పర్యావరణ పరిరక్షణే బాధ్యతగా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

పర్యావరణ పరిరక్షణే బాధ్యతగా...

అలుపెరుగక శ్రమిస్తే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. దీన్ని మరోసారి రుజువు చేశారు రమా అయ్యగారి. పర్యావరణ పరిరక్షణ తన బాధ్యతగా అనుకున్నారు. భావి తరాలకు మంచి ఆరోగ్యం అందించడం కర్తవ్యంగా భావించారు. అందుకే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూటును ప్రచారం చేస్తున్నారు. జూటు ఉత్పత్తులు తయారు చేస్తూ.. సొంతంగా వ్యాపారం చేయడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పిస్తూ.. సమాజానికి తన వంతు సేవ చేస్తూ తృప్తి చెందుతున్న ఆమె గురించి...
     మా సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం. అక్కడే బీబీఎం పూర్తి చేశా. పెండ్లి తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. మాకు ఒక బాబు, పాప. గతంలో ఇంజనీరింగ్‌ కాలేజీలో జాబ్‌ చేసేదాన్ని. ఓసారి టీవీలో ప్లాస్టిక్‌ కవర్స్‌ తినేసిన ఆవుకు ఆపరేషన్‌ చేసి ఆ కవర్స్‌ తీసేయడం చూశాను. ప్లాస్టిక్‌ వల్ల మూగజీవాలే కాదు తర్వాతర్వాత ప్రజలకు కూడా ఎంత హాని కలుగుతుందో తెలిసి బాధ పడ్డ. అప్పుడే పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైన చేయాలనిపించింది. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే బట్టతో, జూట్‌ తో తయారు చేసిన బ్యాగులు పర్యావరణానికి మేలు చేస్తాయని తెలుసుకున్న. వీటి గురించి గూగుల్లో, య్యూటూబ్‌లో బాగా వెదికాను. బట్ట సంచిని చేతిలో పట్టుకొని వెళ్ళడానికి చాలా మంది మొహమాట పడుతుంటారు. జూటు కాస్త అఫిషియల్‌గా అనిపించింది. అందుకే జూటు బ్యాగులు కుట్టించాలనుకున్న. ఆ సమయంలోనే పేపర్‌లో ఓ యాడ్‌ చూశా. 2014లో టెక్స్‌టైల్స్‌ మినిష్టరీ, అలీప్‌ వాళ్ళు కలిసి జూటు బ్యాగుల తయారీలో ట్రైనింగ్‌ ఇస్తున్నారని తెలిసింది. వాళ్ళు రామాంతపూర్‌లో మూడు నెలలు ట్రైనింగ్‌ ఇస్తే తీసుకున్నా. ట్రైనింగ్‌ చాలా కష్టంగా అనిపించింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5, 6 గంటల వరకు ఉండాలి. బయోమెట్రిక్‌ కూడా ఉంటుంది. 30 మంది చేరితే చివరకు ఐదు గురిమే మిగిలాము. ట్రైనింగ్‌ తర్వాత బిజినెస్‌ ప్రారంభించింది ఇద్దరమే.
మొదట కంగారు పడ్డ
ట్రైనింగ్‌లో మాతో ఓ రికార్డు రాయించారు. అలాగే సర్టిఫికేట్‌ ఇచ్చారు. అవి తీసుకుని లోన్‌ కోసం ఆంధ్రబ్యాంక్‌కు వెళ్ళాను. వాళ్ళు జూటు బిజినెస్‌కు లోన్‌ ఇవ్వలేమన్నారు. కాస్త బాధ కలిగింది. ఈ సారి ఎస్‌బీఐకి వెళ్ళా. అక్కడ లేడీ మానేజర్‌ ఉన్నారు. ఆవిడ లోన్‌కు ఓకే చెప్పారు. అన్ని వివరాలు తీసుకుని తర్వాత రోజు రమ్మంటే వెళ్ళా. మిషనరీకి కొంత, పెట్టుబడికి కొంత అని ముద్రా లోను కింద లక్ష రూపాయలు ఇచ్చారు. మరో నాలుగు లక్షలు సొంతంగా ఖర్చుపెట్టి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని మిషన్లు, మెటీరియల్‌ కొని బిజినెస్‌ ప్రారంభించాను. మా చుట్టు పక్కల వారందరికీ చెప్పా. బ్యాగులు కుట్టడానికి ట్రైనింగ్‌ ఇస్తానంటే మొదట ఐదుగురు వచ్చారు. ట్రైనింగ్‌లో వాళ్ళు అన్నీ నేర్పారు కానీ బల్క్‌ ఆర్డర్లు వస్తే ఎలా కుట్టాలో చెప్పలేదు. బిజినెస్‌ ప్రారంభించిన కొత్తలో చాలా కంగారు పడ్డా. మెల్లమెల్లగా నేర్చుకున్నా.
సోషల్‌ మీడియా ద్వారా...
డ్రాయింగ్‌, పెయింటింగ్‌ అంటే నాకు చాలా ఆసక్తి. కాబట్టి నాకు వచ్చిన డిజైన్లన్నీ బ్యాగులపై ప్రయోగాలు చేసేదాన్ని. కొత్త కొత్త డిజైన్లు కుట్టేదాన్ని. కానీ వాటిని ఎలా అమ్మాలో తెలియదు. అంతకు ముందు మా కుటుంబంలో బిజినెస్‌ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మావారు బాగా సపోర్ట్‌ చేశారు. ఆయన ఇచ్చిన సలహాతోనే ఫేస్‌బుక్‌లో ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి కుట్టిన బ్యాగులన్నీ అందులో పెట్టేదాన్ని. అలాగే వాట్సాప్‌ స్టేటస్‌లో కూడా పెట్టేదాన్ని. సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడింది. ఫేస్‌బుక్‌లో చూసి రిజర్వ్‌బ్యాంక్‌ వాళ్లు పిలిపించారు. ఉమెన్స్‌ డే సందర్భంగా ఉద్యోగుల కుటుంబాల కోసం వాళ్ళు ఎగ్జిబిషన్‌ పెట్టారు. అక్కడ బ్యాగులు పెట్టమని అడిగారు. అలా నా మొదటి ఎగ్జిబిషన్‌ పెట్టాను. మంచి స్పందన వచ్చింది. తర్వాత మా ఇంటి దగ్గరలోనే ఓ పెండ్లికి వంద బ్యాగులు కావాలని ఆర్డర్‌ ఇచ్చారు. అలా జూటు బ్యాగుల గురించి అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుండి ఆర్డర్లు వస్తూనే వున్నాయి.
ఇంట్లో వాళ్ళ సహకారం తప్పనిసరి
చాలామందికి ట్రైనింగ్‌ ఇచ్చాను. అయితే నేను పడిన ఇబ్బంది వాళ్ళు పడకూడదని బల్క్‌ ఆర్డర్లు వస్తే ఎలా కుట్టాలో, ఒకేసారి వంద బ్యాగులకు కటింగ్‌ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ఇది వాళ్ళు సొంతంగా బిజినెస్‌ పెట్టుకోడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా చదువు లేని వాళ్ళకు, పదిలోపు చదువుకున్న వాళ్ళకు ట్రైనింగ్‌ ఇస్తుంటాను. ఇది మాత్రమే కాదు ఏ బిజినెస్‌ చేయాలన్నా మహిళలకు ఇంట్లో సపోర్ట్‌ కచ్చితంగా వుండాలి. మహిళలకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వ్యాపారం చేసేటప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తుంది. అటు బిజినెస్‌, ఇటు ఇల్లు రెండూ చూసుకోవాలంటే కష్టం. అందుకే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం లేకుండా ఏ మహిళకూ బటయ అడుగుపెట్టడం సాధ్యం కాదు. పిల్లలకు కూడా తమ పనులు తాము చేసుకునే విధంగా నేర్పించాలి. అప్పుడే మనకంటూ కాస్త సమయం దొరుకుతుంది.
ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తున్న
జూటు బిజినెస్‌లో ఆదాయం మనం చేసుకునే మార్కెటింగ్‌ని బట్టి ఉంటుంది. కొత్త కొత్త మోడల్స్‌ తయారు చేస్తే జూటుకు మంచి ఆదరణ వుంటుంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ప్లాస్టిక్‌ వాడొద్దు అనే స్పృహ మనందరిలో వుండాలి. అప్పుడు జూటుకు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగానికి కంటే బిజినెస్‌ కాస్త రిస్క్‌. అయితే సమాజానికి ఏదైనా చేయాలి అన్నప్పుడు కచ్చితంగా రిస్క్‌ వుంటుంది. సమాజం కోసం చేశామనే తృప్తి ఉంటుంది. మన భవిష్యత్‌ తరాలు ఆరోగ్యంగా వుండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం జూటుతో పాటు క్లాత్‌ బ్యాగులు కూడా తయారు చేస్తున్నా. అవి నార్మల్‌ మిషిన్‌ కుట్టేవాళ్ళు కూడా సులభంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి జీతం తీసుకుని కుట్టే వాళ్ళు ఆరుగురు ఉన్నారు. ఇంటి నుండి కుట్టేవాళ్ళు 15 మంది వరకు ఉన్నారు. 20 మంది ఉపాధి చూపించగలిగాననే తృప్తి కూడా ఉంది. కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టపడి ఈ బిజినెస్‌ చేస్తున్నాను.

- సలీమా
ఫొటోలు: పిప్పల్ల వెంకటేష్‌

పర్యావరణ పరిరక్షణే బాధ్యతగా...

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

బుల్లితెరనే గుర్తింపునిచ్చింది

15-03-2020

నటిగా.. మోడల్‌గా..యాంకర్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరకు పరిచయమై తెలుగు వారికి మరింత చేరువయింది. ప్రస్తుతం బిగో లైవ్‌ పేరుతో విభిన్న షోలు చేస్తూ తన

manavi

ముఖాముఖి

పట్టుదలతోనే నెంబర్‌ వన్‌

01-03-2020

అందం, అభినయం ఆమె సొంతం. ఒకసారి చెబితే ఇట్టే గుర్తుంచుకునే ఏకసంథాగ్రహి. నటనలో ఎలాంటి శిక్షణ అవసరం లేకుండానే నవరసాలను అవలీలగా పండిస్తూ.. ప్రేక్షకులతో నెంబర్‌ వన్‌ అనిపించుకుంటున్నారు. నటిగా తెరపై కనిపించాలన్న ఆసక్తితో

manavi

ముఖాముఖి

పిల్లలను పట్టించుకోవాలి

26-02-2020

నిల్వ పచ్చిడి నుంచి నీటి ఎద్దటి వరకు, పిల్లల పెంపకం నుంచి ఢిల్లీ మహిళా భద్రత వరకు విషయం ఏదైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఎలాంటి అంశం ఇచ్చినా పేజీల కొద్ది వ్యాసాలు రాయగలరు. ఆమే ఉంగూటూరి శ్రీలక్ష్మి. ఆల్‌ ఇండియా రేడియోలో నాలుగు దశాబ్దాలుగా

manavi

ముఖాముఖి

స్ఫూర్తినిచ్చే పాత్రల్లో మాత్రమే..!

23-02-2020

ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వాతంత్య్రంతో ఉండాలనుకున్న ఆమె అనుకోకుండా టెలివిజన్‌ రంగం వైపు వచ్చారు. తన మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందుతున్నారు. ఆమే వరంగల్‌ ఆడబిడ్డ యామిని. 'చిన్నకోడలు'లో

manavi

ముఖాముఖి

ఛాలెంజింగ్‌గా తీసుకున్నప్పుడే..

21-02-2020

సివిల్‌ సర్వెంట్‌గా మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. ఏ శాఖలో బాధ్యతలు నిర్వహించినా తనదైన శైలిలో ప్రజల కోసం ఆలోచిస్తారు. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను ఎదురయ్యే ప్రతి అంశాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. ఆమే శాలినీమిశ్రా, ఐఎఎస్‌. ప్రభుత్వ

manavi

ముఖాముఖి

అక్షరం ఓ గొంతుక కావాలి

19-02-2020

మనసు బాధతో స్పందిస్తే కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ఆనందంతో స్పందిస్తే చిరునవ్వులా వ్యక్తమౌతుంది. గుండె లోతుల్లో గూడు కట్టుకున్న కొన్ని దు:ఖాలు దేనికీ స్పందించవు. ఎద లోతుల్లో గడ్డ కట్టిన ఆ బాధ బయటకు రావాలంటే ఓదార్పు కావాలి. అలాంటప్పుడు