బుల్లితెరనే గుర్తింపునిచ్చింది | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

బుల్లితెరనే గుర్తింపునిచ్చింది

నటిగా.. మోడల్‌గా..యాంకర్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరకు పరిచయమై తెలుగు వారికి మరింత చేరువయింది. ప్రస్తుతం బిగో లైవ్‌ పేరుతో విభిన్న షోలు చేస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటుంది. ఇప్పుడు ఆ షో దక్షిణ భారతదేశంలోనే టాప్‌ వన్‌ బ్రాడ్‌కాస్ట్‌గా పేరుపొందింది. ఆమే మన అచ్చ తెలుగు అమ్మాయి శ్రావ్యారెడ్డి. ఆమెతో మానవి చిట్‌చాట్‌...
మీరు పుట్టి పెరిగింది ఎక్కడ?
మా సొంత ఊరు గుంటూరు. పెరిగింది, చదువుకుంది అంతా అక్కడే. బయోటెక్నాలజీ చేశాను. నాన్న నాగిరెడ్డి మిర్చియార్డులో జాబ్‌ చేసేవారు. అమ్మ మాలతి, హౌజ్‌వైఫ్‌. చిన్నప్పుడు స్కూల్లో డ్యాన్స్‌ బాగా వేసేదాన్ని. ఏ ఫంక్షన్‌ జరిగినా కచ్చితంగా నా డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ వుండేది. కాలేజీలో కూడా అంతే. నా డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ కూడా వుండేవారు. అయితే సినిమాల్లోకి రావాలని అప్పట్లో అనుకోలేదు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వెంటనే జాబ్‌ వస్తే హైదరాబాద్‌ వచ్చేశాను.
సినిమాల్లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
హైదరాబాద్‌ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్‌ సర్కిల్‌ మొత్తం మారిపోయింది. అందరం కలిసి సరదాగా కాఫీ షాపులకు, పార్టీలకు వెళుతుండేవాళ్ళం. అలా నా ఫ్రెండ్స్‌ సంఖ్య పెరిగిపోయింది. నా స్నేహితుల ద్వారా సినీ ఇండిస్టీ పరిచయం అయింది. వాళ్ళ పరిచయం తర్వాత సినిమాల్లో ట్రైచేయాలనే ఆలోచన వచ్చింది. కొన్ని రోజులు ప్రయత్నించాను. కానీ మొదట్లో మంచి అవకాశాలు రాలేదు. చివరకు 'ఎన్‌ఆర్‌ఐ' సినిమాలో అవకాశం వచ్చింది.
ఏమైనా ట్రైనింగ్‌ తీసుకున్నారా?
అలాంటిది ఏమీ లేదు. ఈ సినిమా చేయడానికి ముందు నా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ షార్ట్‌ ఫిలింలో నటించా. అప్పుడే నేనూ నటించగలను అనే నమ్మకం వచ్చింది. డైరెక్షన్‌ చేయడమన్నా చాలా ఇష్టం. 'ఎ మోర్‌' అనే తెలుగు షార్ట్‌ ఫిలిం డైరెక్ట్‌ చేశా. యూటూబ్‌లో పెట్టిన వారంలో 30 వేల మందికి అది చేరింది. ఎన్‌ఆర్‌ఐతో పాటే వరసగా మూడు సినిమాల్లో అవకాశం వచ్చింది. చార్లి, ఏరు సినిమాల్లో ఒకేసారి నటించ. మూడు సినిమాల్లో చేయడంతో చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. తర్వాత కిర్రాక్‌ పార్టీ, కృష్ణార్జున యుద్దం, కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'ఇజం' సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేశా. అవి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇలా మొత్తం 12 తెలుగు సినిమాల్లో నటించ.
సినిమాల్లో నటిస్తానంటే ఇంట్లో ఒప్పుకున్నారా?
ఇంట్లో కూడా చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. ఇండిస్టీలోకి వస్తున్నప్పుడే వాళ్ళను ఒప్పించే వచ్చాను. కాబట్టి ఇంట్లో ఎలాంటి సమస్య లేదు. చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ చేసేదాన్ని కాబట్టి స్టేజ్‌ ఫియర్‌ లేదు. అది నాకు సినిమాల్లో ప్లస్‌ పాయింట్‌ అయిందని చెప్పాలి.అయితే పెద్ద పెద్ద వాళ్ళతో చేసేటప్పుడు మొదట్లో కాస్త భయం వేసేది. అప్పుడు డైరెక్టర్లు బాగా సపోర్ట్‌ చేశారు.
ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారా?
సినిమాల్లో అవకాశాలు పెరగడంతో నాలుగేండ్ల కిందట ముంబయి వెళ్ళాను. 'అగ్నిసాక్షి' అనే తెలుగు సీరియల్లో నెగిటివ్‌ రోల్‌ చేసే అవకాశం వచ్చింది. దాంతో హైదరాబాద్‌ వచ్చాను. ఆ సమయంలోనే నాన్న చనిపోయారు. ప్రస్తుతం అమ్మ కోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నా. అంతా సెట్‌ అయిన తర్వాత మళ్ళీ ముంబయి వెళ్లిపోతాను. ఏది ఏమైనా ఇదే ఫీల్డ్‌లో కొనసాగుతాను. సినిమానే నా ప్రపంచం అయిపోయింది.
నటిగా మీకు తృప్తినిచ్చిన పాత్ర?
ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా నాకు నచ్చే చేశాను. దేనికవి ప్రత్యేకమైనవే. ప్రతి మూమెంట్‌ ఎంజారు చేస్తూ చేశాను. అయితే టీవీ సీరియల్లో చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది. గ్రామాల్లోకి వెళితే చాలా అభిమానిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా చూస్తున్నారు. 12 సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క సీరియల్‌తో వచ్చేసింది.
ఎలాంటి పాత్రల్లో నటించడమంటే ఇష్టం?
నెగిటివ్‌ క్యారెక్టర్లంటే చాలా ఇష్టం. నా బాడీ లాంగ్వేంజ్‌, వాయిస్‌ ఆ పాత్రలకైతే కరెక్టుగా సెట్‌ అవుతుందనిపిస్తుంది. ప్రస్తుతం ముంబయిలో టెలివిజన్‌లోనే అవకాశాలు వస్తున్నాయి. వాటిలోనే ప్రయత్నిస్తున్నా. తెలుగులో కూడా అంతే.
మీరు ప్రారంభించిన బిగ్‌ లైవ్‌ గురించి చెప్పండి?
లైవ్‌ షోలకు యాంకర్‌గా చేశాను కాబట్టి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే 2019 ఆగస్టు 20న 'బిగో లైవ్‌' అనే లైవ్‌ షో స్టాట్‌ చేశాను. ఈ షో ద్వారా ప్రేక్షకులకు, నా అభిమానులకు మరింత దగ్గరయ్యాను. చాలా మంది టీవీ ఆర్టిస్టులు బిగో లైవ్‌ లోకి వస్తున్నారు. త్వరలోనే ఇది లక్షల మందికి చేరువ కానుంది. ప్రస్తుతం ఇది ఇండియాలోనే పెద్ద లైవ్‌ షోగా వుంది. దక్షిణ భారతదేశంలో టాప్‌ 1 బ్రాడ్‌కాస్ట్‌ర్‌గా నిలిచింది. ఈ షో ఇంత సక్సెస్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఖాళీ సమయంలో ఎలా గడుపుతారు?
డ్యాన్స్‌ అంటే ఇష్టం. డాన్స్‌ ఎంతసేపైనా చేస్తాను. అయితే ప్రస్తుతం బిగో లైవ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్న. ఇందులో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా, తృప్తిగా వుంది.

బుల్లితెరనే గుర్తింపునిచ్చింది

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

పర్యావరణ పరిరక్షణే బాధ్యతగా...

18-03-2020

అలుపెరుగక శ్రమిస్తే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. దీన్ని మరోసారి రుజువు చేశారు రమా అయ్యగారి. పర్యావరణ పరిరక్షణ తన బాధ్యతగా అనుకున్నారు. భావి తరాలకు మంచి ఆరోగ్యం అందించడం కర్తవ్యంగా భావించారు. అందుకే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూటును

manavi

ముఖాముఖి

పట్టుదలతోనే నెంబర్‌ వన్‌

01-03-2020

అందం, అభినయం ఆమె సొంతం. ఒకసారి చెబితే ఇట్టే గుర్తుంచుకునే ఏకసంథాగ్రహి. నటనలో ఎలాంటి శిక్షణ అవసరం లేకుండానే నవరసాలను అవలీలగా పండిస్తూ.. ప్రేక్షకులతో నెంబర్‌ వన్‌ అనిపించుకుంటున్నారు. నటిగా తెరపై కనిపించాలన్న ఆసక్తితో

manavi

ముఖాముఖి

పిల్లలను పట్టించుకోవాలి

26-02-2020

నిల్వ పచ్చిడి నుంచి నీటి ఎద్దటి వరకు, పిల్లల పెంపకం నుంచి ఢిల్లీ మహిళా భద్రత వరకు విషయం ఏదైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఎలాంటి అంశం ఇచ్చినా పేజీల కొద్ది వ్యాసాలు రాయగలరు. ఆమే ఉంగూటూరి శ్రీలక్ష్మి. ఆల్‌ ఇండియా రేడియోలో నాలుగు దశాబ్దాలుగా

manavi

ముఖాముఖి

స్ఫూర్తినిచ్చే పాత్రల్లో మాత్రమే..!

23-02-2020

ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వాతంత్య్రంతో ఉండాలనుకున్న ఆమె అనుకోకుండా టెలివిజన్‌ రంగం వైపు వచ్చారు. తన మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందుతున్నారు. ఆమే వరంగల్‌ ఆడబిడ్డ యామిని. 'చిన్నకోడలు'లో

manavi

ముఖాముఖి

ఛాలెంజింగ్‌గా తీసుకున్నప్పుడే..

21-02-2020

సివిల్‌ సర్వెంట్‌గా మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. ఏ శాఖలో బాధ్యతలు నిర్వహించినా తనదైన శైలిలో ప్రజల కోసం ఆలోచిస్తారు. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను ఎదురయ్యే ప్రతి అంశాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. ఆమే శాలినీమిశ్రా, ఐఎఎస్‌. ప్రభుత్వ

manavi

ముఖాముఖి

అక్షరం ఓ గొంతుక కావాలి

19-02-2020

మనసు బాధతో స్పందిస్తే కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ఆనందంతో స్పందిస్తే చిరునవ్వులా వ్యక్తమౌతుంది. గుండె లోతుల్లో గూడు కట్టుకున్న కొన్ని దు:ఖాలు దేనికీ స్పందించవు. ఎద లోతుల్లో గడ్డ కట్టిన ఆ బాధ బయటకు రావాలంటే ఓదార్పు కావాలి. అలాంటప్పుడు