కోపం సహజమే..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

కోపం సహజమే..!

మనిషిలో ఉండే గుణాల్లో ఒకటైంది కోపం. ఇది ప్రతి మనిషిలో ఉండే సహజమైన భావోద్వేగం. ఒకరి అభిప్రాయాలకు భిన్నంగా, ఇష్టమైన వాటికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎదుటి వారి మీద కోపం వస్తుంది. ఈ ఉద్వేగం నియంత్రించుకోనప్పుడు అనారోగ్యకరమైన వాతావరణానికి దారి తీస్తుంది.
- కోపంగా ఉన్న వ్యక్తులు వారు సాధించగలిగేదాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఇలాంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనే నమ్మకం ఆహ్లాదకరంగా ఉంటుందని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ అంటారు.
- కోపం మనిషిలోని సాధారణ ఆరోగ్యకరమైన భావోద్వేగం అని పరిశోధనలు చెపుతున్నాయి. కానీ అదే పనిగా కోప్పడడం అనారోగ్యానికి దారితీయడంతో పాటు, సంబంధ బాంధవ్యాలను దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి చాలా సందర్భాల్లో కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం.
- ప్రశాంతంగా ఉండే వారిలో కంటే కోపంగా ప్రవర్తించే వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువ. జీవన శైలిలో మార్పు కారణంగా రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలే కోపానికి కారణం అవుతున్నాయి. ప్రధానంగా కుటుంబ, ఆర్థిక సమస్యలు కోపాన్ని పెంచుతాయి.
- శరీరంలోని మోనోమైన్‌ ఆక్సిడెస్‌ఏ అనే ఎంజైమ్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక్కోవ్యక్తిలో ఒక్కో మోతాదులో ఉంటుంది.
- కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. ఏ కారణంతో కోపం వస్తుందో ముందు గుర్తించాలి. దాన్ని బంధువులు, టీచర్లు, సహౌద్యోగులు ఇలా ఎవరితోనైనా విషయాన్ని పంచుకోవడం ద్వారా కోపాన్ని నియంత్రించుకోవచ్చు.
- వారి నుండి సలహాలు తీసుకోవడం వల్ల అవగాహన వస్తుంది. ఇలా సులువుగా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా వయస్సు పెరిగే కొద్ది కూడా కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకోవచ్చు.

కోపం సహజమే..!

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

మార్పు మంచిదే!

19-02-2020

''లైఫ్‌ బోర్‌గా వుంది'' అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే చాలా మంచి అవకాశం. రేపు భవిష్యత్తులో మీరు ఏదో సాధించబోతున్నారు అన్న దానికి సంకేతం అది. ఇవి మన మనసులను చదివే నిపుణుల మాటలు. అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించమట. కాబట్టి

manavi

న్యాయ సలహాలు

లావుగా ఉంటేనే లగ్గం

11-02-2020

ఈరోజుల్లో అమ్మాయిలు ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఏ కొంచెం బరువు పెరిగినట్లు అనిపించినా తెగ ఆందోళన చెందుతుంటారు. వ్యాయామాలు, జిమ్‌, డైటింగ్‌ అంటూ నానా హైరానా చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే ఓ దేశంలో మాత్రం అమ్మాయిలు లావుగా

manavi

న్యాయ సలహాలు

పిల్లల ముందు తగవులా?

03-02-2020

తల్లిదండ్రులు తగవులు పడటం.. వాదులాడుకోవటం మామూలే. అయితే అవి పిల్లలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందనేదాంట్లో చాలా తేడాలున్నాయి. మరి.. తల్లిదండ్రులు తమ తగవులు పిల్లలకు చేసే చేటును తగ్గించటానికి ఏం చేయవచ్చు?

manavi

న్యాయ సలహాలు

ఆడవాళ్లే బెస్ట్‌

26-01-2020

ఆడవాళ్ళూ మగవాళ్ళతో సమానంగా ఎదిగారని పోలుస్తుంటారు, కానీ నిజానికి ఆ పోలిక ఇటునుంచి అటు చేయాలి. ఎందుకంటే, ఎన్నో విషయాలలో ఆడవారు మగవారికన్నా ఎంతో మెరుగని గట్టిగా చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. అవేంటో తెలుసా?

manavi

న్యాయ సలహాలు

ఆఫీసు గాసిప్స్‌తో జాగ్రత్త..!

20-01-2020

అన్ని బంధాలకన్నా స్నేహ బంధం గొప్పదంటారు. ఎంత మంచి ఫ్రెండ్‌ అయినా కొన్ని విషయాలు పర్సనల్‌గా ఉంచుకోవాలి. లేదంటే అందరిలో చులకన అవ్వడంతోపాటు గాసిప్స్‌కు దారితీస్తుంది. సహౌద్యోగులతో ఎలా

manavi

న్యాయ సలహాలు

పాత న్యూస్‌ పేపర్లతో...

19-01-2020

న్యూస్‌ పేపర్‌ను పడేస్తున్నారా? లేదా అమ్మేస్తున్నారా. ఇకపై ఇంటి అవసరాలకు ఉప యోగించండి. ఈ చిన్న చిట్కాను ఉపయో గించి పాత న్యూస్‌ పేపర్‌ను మన ఇంటి అవసరాలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.

manavi

న్యాయ సలహాలు

చేతులే చురకత్తులుగా..!

18-01-2020

ఒంటరిగా ఉన్న ఆడవారిని టార్గెట్‌ చేసి దాడులు చేసే సంఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సేల్స్‌ రెప్రజెంటివ్స్‌గా ప్రాడక్ట్స్‌ చూయిస్తామంటూ మాయమాటలు చెప్పి ఆడవారిపై

manavi

న్యాయ సలహాలు

దయచేసి ఆపండి..!

17-01-2020

చిన్నారులు అభం, శుభం తెలియని వాళ్లు. అలాంటి వాళ్లను ఒంటరిగా బయటకు పంపిస్తే..మనసులో ఏదో భయం తల్లిదండ్రులకు. బస్సులో ఒంటరిగా వెళ్లినా భయం, గుడికి, బడికి వెళ్లినా భయం, న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళినా భయం, కాలేజీలో ప్రిన్సిపల్‌తో.. ప్రొఫెసర్లతో..