మగవారికి ధీటుగా పని చేస్తా | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

మగవారికి ధీటుగా పని చేస్తా

బబ్బురి శిరీష... పల్లెటూరులో పుట్టి పెరిగి కడు పేదరికంలో జీవించింది. అక్షరాలను నేర్చుకొని ఐటీఐ పాసైంది. రాష్ట్రంలో ఇంతవరకు మహిళలు చేయని లైన్‌ ఉమెన్‌ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతో మంది ఆడపడుచులకు వెలుగు బాట చూపింది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆమెకు ఎన్నో అవరోధాలు, కష్టాలు ఎదురయ్యాయి. వివక్షకు గురయ్యింది. అయినా పట్టుదలతో కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించిన ఆమె గురించి మరిన్ని విశేషాలు...
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో మర్కుక్‌ మండల పరిధిలోని చేబర్తి గ్రామంలో వెంకటేశం, రాధల కూతురు శిరీష. వారిది నిరు పేద కుటుంబం. కుటుంబానికి ఆసరాగా నిలవాలనే సంకల్పంతో పదో తరగతి పూర్తికాగానే హైదరాబాద్‌లో ఐటీఐ కాలేజీలో చేరింది శిరీష.
మహిళలకు లేదన్నారు
ప్రతిరోజూ చేబర్తి నుంచి బస్సులో హైదరాబాద్‌కు వెళ్లి ఐటీఐ పూర్తి చేసింది. కోర్సు పూర్తి చేసే సమయానికి అంటే ఏడాది కిందట నవంబర్‌ చివర్లో లైన్‌మెన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ద్వారా ప్రభుత్వం జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆమె ప్రయత్నించింది. అయితే అందులో మహిళలకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌ లేదు. దాని గురించి అధికారులను సంప్రదిస్తే పురుషులకు మాత్రమే అవకాశం ఉందని, మహిళలకు లేదని స్పష్టం చేశారు.
కోర్టుకు వెళ్ళి మరీ...
మహిళలకు ఆప్షన్‌ లేకపోవడంతో ఆమె చాలా ఆందోళనకు గురయింది. ఈ రోజుల్లో ఇంకా ఆడ, మడ తేడాలు చూపే ఉద్యోగాలు ఉన్నాయా అని బాధ పడింది. ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఆమెతో పాటు మరో 34 మంది మహిళలు కూడా హై కోర్టును ఆశ్రయించారు. మొత్తానికి కోర్టు పర్మిషన్‌ ఇవ్వడంతో 2020 నవంబర్‌ 23న హైదరాబాద్‌ యూసుఫ్‌గూడాలోని సీపీటీఐ (సెంట్రల్‌ ఫవర్‌ ట్రైనీ ఇన్సిట్యూట్‌)లో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో టోల్‌ కైబ్బింగ్‌ పరీక్ష నిర్వహించారు. అందులో శీరీష విజయవంతంగా పరీక్ష నెగ్గింది.
మామయ్య దగ్గరే ట్రైనింగ్‌
శిరీష వాళ్ల మామయ్య శేఖర్‌ గౌడ్‌ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో సబ్‌ ఇంజనీర్‌గా చేస్తున్నారు. మొదట ఆయన కూడా లైన్‌మెన్‌గానే పని చేశారు. బాగా కష్టపడే మనస్తత్వం ఆయనది. మామయ్య లాగా విద్యుత్‌ స్తంభాలు ఎక్కాలనీ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించాలని శీరీషకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఆ పోస్టులకు పురుషులకు మాత్రమే ఎందుకు ఎంపిక చేస్తారు అని మహిళలు ఎందుకు అవకాశం ఇవ్వారు అని ఆమె మామయ్యే ఆమెకు విద్యుత్‌ స్తంభం ఎక్కడంలో నైపుణ్యాలు, మెలకువలు చెబుతూ శిక్షణ ఇచ్చాడు.

సరైన ఆహారం కూడా లేక...
చేబర్తి, గణేష్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌లలో స్తంభాలు ఎక్కడం ఆమెకు నేర్పించాడు. దాంతో ఆమెలో మరింత ధైర్యం పెరిగింది. ఆ స్తంభాలను ఎక్కేటప్పుడు, శిక్షణ తీసుకునేటప్పుడు రేషన్‌ బియ్యం తప్ప ఇతర పోషక ఆహారం తీసుకునే ఆర్థిక స్తోమత ఆమెకు లేదు. దాంతో ఆమె ఫిజికల్‌ పిట్‌నెస్‌ కోసం అవసరమైన పోషకాహారం కూడా ఆమె మామయ్యనే సమకూర్చాడు. దాదాపు ఎనిమిది నెలల పాటు మామయ్య పర్యవేక్షణలోనే సాధన చేసింది. ఎట్టకేలకు ఎంతో ఆత్మ విశ్వాసం, అంతకు మించిన ధైర్యం, మామయ్య, తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో లైన్‌ ఉమెన్‌గా ఉద్యోగం సాధించి రాష్ట్రంలోనే తొలిమహిళా లైన్‌ ఉమెన్‌గా విధులు నిర్వర్తిస్తూ చరిత్ర సృష్టించింది.
పుట్టుకతో ఏదీ రాదు:బబ్బురి శిరీష
శ్రమ, పట్టుదల, అంతకు మించి ఆత్మ స్జైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు, పుట్టుకతో ఎవ్వరికీ ఏది రాదు. నేర్చుకుంటే అన్ని వస్తాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషుల కంటే ధీటుగా ఉండాలి. లైన్‌ ఉమెన్‌గా ఉద్యోగం సంపాదించినప్పుడు రాష్ట్ర గవర్నర్‌ తమిళసై నన్ను ట్విట్టర్‌లో అభినందించిన విషయం జీవితంలో మర్చిపోలేనిది. ఒక పేద కుటుంబానికి చెందిన నన్ను గవర్నర్‌ గుర్తించి ప్రశంసించడం ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. లైన్‌ ఉమెన్‌గా మెరుగ్గా సేవలు అందిస్తా. పురుషులతో ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండి వారి కంటే ధీటుగా పని చేయగలరని నిరూపిస్తా.

- జి.యాదగిరి, మర్కుక్‌, నవతెలంగాణ

మగవారికి ధీటుగా పని చేస్తా

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి

17-02-2021

ది లాస్ట్‌ క్వీన్‌ మహారాణి జిందన్‌ కౌర్‌.. ఆ కాలంలోనే సంప్రదాయాన్ని ధిక్కరించి ప్యాలెస్‌ వెలుపల అడుగుపెట్టింది. తన ముసుగును పక్కన పెట్టి బ్రిటిష్‌ వారు పంజాబ్‌ను స్వాధీనం

manavi

ముఖాముఖి

మరో మహిళకు కీలక బాధ్యతలు

27-01-2021

అమెరికా పరిపాలనా వ్యవహారాలో భారత సంతతికి చెందిన మరో మహిళ అవకాశం దక్కించింది. అది కూడా కీలకమైన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టింది. ఆమే సమీరా ఫజిలి. అమెరికా పరిపాలనా విభాగంలో ఈ

manavi

ముఖాముఖి

ఆమెకు అరుదైన గౌరవం

26-01-2021

భారత దేశంలోనే మొదటి మహిళా ఫైటర్‌ పైలెట్‌గా చరిత్ర సృష్టించింది. గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా నారీశక్తి పురస్కారాన్ని అందుకుంది. మరి ఇప్పుడు... 1950 నుండి ఇప్పటి వరకు జరిగన గణతంత్ర వేడుకల్లో ఏ మహిళకూ

manavi

ముఖాముఖి

చైతన్యం రావాలంటే చదువే మార్గం

24-01-2021

ఇంగ్లీషు మోజులో పడి అందరూ తెలుగు మర్చిపోతున్న కాలమిది. చదువంటే ఇంజనీరింగ్‌, మెడిసెన్‌ మాత్రమే అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఓ ముస్లిం యువతి తెలుగు సాహిత్యంలో రాణించేందుకు ఆసక్తి చూపిస్తోంది. మాతృభాష ఉర్దూ

manavi

ముఖాముఖి

రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ

20-01-2021

హిమా కోహ్లీ... కొన్ని రోజులుగా ఈ పేరు దేశమంతా మారు మోగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులై చరిత్ర సృష్టించడం ఓ విశేషమైతే. ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో ఈమే

manavi

ముఖాముఖి

కష్టాలకు కుంగిపోకుండా...

19-01-2021

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వైఫల్యాలతో కుంగిపోకుండా తమ శక్తి సామర్థ్యాలను సమాజానికి చాటి చెబుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది ఇలవరసి జయకాంత్‌. ఓ దోపిడిలో సర్వం కోల్పోయిన ఈమె తన సంకల్పంతో

manavi

ముఖాముఖి

కంటెంట్‌ సృష్టికర్త నిహారిక

06-01-2021

ఇరవై మూడేండ్ల నిహారిక ఎన్‌ఎమ్‌... లాక్‌డౌన్‌ సమయంలో ఒంటరిగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ సమయంలోనే యూట్యూబ్‌.. సోషల్‌ మీడియా ద్వారా ప్రభావితమైంది. యూట్యూబ్‌ కంటెంట్‌ సృష్టికర్తగా మారిపోయింది.

manavi

ముఖాముఖి

సేవలోనూ ఆమెకు లేరు సాటి

29-12-2020

2020... ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. కరోనా మహమ్మారి ప్రజా జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మీకు మేమున్నామంటూ సేవలు చేసిన ధీర వనితలు ఎందరో.