స్వచ్ఛతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

స్వచ్ఛతకు బ్రాండ్‌ అంబాసిడర్‌

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాల పరిశుభ్రతది కీలకపాత్ర.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమాన్ని జిల్లాలో ఒక ఉద్యమంలా తీసుకెళ్తూ అనారోగ్యాల శాతాన్ని గణనీయంగా తగ్గించగలిగారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన. ప్రభుత్వ పథకాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు కొత్త కార్యక్రమాలు చేపట్టి జాతీయ స్థాయిలోనూ జిల్లాను ఆదర్శంగా నిలిపారు. ఆమె కృషికి ఫలితంగా ఏకంగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇంత సాధించినా అందిరి సహకారం, భాగస్వామ్యం వల్లే సాధించానని చెబుతారు. జిలాల్లో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి, ఆరోగ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. జిల్లాకు మంచి పేరు తెచ్చే దిశలో ప్రయాణిస్తున్నారు.
  పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులను భాగస్వాములను చేశారు. తానే ముందుగా పనిలోకి దిగి ఉత్సాహం అందించారు. స్వయంగా మురుగు కాలువల్లో చెత్త తొలగించి ఆదర్శంగా నిలిచారు. మనం పని చేస్తూ ఇతరులు కూడా పని చేసేలా ప్రోత్సహించటం మంచి పద్ధతని అంటారు ఆమె. డ్రెయినేజీలు, రోడ్లు శుభ్రం చేయడం, నీరు నిల్వకుండా చూడడం వంటి పనులతోపాటు ప్రతి ఇంట్లో పంచసూత్రాలు అమలు వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి మంచి ఫలితాలు రాబట్టారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత, మరుగుదొడ్డి, కంపోస్టు పిట్‌, కిచెన్‌ గార్డెన్‌, కనీసం ఆరు మొక్కలు నాటేలా చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్‌ నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. దీనిపై విస్తృత అవగాహన కల్పించి ప్రజలు భాగస్వాములు అయ్యేలా చేశారు. స్వయంగా ఆమెతోపాటు జిల్లా అధికారులూ గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించారు. ఐక్యతతో కలిసి పని చేస్తే ఎంతటి లక్ష్యాన్నయినా చేధించవచ్చని నిరూపించి స్వచ్ఛతలో జాతీయ స్ధాయిలో మూడు అవార్డులు సాధించారు.
సర్వత్రా ప్రశంసలు
మన ఇల్లు, మన ఊరు, మన జిల్లా అనే విశాల దృక్పథాన్ని జిల్లా పౌరుల్లో పెంపొందించటంలో కలెక్టర్‌ సఫలీకృతం అయ్యారు. అందుకే ఆమె చేపట్టిన పంచసూత్రాల కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటిని ప్రజలు వందశాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంచ సూత్రాలను అమలు చేసే కుటుంబాల ఇంటికి ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్‌ను అంటిస్తున్నారు.
సబల సానిటరీ న్యాప్‌కిన్‌ తయారీ కేంద్రం..
నెలసరి సమయంలో ఉపయోగించే సానిటరీ న్యాప్‌కీన్స్‌ను సబల కేంద్రం ద్వారా మహిళలే తయారు చేసి అతి తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 20మంది స్వశక్తి సంఘం మహిళలతో కామన్‌ ఇంట్రస్ట్‌ గ్రూపు ఏర్పాటు చేసి పీఎంఈజీపీ ద్వారా రూ.25లక్షల రుణం ఇప్పించి 'సబల' పేరుతో సానిటరీ న్యాప్‌కిన్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారు. ఇక్కడినుంచి గ్రామాలకు వాటిని సరఫరా చేయడంతోపాటు వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేస్తూ వాడేలా కృషిచేస్తున్నారు. ఈ కేంద్రంలో 40మంది మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. నెలకు దాదాపుగా రూ.5వేల నుంచి 6వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. కమాన్‌పూర్‌లో 22 మంది స్వశక్తి సంఘాల మహిళలకు పీఎంఈజీపీ ద్వారా రూ.20లక్షల రుణం ఇప్పించి దుస్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
పాలీథిన్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా...
జిల్లాలో నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపట్టి మహిళా సంఘాల ఆధ్వర్యంలో బట్ట సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 10 మంది మహిళాసంఘం సభ్యులతో రూ.55లక్షలు వెచ్చించి పేపర్‌ బ్యాగ్స్‌, క్లాత్‌, జూట్‌ బ్యాగ్స్‌ తయారీ యూనిట్‌ను ధర్మారం ఎక్స్‌రోడ్‌ వద్ద ఏర్పాటు చేయించారు. ఇక్కడ తయారైన క్లాత్‌ సంచులను స్వచ్ఛ పెద్దపల్లి బ్రాండ్‌తో జిల్లా వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని 90 ప్రాంతాల్లో 330 ఎకరాల భూమి సేకరించి అటవీ, ఉద్యానవన శాఖల సమన్వయంతో వనాలు పెంచుతున్నారు.
అవార్డులు...
జిల్లాలోని 13 మండలాల్లోని 263 గ్రామ పంచాయతీలలో 1,37,058 మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2018లో జిల్లాకు జాతీయ స్థాయిలో మూడవ స్థానం. దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు వచ్చింది. స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ-2019లో జిల్లాకు జాతీయ స్థాయి, స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌-2019లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం పొంది ప్రధాని చేతుల మీద శ్రీదేవసేన అవార్డును తీసుకున్నారు.
విద్యార్థినుల ఆత్మరక్షణకు 'శక్తి'
స్వచ్ఛ జిల్లాగా మార్చడంలో విజయం సాధించిన శ్రీదేవసేన విద్యార్థినుల ఆత్మరక్షణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి అందరి మన్ననలు పొందారు. 'శకి'్త పేరుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు కేరళ రాష్ట్రానికి చెందిన ప్రాచీన యుద్ధకళ కలరియపట్టు నేర్పిస్తున్నారు. జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ ఈ శిక్షణను పరిశీలించి దేవసేనను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బాలురకు 'స్పృహ' పేరుతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి, అందులో తల్లిదండ్రులను సైతం భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- అరుకుట మల్లేష్‌యాదవ్‌,
పెద్దపల్లి

స్వచ్ఛతకు బ్రాండ్‌ అంబాసిడర్‌

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

అక్షరం ఓ గొంతుక కావాలి

19-02-2020

మనసు బాధతో స్పందిస్తే కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ఆనందంతో స్పందిస్తే చిరునవ్వులా వ్యక్తమౌతుంది. గుండె లోతుల్లో గూడు కట్టుకున్న కొన్ని దు:ఖాలు దేనికీ స్పందించవు. ఎద లోతుల్లో గడ్డ కట్టిన ఆ బాధ బయటకు రావాలంటే ఓదార్పు కావాలి. అలాంటప్పుడు

manavi

ముఖాముఖి

సంప్రదాయ నృత్యాలకు విశేష ప్రచారం కల్పిస్తూ..!

09-02-2020

సంప్రదాయ కళలకు భారత్‌ పుట్టిల్లు అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించే వాస్తవం. మన కళల్లో నృత్యారీతులది ప్రత్యేకస్థానం. ప్రతి ఏటా ఎందరో విదేశీయులు వచ్చి భారతీయ సంప్రదాయ నృత్యాలను నేర్చుకుంటున్నారు. ఇదే కోవలోకి వస్తారు

manavi

ముఖాముఖి

మూఢనమ్మకాలపై అక్షరం ఝుళిపించాలి

05-02-2020

జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు లభించాలన్నా, మూఢనమ్మకాలు తొలగిపోవాలన్న, మనుషుల మధ్య గల తారతమ్యాలను అర్థం చేసుకోవాలన్నా ఆమె కథలు చదవాల్సిందే. రాశి కన్నా వాసి గొప్పది అన్నది ఆమె రచనలను చూసి చెప్పవచ్చు. కథను

manavi

ముఖాముఖి

'మత్తు' నుంచి మళ్ళిస్తూ..!

03-02-2020

మంచిచెడు చెప్పేవారు లేక మత్తులో జోగుతూ బంగారు భవితను బాధామయం చేసుకుంటున్న యువతకు దిక్సూచిగా పనిచేస్తున్నవారు కొందరున్నారు. మాదకద్రవ్యాలతో పాటు ఇతర వ్యసనాలకు అలవాటు పడిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు అమృత

manavi

ముఖాముఖి

పట్టుదలతో భిన్న రంగాల్లోకి...

02-02-2020

యువతకు షార్ట్‌ ఫిలిమ్స్‌ ఓ పాషన్‌గా మారిపోయింది. అయితే వాటిలో ఎన్ని సమాజానికి ఉపయోగపడుతున్నాయనేదే ప్రశ్న. తాను తీసే ప్రతి సినిమా సమాజానికి ఉపయోగపడాలని కోరుకునే యువతి ప్రీతి నోవెలిన్‌... ఇటీవల సెక్స్‌ వర్కర్ల సమస్యలను ఈ ప్రపంచానికి

manavi

ముఖాముఖి

వలసలు కొత్తకాదు

29-01-2020

ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ భారతీయుల గౌరవాన్ని ప్రపంచ యవనికపై చిరస్థాయిగా నిలిచిపోయేలా తన సాహిత్యంతో దేశభక్తిని నింపిన ప్రముఖ కవి రాయప్రోలు

manavi

ముఖాముఖి

ఆరోగ్యకర బొమ్మలకు కేరాఫ్‌...

27-01-2020

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల కొత్త ఆలోచనలు అమలులోకి వస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్‌ రహిత వస్తువులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కొందరు తమ పరిథిలో ప్రయత్నం చేస్తున్నారు.

manavi

ముఖాముఖి

ధిక్కార స్వరం

26-01-2020

అయిషీ ఘోష్‌... నిండా పాతికేండ్లు నిండని యువతి. బక్కపల్చటి శరీరం. కానీ కండ్ల నిండా ఆత్మ స్థయిర్యం. ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం. ప్రశ్నించే తత్వం. సమస్యల పరిష్కారానికై వెళ్ళే మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకే తప్ప వెనుకడుగు వేయని

manavi

ముఖాముఖి

ఆలోచనల్ని రేకెత్తించేది అక్షరమే..

22-01-2020

ఆరు దశాబ్దాలుగా ఆమె కలం సాక్షిగా అక్షరసేద్యం చేస్తూనే ఉన్నారు. వందలాది కథలు, కవితలు రాస్తూ సమాజంలోని అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె రచనల్లో అంతర్లీనంగా ఉండే సందేశం జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే చుక్కానిగా పనిచేస్తోంది.

manavi

ముఖాముఖి

మహిళను రైతుగా గుర్తించాలి

20-01-2020

అది 2018 ఫిబ్రవరి... పొలాల్లో ఉండాల్సిన రైతులు గుంపులు గుంపులుగా నడివీధుల్లోకి వచ్చారు. గిట్టు బాటు ధర కోసం నినదించారు. తమకూ భూమిపై హక్కు కావాలంటూ, రైతులుగా గుర్తించాలంటూ మహిళా రైతులు సైతం ఈ లాంగ్‌ మార్చ్‌లో తమ రక్తాన్ని ధారపోశారు.