ఈ అలవాట్లతో విజయం మీదే | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

ఈ అలవాట్లతో విజయం మీదే

ఆరోగ్యకరమైన జీవన విధానం అంటే మంచి విషయాలని మంచి అలవాట్లుగా మార్చుకోవడం. అంటే సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి అలవాటుగా మారిపోవాలి. అవి ఆటోమాటిక్‌గా రోజులో వాటికి కేటాయించిన సమయంలో జరిగిపోవాలి. తల్లిదండ్రులు, పెద్ద వాళ్ళు, టీచర్లు, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచెస్‌... అందరూ మంచి అలవాట్లు చేసుకోవడం గురించి చెప్తూనే ఉంటారు. కానీ.. అవి ఎందుకు అలవాటు చేసుకోవాలో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

అలవాటు అంటే ఏమిటి?
దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించకుండా రోజూ చేసేదాన్ని అలవాటు అంటారు. అందరికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒక టైమ్‌కి నిద్ర లేవడం, ఒక పద్ధతిలో బ్రష్‌ చేసుకోవడం, ఒక టైమ్‌లో ఫ్రెండ్స్‌తో మాట్లాడడం వంటివి. అలవాట్లు మన లైఫ్‌లో ఎంతగా భాగం అయిపోతాయంటే అవే మనం అనిపించేంత. మీరు మారాలి అనుకుంటే మీరు ముందు చేయాల్సిన పని మీ అలవాట్లని మార్చుకోవడం.
మార్చుకోవడం అసాధ్యం కాదు
అలవాటులో ఉండే మంచి లక్షణమేం టంటే మీరు దాన్ని మార్చుకోవచ్చు. చాలా కాలం నుండీ ఉన్న అలవాట్లని మార్చు కోవడం కొద్దిగా కష్టమవుతుంది. చెడు అలవాట్లని మార్చుకోవడం ఇంకా కష్టమ వుతుంది. కానీ, మార్చుకోవడం అసాధ్య మేమీ కాదు. ఉదాహరణకి మంచి ఆహారం తీసుకునే అలవాటు పెంచుకోవా లనుకుంటే రోజుని గోరు వెచ్చని నీటితో, లేదా గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం వేసుకునో తాగడం మొదలు పెట్టండి. అప్పుడు పొద్దున్నే కాఫీ, టీ లాంటివి తాగే అలవాటు మారుతుంది.
లక్ష్యానికి చేరువ చేస్తాయి
మీరు ఒక మారథాన్‌ రన్నర్‌ అవుదామని అనుకున్నారనుకోండి. మీ సిటీలో జరిగే ఫస్ట్‌ మారథాన్‌లో పరి గెత్తడం మీ మొదటి స్టెప్‌ కాదు కదా. మార థాన్‌ రేస్‌లో పాల్గొనా లంటే కావాల్సిన ఫిట్నెస్‌కి సంవత్సరాల తరబడి ట్రైనింగ్‌ ఉండాలి. గోల్‌ రీచ్‌ అవ్వాలంటే చేయాల్సిన మొదటి పని దానికి కావాల్సిన అలవాటుని చేసుకోవడం.
జీవితాంతం ఉంటాయి
మిమ్మల్ని డిఫైన్‌ చేసేది మీ అలవాట్ల వల్లే కాబట్టి మీ అలవాట్లు మీతో జీవితాంతం ఉంటాయి. మీరు అవతలి వారిని ఆనందంగా పలకరిస్తే మీరు సంతోషాన్ని పంచే వ్యక్తి అవుతారు. మీకు ప్రతి భోజనంలోనూ సలాడ్‌ తినే అలవా టుంటే మీరు ఆరోగ్యకరమైన వ్యక్తి అవుతారు.
గోల్‌ రీచ్‌ కావడానికి
మీకు ఒక గోల్‌ ఉన్నప్పుడు దాన్ని రీచ్‌ అవ్వడానికి మీకు సహక రించేది మీ గోల్‌ కాదు. ఆ గోల్‌ సాధించడానికి మీరు ఫాలో అవుతున్న అలవాట్లు. అలవాట్లే మీ గోల్‌ రీచ్‌ అవ్వడానికి పునాది రాళ్ళు.
టైమ్‌ వేస్ట్‌ తగ్గుతుంది
మనందరం ఎంతో టైమ్‌ వేస్ట్‌ చేస్తూ ఉంటాం. కానీ, మంచి అలవాట్లని పెంపొందించుకోవటం వలన ఈ టైమ్‌ వేస్ట్‌ తగ్గుతుంది. మన పని కూడా స్పీడ్‌గా అయిపోతుంది.
మోటివేషన్‌ బదులు
అందరికీ ఒక్కోరోజు అసలు ఏ పనీ చేయాలనిపించదు, ఎక్సర్సైజ్‌ చేయాలనిపించదు, వండుకుని తినాలనిపించదు. కానీ, ఈ అలవాట్లు మనకి ఇలాంటప్పుడు ఎంతో సాయం చేస్తాయి. ఉదాహరణకి మనకి లేవగానే బ్రష్‌ చేసుకోవడం అలవాటు. బ్రష్‌ చేసుకోవాలి అని అనిపించకపోవడం ఎప్పుడూ జరగదు కదా. లేవడం, బ్రష్‌ చేసుకోవడం...ఈ రెండూ ఒక దాని తరువాత ఒకటి ఆటోమాటిక్‌గా అయిపోతాయి. కానీ, బస్‌ జర్నీలో ఉన్నప్పుడు లేవగానే బ్రషింగ్‌ కుదరదు. బస్‌ ఆపేవరకూ ఆగుతాం, ఏం చేయలేం కదా. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ మన అలవాటు మామూలే. అలాగే మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా జంక్‌ ఫుడ్‌ తిన్నా, మళ్ళీ మన అలవాట్లలోకి మనం వచ్చేస్తాం.
అయితే, ఇలా మంచి అలవాట్లు చేసుకోవడానికి కూడా కొన్ని తేలిక పద్ధతులున్నాయి. అవేమిటో చూడండి మరి.
- ఒక పెద్ద గోల్‌, దాన్ని రీచ్‌ అవ్వడానికి చిన్న చిన్న స్టెప్స్‌ జీవితంలో విజయం సాధించడానికి రెండూ అవసరమే అని చెప్తున్నారు పరిశోధకులు. ఈ చిన్న చిన్న స్టెప్స్‌ని మనం మన అలవాట్లుగా మార్చేసుకుంటే సరిపోతుంది.
- ''నేనివాళ్టి నుండీ ఎక్సర్సైజ్‌ చేస్తాను'' అనుకోవడం కంటే, ''నేనివాళ ఆఫీసు నకకుంచి ఇంటికొచ్చాక ఎక్సర్సైజ్‌ డ్రెస్‌లోకి మారి, ఒక అరగంట సేపు సోషల్‌ మీడియాలో టైమ్‌ స్పెండ్‌ చేసి ఆ తరువాత అరగంట పాటు నడుస్తాను'' అనుకోవడం వల్ల అలవాట్లు తొందరగా ఫార్మ్‌ అవుతాయని అంటున్నారు.
- ఒక కొత్త అలవాటు చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనని వెనక్కి లాగుతాయి. ఉదాహరణకి జంక్‌ ఫుడ్‌ మానేద్దాం అనుకుంటున్నప్పుడు కంటికి కనిపించే ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌ మనని వెనక్కి లాగుతుంది. అలాంటివి రిమూవ్‌ చేయడం ద్వారా మన గోల్‌ని రీచ్‌ అవ్వడం తేలిక అవుతుంది.
- మంచి అలవాట్ల వల్ల లైఫ్‌ ఇవాళే కాదు, రేపు కూడా బావుంటుంది. భవిష్యత్‌ బంగారు బాట అవుతుంది. ఇదేమీ అసాధ్యమైన పనేమీ కాదు. కొంత విల్‌ పవర్‌, కొన్ని ట్రిక్స్‌ కలిస్తే మీకు కావాల్సిన హ్యాబిట్‌ ఫార్మ్‌ చేసుకోగలుగుతారు.

ఈ అలవాట్లతో విజయం మీదే

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలి

09-11-2020

పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులతో కొలవడం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి

manavi

న్యాయ సలహాలు

ఆదివారం ఎలా గడుపుతున్నారు?

25-10-2020

సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ సెలవు ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బోలెడు పనులు అంటూ అన్నింటినీ ఏకరవు పెట్టేస్తేంటారు. అసలు విజేతలైన

manavi

న్యాయ సలహాలు

స్త్రీ స్వాతంత్య్ర మర్హతి

18-10-2020

లైంగికదాడి... ఆడవాళ్ళని మగవారు తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని, ప్రశ్నించేతత్వాన్ని దెబ్బతీసి ''మీరెప్పుడూ మాకన్నా తక్కువే. మాకు

manavi

న్యాయ సలహాలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..?

08-10-2020

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి భయపడే జనం ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? అయితే కొంచెం ఆలోచించండి...

manavi

న్యాయ సలహాలు

జయించండి ఇలా...

28-09-2020

కోవిడ్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని కబళిస్తూనే వుంది. వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది మరణించారు. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐతే కరోనా వైరస్‌ గురించి టీవీలో వస్తున్న