మహిళను రైతుగా గుర్తించాలి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

మహిళను రైతుగా గుర్తించాలి

అది 2018 ఫిబ్రవరి... పొలాల్లో ఉండాల్సిన రైతులు గుంపులు గుంపులుగా నడివీధుల్లోకి వచ్చారు. గిట్టు బాటు ధర కోసం నినదించారు. తమకూ భూమిపై హక్కు కావాలంటూ, రైతులుగా గుర్తించాలంటూ మహిళా రైతులు సైతం ఈ లాంగ్‌ మార్చ్‌లో తమ రక్తాన్ని ధారపోశారు. గత నెలలో ముంబయిలో జరిగిన ఐద్వా అఖిల భారత మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించి, కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌లోనూ మహిళల గొంతుకను బలంగా వినిపించిన వ్యక్తి ప్రాచీ అతిల్వేకర్‌. ఆనాటి తన అనుభవాలను ఆమె మానవితో ఇలా పంచుకున్నారు.
  ఎమ్మెస్సీ, ఎంబీఏ చేశాను. పదవ తరగతి నుండి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశాను. మా నానమ్మ, తాతయ్య ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పని చేసేవారు. వామపక్ష భావాలు కలిగిన కుటుంబంలో పుట్టడంతో నేనూ అవే భావాలతో పెరిగాను. బాగా చదువుకున్న కుటుంబం మాది. మా తాతయ్య ప్రొఫెసర్‌. నాన్న ప్రశాంత్‌ హతిల్వేకర్‌. నాన్న కూడా ప్రొఫెసరే. ప్రస్తుతం నేను ఐద్వా మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నా.
స్ఫూర్తిపొందాం...
మహారాష్ట్రలో మొదటి సారి అఖిల భారత మహాసభ నిర్వహించాం. ఇది మా రాష్ట్ర ఉద్యమానికి చాలా కష్టమైన పని అని తెలుసు. కానీ మా రాష్ట్ర ఉద్యమాన్ని మరింత బలపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ ధైర్యం చేశాం. దేశ నలుమూల నుండి వచ్చిన ఐద్వా కార్యకర్తల నుండి స్ఫూర్తి పొంది మా రాష్ట్రంలో ఉద్యమాలను మరింతగా పెంచుకోవాలనేది మా లక్ష్యం. మహాసభలను జయప్రదం చేసేందుకు మా క్యాడర్‌ మొత్తం కృషి చేశారు. అలాగే ఇతర ప్రజాసంఘాలు కూడా ఎంతో సహకరించాయి. వచ్చిన ప్రతినిధులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా మా పరిస్థితి అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నా. పదేండ్ల తర్వాత ముంబయి నగరంలో మహిళా ర్యాలీ నిర్వహించాం. ఇదో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.
మహిళల పాత్ర కీలకం
2018 ఫిబ్రవరిలో పది రోజుల పాటు కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ జరిగింది. మొత్తం160 కిలోమీటర్లు నడిచారు. నాసిక్‌ నుండి మొదలైన కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ మంత్రాలయ వరకు కొనసాగింది. లాంగ్‌ మార్చ్‌లో సుమారు 25 వేల మంది మహిళలు పాల్గొన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంత కీలకమైనదో ఈ సంఖ్యను బట్టే అర్థమవుతుంది. కానీ మహిళలను మాత్రం ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదు. మహిళలను రైతులుగా గుర్తించాలనేది మా ప్రధానమైన డిమాండ్‌. ఈ యాత్రలో ఐద్వా, కిసాన్‌ సంఫ్‌ు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లాంగ్‌ మార్చ్‌లో పాల్గొన్న మహిళలు ఇప్పటికీ ఐద్వా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
భూమి హక్కు కావాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అటవీ హక్కుల రక్షణ కూడా మా ప్రధాన నినాదం. భూమి మగవారి పేరుతోనే వుంటుంది. భర్త చనిపోతే ఆ భూమిపై మామకో, మరుదులకో, బావలకో ఆ హక్కు వెళ్ళిపోతుంది. పండిన పంటకు గిట్టుబాటు రాక, చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది రైతులు అత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతు కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా వుంటుంది. భర్త చనిపోతే ఆ కుటుంబ భారం మహిళపై పడుతుంది. ఒంటరి మహిళ ఈ సమాజంలో బతకడమంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. లేని ధైర్యాన్ని కూడగట్టుకొని పిల్లల కోసమే ఎంతో మంది ఒంటరి మహిళలు బతుకుతున్నారు. చాలా చోట్ల అత్తింటి వారు కొడుకు చనిపోయిన తర్వాత కోడలిని ఆదరించరు. ఉన్న భూమిపై రుణం తీసుకోవాలంటే దానిపై ఆమెకు హక్కుంటేనే తీసుకోగలుగుతుంది. అందుకే భూమిపై భార్యాభర్తలిద్దరికీ హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.
పట్టుదలతో నడిచారు
వ్యవసాయంలో ప్రతి పనీ మహిళలు చేయగలరు, చేస్తున్నారు. తమ భూమి కోసం ఎంతో కష్టపడతారు. వ్యవసాయోత్పత్తిలో మహిళ కీలక పాత్ర పోషిస్తున్నది. అయినా ఆమెను రైతుగా గుర్తించరు. ఈ మార్చ్‌లో పాల్గొన్న ఓ మహిళ తన మెడలోని బంగారం తాకట్టి పెట్టి మరీ పది రోజుల పాటు నడిచింది. అంటే స్త్రీలు తమ శ్రమకు తగ్గ ఫలితం కోసం ఎంతగా పోరాడుతున్నారో తెలుసుకోవచ్చు. నడిచే టప్పుడు ఎలాంటి సౌకర్యాలు మహిళలు కోరుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయారు, అవకాశం ఉన్న చోట విశ్రాంతి తీసుకున్నారు. ఏది పెడితే అదే తిన్నారు. కొన్ని చోట్ల అసలు స్నానాలు చేసే పరిస్థితి వుండేది కాదు. మరికొన్ని చోట్ల తాగేందుకు మంచినీళ్లు కూడా దొరికేవి కావు. అయినా పట్టుదలతో మహిళలు లాంగ్‌ మార్చ్‌లో పాల్గొన్నారు. అందరం కలిసి ఒకే దగ్గర వంటలు చేసుకునే వాళ్ళం. ఓ వాహనం మాతో పాటే ఎప్పుడూ వుండేది. అందులో వంట సామాగ్రి పెట్టుకుని అవకాశం ఉన్న చోట వంట చేసుకుని తినే వాళ్ళం.
మొదట్లో పట్టించుకోలేదు
మార్చ్‌ ప్రారంభమైన రెండు మూడు రోజులు రైతులను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వమైతే అస్సలు గుర్తించనేలేదు. మీడియా కూడా స్పందించలేదు. రోజులు గడిచే కొద్దీ మాతో పాటు కలిసొచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రామ గ్రామానికి జనం మాతో కలిసి నడుస్తుండేవారు. అలా ముప్ఫై, నలభై, యాభై, అరవై వేల మంది వరకు రైతులు మాతో కలిసి లాంగ్‌ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ మార్చ్‌ మొత్తం చాలా క్రమశిక్షణతో జరిగింది. యాత్ర ప్రారంభమైన రెండు, మూడు రోజులకు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం బాగా జరిగింది. పత్రికలు, టీవీ ఛానళ్ళను మార్చ్‌ గురించి ప్రచారం చేయమని అడిగితే మమ్మల్ని లెక్క చేయలేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి పత్రికల వాళ్లే మమ్మల్ని వెదుక్కుంటూ వచ్చారు. అంత గొప్పగా ఈ యాత్ర జరిగింది. రైతుల కాళ్ళకు బొబ్బలు వచ్చాయి. ఎంతో మంది మహిళలు భూమి హక్కు కోసం లాంగ్‌ మార్చ్‌లో తమ రక్తాన్ని ధారపోశారు.
ఎంతో మంది సహకరించారు
పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావడంతో లాంగ్‌ మార్చ్‌ని ముగించాం. ఈ మార్చ్‌లో చాలా మంది సాధారణ ప్రజలు రైతులకు సహకరించారు. రాయగడ్‌ రైతులు మా కోసం లక్ష చపాతీలు చేసి ఇచ్చారు. చెప్పులు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు కొంత మంది చెప్పులు ఇచ్చారు.
అర్థం చేసుకున్నారు
రైతులకు రుణ మాఫీ కావాలంటూ డిమాండ్‌ చేస్తుంటే నగరాల్లో జీవించే వారికి అర్థమయ్యేది కాదు. తీసుకున్న అప్పు తీర్చకపోతే ఎలా అనే ప్రశ్న వచ్చేది. వీళ్ళకు రుణ మాఫీ ఎందుకు ఇవ్వాలి అనుకునేవారు. ఈ లాంగ్‌ మార్చ్‌ వల్ల అసలు రైతుల సమస్యలు ఏంటి, ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పులు ఎందుకు తీర్చలేకపోతున్నారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం చేసుకున్నారు.

- సలీమ

మహిళను రైతుగా గుర్తించాలి

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

అక్షరం ఓ గొంతుక కావాలి

19-02-2020

మనసు బాధతో స్పందిస్తే కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ఆనందంతో స్పందిస్తే చిరునవ్వులా వ్యక్తమౌతుంది. గుండె లోతుల్లో గూడు కట్టుకున్న కొన్ని దు:ఖాలు దేనికీ స్పందించవు. ఎద లోతుల్లో గడ్డ కట్టిన ఆ బాధ బయటకు రావాలంటే ఓదార్పు కావాలి. అలాంటప్పుడు

manavi

ముఖాముఖి

సంప్రదాయ నృత్యాలకు విశేష ప్రచారం కల్పిస్తూ..!

09-02-2020

సంప్రదాయ కళలకు భారత్‌ పుట్టిల్లు అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించే వాస్తవం. మన కళల్లో నృత్యారీతులది ప్రత్యేకస్థానం. ప్రతి ఏటా ఎందరో విదేశీయులు వచ్చి భారతీయ సంప్రదాయ నృత్యాలను నేర్చుకుంటున్నారు. ఇదే కోవలోకి వస్తారు

manavi

ముఖాముఖి

మూఢనమ్మకాలపై అక్షరం ఝుళిపించాలి

05-02-2020

జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు లభించాలన్నా, మూఢనమ్మకాలు తొలగిపోవాలన్న, మనుషుల మధ్య గల తారతమ్యాలను అర్థం చేసుకోవాలన్నా ఆమె కథలు చదవాల్సిందే. రాశి కన్నా వాసి గొప్పది అన్నది ఆమె రచనలను చూసి చెప్పవచ్చు. కథను

manavi

ముఖాముఖి

'మత్తు' నుంచి మళ్ళిస్తూ..!

03-02-2020

మంచిచెడు చెప్పేవారు లేక మత్తులో జోగుతూ బంగారు భవితను బాధామయం చేసుకుంటున్న యువతకు దిక్సూచిగా పనిచేస్తున్నవారు కొందరున్నారు. మాదకద్రవ్యాలతో పాటు ఇతర వ్యసనాలకు అలవాటు పడిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు అమృత

manavi

ముఖాముఖి

పట్టుదలతో భిన్న రంగాల్లోకి...

02-02-2020

యువతకు షార్ట్‌ ఫిలిమ్స్‌ ఓ పాషన్‌గా మారిపోయింది. అయితే వాటిలో ఎన్ని సమాజానికి ఉపయోగపడుతున్నాయనేదే ప్రశ్న. తాను తీసే ప్రతి సినిమా సమాజానికి ఉపయోగపడాలని కోరుకునే యువతి ప్రీతి నోవెలిన్‌... ఇటీవల సెక్స్‌ వర్కర్ల సమస్యలను ఈ ప్రపంచానికి

manavi

ముఖాముఖి

వలసలు కొత్తకాదు

29-01-2020

ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ భారతీయుల గౌరవాన్ని ప్రపంచ యవనికపై చిరస్థాయిగా నిలిచిపోయేలా తన సాహిత్యంతో దేశభక్తిని నింపిన ప్రముఖ కవి రాయప్రోలు

manavi

ముఖాముఖి

ఆరోగ్యకర బొమ్మలకు కేరాఫ్‌...

27-01-2020

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల కొత్త ఆలోచనలు అమలులోకి వస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్‌ రహిత వస్తువులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కొందరు తమ పరిథిలో ప్రయత్నం చేస్తున్నారు.

manavi

ముఖాముఖి

ధిక్కార స్వరం

26-01-2020

అయిషీ ఘోష్‌... నిండా పాతికేండ్లు నిండని యువతి. బక్కపల్చటి శరీరం. కానీ కండ్ల నిండా ఆత్మ స్థయిర్యం. ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం. ప్రశ్నించే తత్వం. సమస్యల పరిష్కారానికై వెళ్ళే మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకే తప్ప వెనుకడుగు వేయని

manavi

ముఖాముఖి

ఆలోచనల్ని రేకెత్తించేది అక్షరమే..

22-01-2020

ఆరు దశాబ్దాలుగా ఆమె కలం సాక్షిగా అక్షరసేద్యం చేస్తూనే ఉన్నారు. వందలాది కథలు, కవితలు రాస్తూ సమాజంలోని అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె రచనల్లో అంతర్లీనంగా ఉండే సందేశం జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే చుక్కానిగా పనిచేస్తోంది.

manavi

ముఖాముఖి

స్వచ్ఛతకు బ్రాండ్‌ అంబాసిడర్‌

17-01-2020

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాల పరిశుభ్రతది కీలకపాత్ర.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమాన్ని జిల్లాలో ఒక ఉద్యమంలా తీసుకెళ్తూ అనారోగ్యాల శాతాన్ని గణనీయంగా తగ్గించగలిగారు పెద్దపల్లి