సాఫీగా సాగిపోవాలంటే..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

సాఫీగా సాగిపోవాలంటే..?

మీ భాగస్వామితో జీవితాంతం సుఖంగా ఉండాలంటే కొన్ని విషయాలను తప్పకుండా పాటించండి. అప్పుడు మీ మధ్య మరింత బంధం చిక్కగా బలపడి, చక్కగా జీవితాన్ని ఆస్వాదించగలరు. పెండ్లి తర్వాత అందరి జీవితాల్లో మార్పు సహజం. ఆ మార్పులను స్వీకరించినప్పుడే జీవితం బాగుంటుంది. ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా మీ ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...
మీరు మీ పార్ట్‌ నర్‌ పై విశ్వాసం ఉంచారనుకోండి అది చాలు అన్ని అనుమానాలను పటాపంచలు చేసేస్తుంది. సంపూర్ణ విశ్వాసం ఉంటే ఏ బంధమైనా శాశ్వతంగా నిలుస్తుంది. బంధాలకు బీటలు వారటం మొదలయ్యేది అనుమానాలతోనే. విశ్వాసం లేని చోట అనుమానం పుడుతుంది. అనుమానం అనే బీజం పడిందో ఇక ఏ బంధమూ నిలవదు. మీ రిలేషన్లో చక్కని అనుబంధం కావాలంటే ఒకరిపై ఒకరికి సంపూర్ణ విశ్వాసం ఉండేలా చూసుకోండి.
ఒకరిని ఒకరు మిస్‌ అవ్వాలి
ఒకరికొకరు మిస్‌ అవ్వాలి. అప్పుడే మీరు మీ పార్టనర్‌ను ఎంతలా మిస్‌ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. మీ బంధం లోటుపాట్లు, మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న చక్కటి అనుబంధ బాంధవ్యం వంటివి తెలియాలంటే మీరు ఒకరిని ఒకరు మిస్‌ అవ్వాలి. అపుడే మీ పార్టనర్‌కు మీ జీవితంలో ఎంత విలువ ఉందో ఎంత అమూల్యమైన వ్యక్తో దంపతులిద్దరికీ అర్థమవుతుంది.
అవగాహన-అపార్థాలు
అపార్థాలు రావటం చాలా సహజం. కాబట్టి మీకు ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అపార్థాలు పుట్టుకొస్తాయి. ఇలాంటి మిస్‌ అండర్‌ స్టాండింగ్స్‌ను అధిగమించాలంటే మీపై, మీ జీవిత భాగస్వామిపై మీకున్న విశ్వాసం ఏపాటిదో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అవగాహనను బట్టే అపార్థాలకు చోటుంటుంది.
ప్రోత్సహించుకోవాలి
వృత్తి, ప్రవృత్తి ఏదైనా మీరిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఇలా మీరిద్దరూ ఎలాంటి ప్రోత్సాహం ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారో దాన్నిబట్టే మీ ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యకరమైన అనుబంధం అంటే ఇదే.
బలహీనతను అంగీకరించండి
భాగస్వామిక అన్నాక ఇక అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే సాధ్యమా. ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్‌ కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగే మీలోని బలహీనతను మీ భాగస్వామి ముందు అంగీకరించండి. ఇందులో నామోషీ ఏంలేదు నిజాయితీ తప్ప. మీరు అన్నింట్లో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే ఏ నిజాయితీ గల భాగస్వామీ కోరుకోరు.
క్షమించండి
ఏదైనా తప్పుజరిగినప్పుడు మీ భాగస్వామిని వెంటనే క్షమించండి. అదికూడా నిజాయితీగా మీ మనసు లోతుల్లోంచి క్షమించండి. తప్పులు చేయనివారెవ్వరూ ఉండరు. కాబట్టి హ్యాపీగా క్షమించేసి ప్రశాంతంగా ఉండండి. అప్పుడే మీ అనుబంధం సరికొత్త ఎత్తులను చూస్తుంది. మీ మధ్య ఆనందం మరింత వికసిస్తుంది.
అతిగా ఆశించకండి
అతిగా ఆశించి భంగపడటం మానేయండి. మీరెప్పుడైతే మీ భాగస్వామి నుంచి అతి స్వల్పంగా ఆశిస్తారో అప్పుడే మీరు ఎక్కువ ఆనందాన్ని మూటగట్టుకోగలరు. అతిగా ఆశించేవారికి ఏం చేసినా తక్కువ చేసినట్టే ఫీల్‌ అయి బాధపడతారు.
మీ భావాలు వెల్లడించండి
మీలోని భావాలు మీ భాగస్వామికి చెప్పండి. దాచుకోవటం ఎందుకు. తరచూ మీలోని భావాలు నిజాయితీగా పంచుకుంటే మీ భాగస్వామికి సంతోషం కలిగించటమే కాదు, మీ మనసు కూడా తేలికపడుతుంది. ఈ సోషల్‌ మీడియా యుగంలో భావాలు వెళ్లగక్కటం అత్యవసరం లేదంటే లేనిపోని అనుమానాలు, అపోహలు పుట్టుకొచ్చి అనవసరంగా మీ బంధం తెగేవరకూ పోతే కష్టం.
సర్దుకుపోవడం తప్పుకాదు
అప్పుడప్పుడు మీ భాగస్వామి కోసం సర్దుకుపోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇదేం ఓటమిపాలు కావటం కాదు. అవసరమైనప్పుడు మీరు కాంప్రమైజ్‌ అయితే మీ జీవిత భాగస్వామిలో ఎంతో సంతోషం నింపచ్చు. మీ జతగాడి కోసం మీరు చేసేది త్యాగం కాదు, అది మీ బలహీనత అసలే కాదు. కేవలం రెట్టింపు సంతోషం కోసం అప్పుడప్పుడు ఇలాంటి కాంప్రమైజేషన్స్‌ కావటం మంచిదే.

సాఫీగా సాగిపోవాలంటే..?

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌

09-04-2021

భారత్‌లో లింగ అసమానతలు నానాటికి పెరుగుతున్నాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలు ఎక్కువగా ఉండే

manavi

న్యాయ సలహాలు

పొదుపు చేసి ఏం లాభం..?

27-03-2021

కష్టపడి సంపాదించుకున్న సొమ్ములో కొద్దిగైనా పొదుపు చేసుకుంటే భవిష్యత్‌ బాగుంటుందని కలలు కన్నారు. పొదుపు సంఘాలుగా ఏర్పడి పొదుపు మొదలుపెట్టారు. లక్షల మంది

manavi

న్యాయ సలహాలు

ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే...

24-03-2021

మన జీవన గమనంలో ఎందరో వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. తెలియకుండానే ప్రతి ఒక్కరి వల్లా మనం ఎంతో కొంత ప్రభావితమవుతాం. అయితే కొద్ది మందితో

manavi

న్యాయ సలహాలు

బ్యాలన్స్‌ చేసుకుంటేనే...

13-03-2021

ఉద్యగ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తున్నారు నేటి మహిళలు. ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్‌ చేయడమంటే అంత

manavi

న్యాయ సలహాలు

అవగాహన పెంచుకోండి

06-03-2021

ఉద్యోగం, వ్యాపారం, ఇతర కారణాలలో భాగస్వామికి దూరంగా.. వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తమ దాంపత్య జీవితం గురించి కలత చెందుతారు. ఒకరికి ఒకరు దూరంగా ఉండటం వల్ల