సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి

సోషల్‌ మీడియా మితిమీరిన వినియోగం వల్ల కొత్త రకం అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను ఎక్కువగా వాడేవారు న్యూరో లింగ్యువల్‌ డిఫీషియన్సీ అనే వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు తేల్చారు. ఇది భాషాపరమైన సమస్య. ఒక భాష గ్యాడ్జెట్లలో స్క్రీన్‌కు పరిమితమైతే.. ఆ భాష విస్తరణ పరిధి దెబ్బతింటుందని ఇంగ్లాండ్‌కు చెందిన భాషా శాస్త్రవేత్త డేవిడ్‌ క్రిస్టల్‌ చెబుతున్నారు. ఈ రోజుల్లో మనం మాట్లాడే భాష గ్యాడ్జెట్‌ స్క్రీన్‌ ఓరియెంటెడ్‌ లాంగ్వేజ్‌గా మారింది. దీనివల్ల కొత్త భాషను నేర్చుకోవటం, దాంట్లో ప్రావీణ్యం సాధించడం మెదడుకు కష్టతరమవుతుంది. గ్యాడ్జెట్ల అధిక వాడకానికి, కొత్త భాష నేర్చుకోవడానికి సంబంధం ఉందని పరిశోధకులు తెలిపారు. గ్యాడ్జెట్ల వాడకం మెదడు సహజ సామర్థ్యాలను కూడా దెబ్బతీస్తుందని నిరూపించారు.
విస్తరణ ఆగిపోతుంది
భాష నేర్చుకునే సామర్థ్యం వ్యక్తుల మెదడు కణాలు, వాటి విస్తరణపై ఆధారపడి ఉంటుంది. గ్యాడ్జెట్లు, సోషల్‌ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మెదడు కణాల విస్తరణ ఆగిపోతుంది. దీంతో భాషా నైపుణ్యాలను మెరుగు పరచుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో మెస్సేజ్‌లు, కామెంట్లు షార్ట్‌కట్లలో చేస్తారు. ఇవన్నీ కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీసేవేనని పరిశోధకులు చెబుతున్నారు.
సమన్వయం లోపిస్తుంది
2000 సంవత్సరం తరువాత టెక్నాలజీ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గాడ్జెట్ల వినియోగం క్రమంగా పెరిగింది. దీనివల్ల భాషలపై ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించిన న్యూయార్క్‌ టైమ్స్‌, ది గార్డియన్‌ వంటి వార్తా పత్రికలు తమ కాలమిస్టులను చేతితో వార్తలు రాయమని, ఆ తర్వాతే కంప్యూటర్‌లో టైపింగ్‌ చేసి పంపించాలని ఆదేశించాయి. దీనివల్ల మెదడు, వేలు, పెన్ను కోఆర్డినేషన్‌ మెరుగుపడుతుందని భావించారు. ఒక రచయిత రాయాలనుకున్నది రాసి, దాన్ని మళ్లీ సంక్షిప్తం చేయడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు వాడేటప్పుడు ఈ సమన్వయం లోపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
పెన్నుతో రాయండీ...
పెన్నుతో పేపర్‌ మీద కాలమ్స్‌, స్టోరీలు రాసినవారు మెరుగ్గా రాయగలిగారు. వారు రాసేటప్పుడు గాడ్జెట్‌లను ఉపయోగించకుండా మంచి పదాలు, పదబంధాలను ఆ ఆర్టికల్స్‌లో రాశారు. గాడ్జెట్‌ ఓరియెంటెడ్‌ ప్లాట్‌ఫాంలను ఎక్కువగా వాడటం వల్ల మెదడు కణాలు కొంత వరకు క్షీణిస్తాయి. సంప్రదాయ పద్ధతిలో రచనలు చేసినప్పుడు మెదడు తిరిగి చైతన్యవంతంగా మారుతుంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఎడ్వర్డ్‌ డబ్ల్యు సెడ్‌ అనే శాస్త్రవేత్త కూడా పత్రికలకు రాసే వ్యాసాలను ముందు కాగితంపై, పెన్నుతో రాస్తాడు. ఆ తరువాత దాన్ని టైప్‌ చేసి వార్తాపత్రికలకు ఈమెయిల్‌ చేస్తాడు. చాలామంది భాషాభిమానులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
వాడకం తగ్గించాలి
సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను వాడకుండా పెన్ను, పేపర్‌ ఉపయోగించి రాయడం వల్ల పార్కిన్సన్‌ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చని అధ్యయనాల్లో కనుగొన్నారు. అందుకే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌లలో ఉండేవారు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడవద్దని సూచిస్తారు. వీటికి దూరంగా ఉండటం వల్ల సీనియర్‌ సిటిజన్లకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్‌ మెసేజింగ్‌ అలవాటు పార్కిన్సన్‌, అల్జీమర్స్‌ వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ వల్ల విద్యార్థులు కూడా తాము మాట్లాడే భాషలపై పట్టును వేగంగా కోల్పోతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. అందువల్ల వయసుతో సంబంధం లేకుండా అందరూ గ్యాడ్జెట్లు, సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించాలని, మెదడు పనితీరును మెరుగుపరచడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

 

సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

సుకుమారంగా పెంచొద్దు

02-03-2021

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలూ రాకుండా సుకుమారంగా పెంచుతుంటారు. దాంతో భవిష్యత్తులో కూడా వారికి ఏ కష్టాలూ లేకుండా జీవిస్తారని

manavi

న్యాయ సలహాలు

ఎంపికలో జాగ్రత్తలు అవసరం

28-02-2021

కొంతమంది తమ భాగస్వామిని ఎంచుకునే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల పెండ్లి తర్వాత కలిసి ఉండలేక అనేక ఇబ్బందులు

manavi

న్యాయ సలహాలు

మాట వినడం లేదా..?

27-02-2021

నేటి పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో హ్యాపీగా కూడా ఉంటారు. 'మా పాప చాలా యాక్టివ్‌. మా అమ్మాయి భలే చలాకీ' అని

manavi

న్యాయ సలహాలు

సాఫీగా సాగిపోవాలంటే..?

22-02-2021

మీ భాగస్వామితో జీవితాంతం సుఖంగా ఉండాలంటే కొన్ని విషయాలను తప్పకుండా పాటించండి. అప్పుడు మీ మధ్య మరింత బంధం చిక్కగా బలపడి, చక్కగా జీవితాన్ని

manavi

న్యాయ సలహాలు

ఒత్తిడిని ఇలా జయించండి

15-02-2021

మానసిక ఒత్తిడి స్థాయి పెరిగితే గుండె జబ్బులు, డయాబెట్స్‌, డిప్రెషన్‌, అల్జీమర్స్‌తో పాటు అనేక రకాల వ్యాధుల బారిన పడకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ మనలో ప్రతిఒక్కరూ రోజూ ఏదో ఒక రూపంలో

manavi

న్యాయ సలహాలు

ఒంటరితనం వేధిస్తుంటే...

10-02-2021

చదువు, ఉద్యోగం.. ఏదో ఒక అవసరంతో అయినవారికి దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో చాలా మంది డిప్రెషన్‌కు లోనవుతారు. తెలియని మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. కొన్ని సందర్భాల్లో జీవితంపై

manavi

న్యాయ సలహాలు

అనుభవాలే నేర్పుతాయి

04-02-2021

పెండ్లి... ఓ మధురమైన ఘట్టం. ప్రతి ఒక్క జంటకూ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా ఆడపిల్లలు పెండ్లి గురించి, తమ కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. పెండ్లి తర్వాత తమ లైఫ్‌ అంతా హ్యాపీగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు.

manavi

న్యాయ సలహాలు

లక్ష్య సాధన కోసం...

30-01-2021

ప్రపంచంలో విజేతగా నిలిచిన ఏ వ్యక్తిని గమనించినా శారీరక, మానసిక క్రమశిక్షణ పాటించినవారే. ప్రతి వ్యక్తీ తన జీవితానికి తానే బాధ్యత వహించాలి. నిన్న , నేడు, రేపు ఎప్పుడైనా ఎక్కడైనా జీవిత విధానానికీ, మనహోదాకు వందశాతం మనమే

manavi

న్యాయ సలహాలు

మర్చిపోతున్నారా..?

30-01-2021

ఎక్కడైనా మంచి పుస్తకం కనిపిస్తే చాలు కొనేయడం...చదివిన తర్వాత దాన్ని ఎక్కడో ఒక చోట పడేయడం..మామూలే!తర్వాత ఎప్పుడైనా అదే పుస్తకం అవసరమొచ్చి వెతికితే తొందరగా దొరకదు. ఎక్కడ ఉంచామో గుర్తుండదు.

manavi

న్యాయ సలహాలు

సరుకులు కొంటున్నారా?

29-01-2021

అవసరాలకు తగ్గట్టుగా ఏయే సరుకులు కావాలో ముందుగా లిస్ట్‌ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. ఏది కావాలి. ఏది వద్దు అని సరిగా నిర్ణయించుకోలేకపోవడం వల్ల ఖర్చు తడిసి మోపిడవుతుంది.