ఆమె. వేలాదిమంది శిష్యులు, ప్రశిష్యులు ఈవిడ శిక్షణవల్ల నత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. శోభానాయుడు శిష్యులు కూడా నత్య ప్రదర్శనలిస్తూ శిక్షణనిస్తూ కళకు ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె విద్యార్థులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. విద్యార్థుల నుండి అతి తక్కువ ఫీజు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌తో అకాడమీని గత నలబై ఏండ్లుగా నడుపుతున్నారు.
దేశ విదేశాలలో ప్రసంగాలు..
నత్యంపై మక్కువతో చదువుకు మద్యలోనే స్వస్తి చెప్పాల్సివచ్చింది. అయినప్పటికీ పట్టుదలతో మాతభాషతో పాటు ఆంగ్లంపై కూడా పట్టుసాధించారు. దేశ విదేశాలలో కూడా ఎన్నో అసంఖ్యామైన లెక్చర్‌ డెమాన్‌స్ట్రేషన్స్‌ ఇచ్చారావిడ. తెలుగులో ఎంత బాగా చెపుతారో, ఆంగ్లం మీద కూడా అదే పట్టుతో వివరిస్తారు. కూచిపూడి నత్యానికి శోభానాయుడు చేసిన సేవకి తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. ఇప్పటి వరకు ఆమె 15 బ్యాలేలు, 80పైగా సోలో నత్యాంశాలు కొరియోగ్రఫి చేశారు. స్వయంగా తనే నాయిక, నాయక పాత్రలలో రాణించారు. శ్రీవేంకటేశ్వర భక్తిచానల్‌లో 'సాధన' అనే శిక్షణా ప్రోగ్రాం ద్వారా 2008 నుండి నత్యం నేర్పిస్తున్నారు. సిరిసిరిమువ్వ అనే సంస్కతి చానెల్‌లో కూడా కళను ఎంతో పైకి తెచ్చారు. 'పద్మావతిగా కళ్యాణ శ్రీనివాసం'లో ఆవిడ ప్రతిభను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఎన్నో ప్రదర్శనలు పెట్టారు. ఇంకా వీడియోలు కూడా రికార్డు చేయించారు.
పురస్కారాలు.. సత్కారాలు
కష్ణగానసభ - మద్రాసు వారు శోభానాయుడుకి 'నత్య చూడామణి' ఇచ్చి సత్కరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన కంద్ర సంగీత నాటక అకాడమీ 1991లో అవార్డును కూచిపూడి కోసం ఇచ్చారు. 1991లో బాంబేలో శ్రీ శంగార సంసద్‌ వారు ఆవిడకు 'నత్యవిహార్‌' ఇచ్చారు. 1996లో నంగంబాకం కల్చరల్‌ అసోసియేషన్‌, మద్రాసు 'నత్యకళా శిరోమణి' ఇచ్చి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్‌.టి.ఆర్‌ జయంతి సందర్భంగా అవార్డు, 'హంస' అవార్డులను ఇచ్చి గౌరవించింది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉగాది పురస్కారాన్ని ఇచ్చారు. భారత ప్రభుత్వం ఎంతో గౌరవనీమైన 'పద్మశ్రీ' ఇచ్చి సన్మానించింది. 2011లో తంగిరాల కష్ణప్రసాద్‌ స్మారక రంగస్థల పురస్కారంతో పాటు ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు పొందినా నత్యానికే ఆవిడ ఆభరణం. ఆమె కూచిపూడికే శోభ. తాను అమితంగా ప్రేమించే కళకు మరెంతో సేవ చేయాలనేది ఆమె కోరిక. కళ కోసం నిత్యం తపించే ఈమె ఆకాల మరణం కూచిపూడికి తీరని లోటు.
తరతరాలకు గుర్తుండే పాత్రలెన్నో..
ఎన్నో నత్యరూపకాలు, బ్యాలేలు శోభానాయుడు స్వయంగా కొరియోగ్రఫి ఇచ్చి, వాటిలో నాయిక లేదా నాయక పాత్రలలో జీవించారు. విప్రనారాయణ, కళ్యాణ శ్రీనివాసం, శ్రీకష్ణ శరణం మమ, విజయోస్తుతే నారీ, క్షీరసాగర మథనం, సర్వం సాయిమయం, జగదానంద కారక, గిరిజా కళ్యాణం, స్వామి వివేకానంద, నవరస నటభామిని ఇలా ఎన్నో నత్య రూపాలకు కొరియోగ్రఫి చేశారు. సత్యభామ, ఛండాలిక, దేవదేవి, పద్మావతి, మోహిని, సాయిబాబా, పార్వతి, వివేకానంద, శ్రీరాముడు మొదలగు ఎన్నో పాత్రలకు జీవంపోశారు. ముఖ్యంగా దేవదేవి పాత్ర చేయడం చాలా కష్టం. అందరూ చేసి ఒప్పించలేరు. విప్రనారాయణలో దేవదేవి పాత్ర ఆవిడ చేస్తున్నపుడు ఒళ్లు పులకరిస్తుంది. ఇంతటి కష్టమైన పాత్ర కూడా శోభానాయుడు అవలీలగా, సునాయాసంగా చేస్తారు.

ఆమె కూచిపూడికే 'శోభ'

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

ఆమె ఓ నిప్పు కణిక

30-10-2020

దేశ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మహిళా మణిపూసలు ఎందరో బయటకు వస్తారు. స్త్రీ కేవలం ఇంటికే పరిమితమైన రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నవారు