ఆదివారం ఎలా గడుపుతున్నారు? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

ఆదివారం ఎలా గడుపుతున్నారు?

సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ సెలవు ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బోలెడు పనులు అంటూ అన్నింటినీ ఏకరవు పెట్టేస్తేంటారు. అసలు విజేతలైన మహిళలు ఆదివారం పాటించే నియమా లేంటో ఓసారి పరిశీలిద్దాం..
- సాధారణ రోజుల్లో ఏ పనులు ఎప్పుడు చేయాలో ఓ ప్రణాళిక వేసుకుంటాం.. అదేవిధంగా ఆదివారం రోజున కూడా పాటించాలి. ఉదాహరణకు ఓ గంట దుస్తుల కోసం కేటాయించండి. వారం మొత్తానికి ఏం వేసుకోవాలనేది సిద్ధంగా పెట్టుకుంటే మిగిలిన రోజుల్లో ఎంతో సమయం కలిసొస్తుంది. దీన్ని తప్పక ప్రయత్నించి చూడండి.
- ఆదివారం రోజున కనీసం ఓ అరగంట అయినా.. రాబోయే వారం రోజులు ఏయే పనులు చేయాలో ఆలోచించుకోవాలి. అవసరమైతే కొన్నింటిని రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వలన మనకు ఏం చేయాలో తెలుస్తుంది. మర్చిపోయే పరిస్థితి ఎదురుకాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి సమస్య అసలు ఉండదు.
- ఇక ఇంటిని సర్దుకునే పనులు మాత్రం పెట్టుకోరట చాలామంది. అందుకు బదులుగా విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించుకుంటారు. అలానే వారంలో ఎంత సమయం కుటుంబానికి కేటాయించాలి.. వ్యక్తిగత సమయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆలోచిస్తారు.
- విజేతలైన స్త్రీలు చేసే మరో పని ఏంటో తెలుసా.. డిజిటల్‌ డిటాక్స్‌ పాటించడం. అంటే సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లకు దూరంగా ఉండడం. రోజంతా కాకపోయినా.. వీలైనన్ని ఎక్కువ గంటలు అలా గడిపేందుకు ప్రయత్నిస్తే చాలు.

ఆదివారం ఎలా గడుపుతున్నారు?

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలి

09-11-2020

పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులతో కొలవడం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి

manavi

న్యాయ సలహాలు

స్త్రీ స్వాతంత్య్ర మర్హతి

18-10-2020

లైంగికదాడి... ఆడవాళ్ళని మగవారు తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని, ప్రశ్నించేతత్వాన్ని దెబ్బతీసి ''మీరెప్పుడూ మాకన్నా తక్కువే. మాకు

manavi

న్యాయ సలహాలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..?

08-10-2020

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి భయపడే జనం ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? అయితే కొంచెం ఆలోచించండి...

manavi

న్యాయ సలహాలు

జయించండి ఇలా...

28-09-2020

కోవిడ్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని కబళిస్తూనే వుంది. వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది మరణించారు. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐతే కరోనా వైరస్‌ గురించి టీవీలో వస్తున్న