స్త్రీ పక్షపాతి అంబేద్కర్‌.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

స్త్రీ పక్షపాతి అంబేద్కర్‌..

అంబేద్కర్‌ రచనలు ఎన్నో తెలుగులోకి అనువాదమయ్యాయి. అయితే స్త్రీలకు సంబంధించిన ఆయన రాసిన ప్రత్యేక పుస్తకం లేదు కానీ.. స్త్రీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చాలా ఉంది. అనేక పుస్తకాల్లో ఉపన్యాసాలు, వ్యాసాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అవన్నీ తెలుసుకోవాలంటే చాలా పుస్తకాలు చదవాల్సి వస్తుంది. అలాంటి కష్టం లేకుండా... వివిధ పుస్తకాల్లో వచ్చిన ఆయన వ్యాసాలు, ఉపన్యాసాలను ఒక్కచోట చేర్చి.. తీసుకొచ్చిన పుస్తకం ఫెమినిస్ట్‌ అంబేద్కర్‌. ఈ సందర్భంగా పుస్తకం గురించి రచయిత్రి బెల్లపు అనూరాధ మాటలు కొన్ని...
''డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ రచనలు, ఉపన్యాసాలు అనేక సంపుటాలుగా వెలువడిన విషయం తెలిసిందే. అందులో స్త్రీలకు సంబంధించిన కొన్ని వ్యాసాలు, ఉపన్యాసాలు, కొన్ని పూర్తిగానూ, కొన్ని పాక్షికంగాను ఒక దగ్గరకు తీసుకొచ్చి ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురిస్తోంది. సంపుటాలలో అక్కడక్కడా ఉన్న వీటినన్నింటినీ ఒక దగ్గర చేర్చడం వల్ల స్త్రీల విషయంలో డా. అంబేద్కర్‌ అభిప్రాయాలూ, ఆయన తన పరిధిలో చేసిన క షి గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డా. అంబేడ్కర్‌ హిందూ కోడ్‌ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంలో స్త్రీలకు ఆస్తి హక్కుని కలగ జేయడం, ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువు ల పట్ల చూపె వివక్షని అంతం చేయడం, స్త్రీలు వివాహితులైతే ఒక చట్టం, అవివాహితులైతే ఒక చట్టం, వితంతువులైతే మరొక చట్టం ఇలా ఇన్ని రకాలుగా ఉండడం సరైంది కాదని, స్త్రీలు పురుషులు సమానంగా చట్టం వర్తించేలా మార్పులు సూచించారు. కులాంతర మతాంతర వివాహాలకు కూడా చెల్లుబాటు ఉండాలని, ధార్మిక పద్ధతులు అతీతంగా రిజిస్టర్‌ పెళ్లిళ్లను ప్రవేశపెట్టి ఏ పద్ధతిలోనైనా సరే చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపు గౌరవం ఉండాలని హిందూ కోడ్‌ బిల్లులో సూచించారు. ఇంకా వేరు వేరు సందర్భాలలో చట్ట సభల్లో ఆయన స్త్రీల సమస్యల గురించి విధించారు. ప్రభుత్వం జనన నియంత్రణ గురించి చేపట్టవలిసిన చర్యల గురించి వాదిస్తూ, వెంట వెంట కాన్పులతో, అనారోగ్య పరిస్థితుల్లో పిల్లలను కలిసి రావడంతో స్త్రీలు జీవచ్ఛవాలుగా మారుతున్నారని, అనేక మంది స్త్రీలు ప్రాణాలు కోల్పోతున్నారనీ ఇది సమాజానికి ఏమీ క్షేమం కాదని అంటారు. స్త్రీలు జనన నియంత్రణ పద్ధతులు సులభంగా అందుబాటులో ఉంచవలిసిన బాధ్యత ప్రభుత్వానిదే అని గట్టిగా వాదించారు. అలాగే ముంబై ఫ్యాక్టరీల్లో స్త్రీలకు ప్రసూతి ప్రయోజన బిల్లును ప్రవేశపెట్టాలని, ఆ భారం మొయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గట్టిగా వాదించారు. స్త్రీల చేతిలో అక్షరాస్యత ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల స్త్రీలకు ఓటు హక్కు కావాలన్నారు. ముఖ్యంగా ఈ వాదనలు చేసిన కాలాన్ని కనక ద ష్టిలో పెట్టుకొంటే (1930, 50 ల మధ్య కాలం) ఆ కాలంలో స్త్రీల విషయంలో ఇంత ప్రగతిశీలంగా ఆలోచించడం డా. అంబేద్కర్‌ లోని ఒక ఫెమినిస్టు కోణాన్ని చూపిస్తుంది. స్త్రీలను అధోగతికి చేర్చి వారు ఆ స్థితిలో కొనసాగేందుకు ధర్మ శాస్త్రాలు, అందులోనుండి ఉటంకించి వివరిస్తారు. కాబట్టి ఆ చట్టాలలో మార్పులు చేయడం ద్వారా స్త్రీల పరిస్థితిని ఎంతో కొంత మార్చగలమని విశ్వసించారు కనక అందుకు చాలా క షి చేశారు. కాబట్టి ఇందులో చట్టాల గురించి చాలా వివరణా చర్చా ఉంటాయి. పాఠకులకి కొన్ని చోట క్లిష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది ఒక రెఫరెన్సు పుస్తకంగా పనికి వస్తుంది. అలాగే అర్ధం కానట్లనిపించినపుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ చదవాల్సి వస్తుంది. బొజ్జా తారకం, డా.విజయభారతి గారు అనువాదం చేసిన వ్యాసం, భార్గవ గారు చేసిన వ్యాసం యథాతధంగా ఇందులో ఉన్నాయి. నేను చేసిన అనువాదాలు సరళంగా ఉండాలనే ప్రయత్నంలో భావాన్ని బలిపెట్టకూడదని ప్రయత్నించాను. అలాగే పిత సవర్ణత, మాత నవర్ణత వంటి అనేక పదాలు డా. అంబేద్కర్‌ ఇంగ్లీషులో కూడా అలాగే వాడతారు. వాటిని అలాగే ఉంచాను. ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి డా. అంబేడ్కర్‌ చేసిన క షి గురి తెలుసుకోవాలనుకొనే వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.''

స్త్రీ పక్షపాతి అంబేద్కర్‌..

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

మహిళలే శక్తిమంతులు!

08-12-2019

ఆడవాళ్ల కంటే తామే బలవంతులం అనుకునే మగవాళ్లు ఓసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే శక్తిమంతులని చెప్పే ఆధారాలు బయటికొస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కూడా అనేక విషయాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ముందున్నారని చెబుతున్నాయి. నేషనల్‌

manavi

న్యాయ సలహాలు

కిడ్నాప్‌కు ప్రయత్నిస్తే..!

07-12-2019

ఇటీవల అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తున్న సంఘటనలు చాలా వింటున్నాం. స్కూల్‌, కాలేజ్‌, ఆఫీస్‌ ఇలా బయటకు వెళ్ళే వారు సురక్షితంగా ఇంటికి వస్తారో లేదో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో

manavi

న్యాయ సలహాలు

చట్టం ఏం చెబుతుంది..!

05-12-2019

మహిళలపై హింసను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. వాటి అమలు పక్కగా జరగాలి. అలాంటి వాటిల్లో గృహ హింస చట్టం-2005 ఒకటి. ఇది వివాహ బంధంలో ఉండి హింసకు

manavi

న్యాయ సలహాలు

అనుబంధం ఆనందంగా...

02-12-2019

చిన్నచిన్న విషయాలే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెంచుతాయి. కానీ ఇలా మనస్పర్థలు ఎదురైనప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు, అనే ఆలోచనతో మౌనంగా ఉండటం కూడా పొరపాటే అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తున్నారంటే భార్యాభర్తలు సమస్యల్ని వాయిదా వేస్తున్నారని అర్థం.

manavi

న్యాయ సలహాలు

ఇప్పటి నుంచే నేర్పండి!

02-12-2019

చిన్న వయసు నుంచే పిల్లలకు సంస్కారంతో పాటు విలువల్ని నేర్పాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు చెప్పే మాటలు విత్తనాళ్లా నాటుకు పోతాయి. సాధారణంగా పిల్లలను తల్లిదండ్రులు గారాబం చేస్తుంటారు. ఇది వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. మరింత మొండిగా, మాట వినకుండా

manavi

న్యాయ సలహాలు

పాజిటివ్‌ మైండ్‌సెట్‌ కావాలి!

01-12-2019

కొందరిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఆనందంగా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏదీ కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయి. మరి ఏంటి వాళ్ళ సీక్రెట్‌ ? అంటే పాజిటివ్‌ మైండ్‌ సెట్‌తో జీవితంలో ఎదురయ్యే

manavi

న్యాయ సలహాలు

చూపులు

30-11-2019

రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు

manavi

న్యాయ సలహాలు

నాయకత్వం వహిస్తున్నారా?

29-11-2019

ఆఫీసులో గానీ, బయట గానీ మీరు ఏదైనా బృందానికి నాయకత్వం వహిస్తున్నారా? అయితే మీలో కొన్ని లక్షణాలు ఉండాల్సిందే..కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. మంచి నాయకులు అవ్వాలంటే నాయకత్వలక్షణాలను ఏవిధంగా మెరుగుపరుచుకోవాలో చూద్దాం..

manavi

న్యాయ సలహాలు

పుస్తక పఠనమే మేలు

25-11-2019

ప్రతిరోజు స్నేహితులతో చాటింగ్స్‌, టీ, కాఫీ, బ్రేక్‌లు కాసేపు అవతలపెట్టి అవకాశం దొరికితే ఏదో ఒక పుస్తకంలో ఒక పేజీ అయినా చదువుకోవచ్చు కదా అంటున్నాయి అధ్యాయనాలు. ప్రొఫైల్స్‌,స్టేటస్‌ అప్డేట్స్‌, ర్యాండమ్‌ గేమ్స్‌తో

manavi

న్యాయ సలహాలు

మెడ పట్టుకుంటే..!

23-11-2019

ఆడపిల్లలపై దాడి చేయడమే లక్ష్యంగా కొంతమంది అకతాయిలు ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే అమ్మాయిలు వేగంగా స్పందించాలి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని అల్లరిచేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఎలా బుద్ధి చెప్పాలో ఈ వారం