మాట వినడం లేదా..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

మాట వినడం లేదా..?

నేటి పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో హ్యాపీగా కూడా ఉంటారు. 'మా పాప చాలా యాక్టివ్‌. మా అమ్మాయి భలే చలాకీ' అని మురిసిపోతుంటారు. అదే సమయంలో పిల్లలు 15, 16 ఏండ్ల వయసు వచ్చేసరికి అదే యాక్టివ్‌ నెస్‌, అదే చలాకీతనం వారితో 'నాకు తెలుసులే మమ్మీ. అబ్బా. నాకు తెలుసు నాన్నా' అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా అనగానే తల్లిదండ్రులకు ఒక్కసారిగా షాక్‌ అనిపిస్తుంటుంది. అప్పటి వరకు తల్లిదండ్రులకు ముద్దుగా అనిపించిన యాక్టివ్‌, చలాకీతనం అప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. 'అసలే పిల్లలు. తెలిసీ తెలియని వయసు. నాకు తెలుసు అంటే ఎలా. పెద్దలు చెప్పింది వినాలి కదా' అని తల్లిదండ్రులు అనుకోవడం సహజం. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో వాటిని దూరం చేసుకోవచ్చు.
కంగారు పడకూడదు. 'నాకు తెలుసు. నాకేం చెప్పొద్దు' అనేది మీ ఒక్కరి పిల్లలే కాదు. చాలా మందిలో అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి, మొదట మీరు చేయాల్సింది కంగారు పడకుండా ఉండడం.
- సంయమనం పాటించాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకునే బొమ్మరిల్లు అమ్మానాన్నలకు ఈ మాటలు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తాయి. కానీ, తల్లిదండ్రులే ఈ విషయంలో కొంచెం సంయమనంతో వ్యవహరించాలి.
- ఒక నిర్ణయం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా ఒక దుందుడుకు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తే వెంటనే వారిని కూర్చోబెట్టి వారికి ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించాల్సిన అంశాలు, ఆ నిర్ణయం తీసుకుంటే ఎదురయ్యే పర్యవసానాలు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోమని అర్థం అయ్యేలా చెప్పాలి.
- వాళ్లేం పసిపిల్లలు కాదు. 15, 16 ఏండ్ల వయసు వచ్చిన వాళ్లు.. మరీ పసిపిల్లలు కాదన్న విషయాన్ని పెద్దలు గ్రహించాలి. ఒకే విషయాన్ని పదే పదే చెప్పకూడదు. అలా చేస్తే 'రోజూ ఇదే సుత్తి' అనుకుంటారు. మీ దగ్గర కంటే బయట ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతారు. దాంతో మరిన్ని కొత్త సమస్యలు రావొచ్చు.
- ఇవన్నీ కొన్ని పరిష్కార మార్గాలు మాత్రమే. వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య సమస్యలు భిన్నంగా ఉండొచ్చు. అలాంటిది ఏదైనా కనిపిస్తే ఇది సాధారణం కాదు. అసాధారణంగా అనిపిస్తుందని అనిపిస్తే పిల్లలను డాక్టర్‌ దగ్గరకు తీసుకుని వెళ్లడంలో తప్పేం లేదు.

మాట వినడం లేదా..?

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌

09-04-2021

భారత్‌లో లింగ అసమానతలు నానాటికి పెరుగుతున్నాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలు ఎక్కువగా ఉండే

manavi

న్యాయ సలహాలు

పొదుపు చేసి ఏం లాభం..?

27-03-2021

కష్టపడి సంపాదించుకున్న సొమ్ములో కొద్దిగైనా పొదుపు చేసుకుంటే భవిష్యత్‌ బాగుంటుందని కలలు కన్నారు. పొదుపు సంఘాలుగా ఏర్పడి పొదుపు మొదలుపెట్టారు. లక్షల మంది

manavi

న్యాయ సలహాలు

ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే...

24-03-2021

మన జీవన గమనంలో ఎందరో వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. తెలియకుండానే ప్రతి ఒక్కరి వల్లా మనం ఎంతో కొంత ప్రభావితమవుతాం. అయితే కొద్ది మందితో

manavi

న్యాయ సలహాలు

బ్యాలన్స్‌ చేసుకుంటేనే...

13-03-2021

ఉద్యగ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తున్నారు నేటి మహిళలు. ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్‌ చేయడమంటే అంత

manavi

న్యాయ సలహాలు

అవగాహన పెంచుకోండి

06-03-2021

ఉద్యోగం, వ్యాపారం, ఇతర కారణాలలో భాగస్వామికి దూరంగా.. వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తమ దాంపత్య జీవితం గురించి కలత చెందుతారు. ఒకరికి ఒకరు దూరంగా ఉండటం వల్ల