క(ల)ళ అందరి సొత్తు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

క(ల)ళ అందరి సొత్తు

''చిన్న చిన్న కలలు నెరవేర్చుకుంటూ పెద్ద కల సాకారానికి కృషి చేయండి'' అని అబ్దుల్‌ కలాం చెప్పిన మార్గాన్ని అనుసరించిన వారెందరో. కళనే తన కలగా మలుచుకుని ఒక్కొక్క మెట్టూ అధిగమిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందీ హైదరాబాదీ అమ్మాయి. పేరు సయ్యదా ఆష్నా తురబి. వయసు 14 ఏండ్లు. పదో తరగతి చదువుతున్న ఆష్నాకు పుట్టుకతోనే ఈ కళ అబ్బిందని చెప్పవచ్చు. ''వంశపారంపర్యంగా కళలు అబ్బుతాయి''అనుకునే ఎంతోమంది సాంప్రదాయ వాదుల అభిప్రాయాలను భగం చేస్తూ తన కుటుంబంలో ఏ ఒక్కరికీ అబ్బని కళను సొంతం చేసుకుంది. కుంచెతో పాకులాడిన ఈ బాలిక నేడు తన కళాప్రావీణ్యాన్ని లండన్‌కు చేరవేసింది.

అష్నా తురబి తండ్రి ఉరూజ్‌ తురబి. వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్టు. పుట్టుకతోనే తన కూతురిలో ఒక చిత్రకారిణి ఉందని పసిగట్టిందీ ఆయనే. కూతురి చేతికి సహజంగా అబ్బిన కళను అన్ని ముస్లిం సాంప్రదాయిక కుటుంబాల్లోని తండ్రుల్లా చిదిమేయలేదు. ఆ చిట్టి చేతుల్లోని అంకురానికి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చక్కటి ఊతమిచ్చారు. తన కెమెరాలో ఆ చిత్రాలను బంధించి సోషల్‌ మీడియాలోని యాప్స్‌ అయిన ఫేస్బుక్‌, వాట్సప్‌ తదితర మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి ఆనందించేవారు. స్నేహితులంతా అభినందిస్తే ఉబ్బి తబ్బిబ్బయ్యేవారు.
ఒకరోజు భారతీయ మూలాలున్న లండన్‌లోని వ్యాపారవేత్త సయ్యద్‌ అమ్జద్‌ అలీ ఫేస్‌బుక్‌లోని ఆష్నా గీసిన చిత్రానికి ముగ్ధులయ్యారు. వెంటనే భార తీయత ఉట్టి పడేలా రూపొం దిస్తున్న తన రెస్టా రెంట్లో ఆ చిత్రాన్ని అలంక రించాలని ముచ్చట పడ్డారు. ఉరూజ్‌ తురబిని సంప్రదించి ఆష్నా కుంచెను అభినందిం చారు. ఆ చిత్రాన్ని లండన్‌కు తరలిం చారు. అంతేకాదు తెలంగాణాలోని విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలు, గుట్టలు వంటి ప్రకృతి దృశ్యాలతో మరిన్ని చిత్రాలను గీయాలని కోరారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఆష్నా ఎన్నో అద్భుతమైన చిత్రాలను గీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె గీసిన వాటిలో చార్మినార్‌, మక్కా మసీదులలో సాయంకాలాల్లోని సందడి బహుసుందరంగా కనిపిస్తుంది. ఒక్కొక్క చిత్రరాజం ఐదు నుంచి ఆరు అడుగుల వరకూ ఉన్నాయి.లండన్‌ రెస్టారెంట్లో కొలువుతీరిన తన పనితనం పట్ల ఆష్నా ఎంతో సంతోషంగా ఉంది.
''నేను గీసే ప్రతి చిత్రానికి నాన్నే తొలి గురువు. కుంచె సరిగ్గా పట్టుకోవడం నేర్చుకున్నానంటే... అది నాన్న వల్లనే. ఏ చిత్రాన్ని గీస్తే ఎంత బాగుంటుందనేది ఆయన తన ఫొటోగ్రఫిక్‌ వ్యూ తో చెబితే నేను నా కుంచె ద్వారా రంగులు కూర్చి చూపేదాన్ని. అందుకే నా తొలి గురువు నాన్నే. బాల్యం నుంచి స్వతహాగా రంగులతో ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రముఖ ఆర్టిస్ట్‌ ఫవాద్‌ తమ్కనత్‌ వాటిల్లో మెళకువలను చెబుతున్నారు.'' అంటూ ఆష్నా చెప్పుకొచ్చింది. తన కళ తనకు పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని మురిసిపోతోంది. ఉపాధ్యాయులు సైతం ఆమె కళకు అబ్బురపడి పాఠశాల ప్రాంగణంలో ప్రతీ ఏటా ఆష్నా చిత్ర కళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంటారని ఎంతో ఆనందంగా చెబుతుంది.
ఆష్నా తురబి తనతోపాటు తన కళనూ మరింత ఉన్నతికి చేర్చాలని మనమూ ఆశిద్దాం.
''పిల్లల కల''కు చేయూతనివ్వండి
''మనం కన్న కలలను నిజం చేయాలని పిల్లలపై ఒత్తిడి చేయడం తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు. పుట్టుకతోనే ప్రతి చిన్నారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. పిల్లలు చేసే పనులు పెద్దల కళ్ళకు తప్పుగా కనిపిస్తాయి. దాంతో వారిని వారించే ప్రయత్నం చేస్తే... వారి సృజనాత్మకత కూడా అక్కడితో ఆగిపోతుంది. వారు కనే ప్రతి కలకూ ఆడా మగ తేడా చూడకుండా తోడ్పాటు అందిస్తే చాలు. వారు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతారు'' అంటూ తన కుమార్తెను ఉదాహరణగా చూపుతున్నారు ఆష్నా తండ్రి ఉరూజ్‌ తురబి.

- నస్రీన్‌ ఖాన్‌

క(ల)ళ అందరి సొత్తు

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

ఆమె ఓ నిప్పు కణిక

30-10-2020

దేశ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మహిళా మణిపూసలు ఎందరో బయటకు వస్తారు. స్త్రీ కేవలం ఇంటికే పరిమితమైన రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నవారు