సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలూ రాకుండా సుకుమారంగా పెంచుతుంటారు. దాంతో భవిష్యత్తులో కూడా వారికి ఏ కష్టాలూ లేకుండా జీవిస్తారని అనుకుంటారు. కానీ ఇది తప్పని ఆస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బాల్యంలో ఏ కష్టాలు లేకుండా సంతోషంగా జీవించినా, పెద్దయ్యాక మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సంతోషకరమైన, సురక్షితమైన బాల్యం పెద్దయ్యాక వారిని రక్షిస్తుందని చెప్పలేమని అధ్యయనం సూచించింది. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ఈ అధ్యయనం జరిగింది. బాల్యంలోని సానుకూల, ప్రతికూల అనుభవాలు యుక్తవయసులో ఆందోళన లేదా ఇతర మానసిక రుగ్మతలకు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనం ఆస్ట్రేలియాకు చెందిన 4 నుంచి 11 ఏండ్ల మధ్య గల 3,14,000 మంది బాలబాలికపై జరిగింది. ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది ప్రజలు బాల్యంలో సంతోషంగా జీవించినప్పటికీ, జనాభాలో దాదాపు 50 శాతం మంది యుక్తవయసుకు వచ్చాక వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తేలింది. కాబట్టి మానసిక ఆరోగ్య పరిస్థితులను బాల్యంలోని జీవిత సంఘటనలను బట్టి నిర్వచించలేమని అధ్యయనం స్పష్టం చేసింది. సంతోషకరమైన ఇంటిలో పెరిగిన పిల్లలు సైతం పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ పరిశోధన తెలుపుతుంది.
శక్తి తగ్గుతుంది: ఈ ఫలితాలపై అధ్యయన రచయిత కాV్ా్ల మాట్లాడుతూ ''బాల్యంలో ఏ కష్టాలకూ లోనవ్వనివారిలో సమస్యలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది. వారు పెద్దయ్యాక తమ అంచనాలను అందుకోనప్పుడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలను బాల్యంలో మరీ సుకుమారంగా పెంచకూడదు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలో వారికి నేర్పించాలి. ప్రతికూల పరిస్థితుల్లో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పాలి. దాంతో భవిష్యత్తులో మానసిక ఒత్తిడి, ఇతర ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో వారికి తెలుస్తుంది'' అన్నారు.
ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక
హోం › మానవి ›న్యాయ సలహాలు
MORE STORIES FROM THE SECTION

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు

న్యాయ సలహాలు
MORE SECTIONS
Recent From Manavi