ఆఫీసు గాసిప్స్‌తో జాగ్రత్త..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

ఆఫీసు గాసిప్స్‌తో జాగ్రత్త..!

అన్ని బంధాలకన్నా స్నేహ బంధం గొప్పదంటారు. ఎంత మంచి ఫ్రెండ్‌ అయినా కొన్ని విషయాలు పర్సనల్‌గా ఉంచుకోవాలి. లేదంటే అందరిలో చులకన అవ్వడంతోపాటు గాసిప్స్‌కు దారితీస్తుంది. సహౌద్యోగులతో ఎలా మసలుకోవాలో తెలుసుకోండి.
- చాలామంది ఉద్యోగినులు తమకు సంబంధించిన చాలా విషయాలు సహౌద్యోగులతో పంచుకుంటే భారం తగ్గుతుందనుకుంటారు. అదే విధంగా మనసులోని విషయాలను పంచుకుంటారు.
- అవి కొన్నిరోజులకు గాసిప్పులకు దారితీస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే సహౌద్యోగులతో సన్నిహితంగా ఉంటున్నా ఓ సరిహద్దు గీసుకోవడం మంచిది.
- ఉద్యోగం చేసేవారికి నిద్రలేమి కూడా ఎదురవుతుంటుంది. రోజుకు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోని వాళ్లుంటారు. అలాంటివారు ఆఫీసులో పది నిమిషాల సమయం దొరికినా కునుకు తీసేందుకు ప్రయత్నించండి. అలా నిద్రపోవడాన్ని పవర్‌న్యాప్‌ అంటారు. ఇలా చేయడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
- నిద్రతోపాటు సరైన ఆహారం తీసుకోకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే శాండ్‌విచ్‌, రెండు పండ్లు తీసుకెళ్తే బెటర్‌. కుదిరితే గ్లాస్‌ పాలు తాగితా మేలు. శరీరానికి కొంత శక్తి అందుతుంది.
- ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే ప్రణాళిక వేసుకోవాలి. ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల జోలికి వెళ్లకూడదు. అంటే వారంలో ఒకరోజును నో టెక్నాలజీ డేగా పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆఫీసు గాసిప్స్‌తో జాగ్రత్త..!

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

మార్పు మంచిదే!

19-02-2020

''లైఫ్‌ బోర్‌గా వుంది'' అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే చాలా మంచి అవకాశం. రేపు భవిష్యత్తులో మీరు ఏదో సాధించబోతున్నారు అన్న దానికి సంకేతం అది. ఇవి మన మనసులను చదివే నిపుణుల మాటలు. అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించమట. కాబట్టి

manavi

న్యాయ సలహాలు

లావుగా ఉంటేనే లగ్గం

11-02-2020

ఈరోజుల్లో అమ్మాయిలు ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఏ కొంచెం బరువు పెరిగినట్లు అనిపించినా తెగ ఆందోళన చెందుతుంటారు. వ్యాయామాలు, జిమ్‌, డైటింగ్‌ అంటూ నానా హైరానా చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే ఓ దేశంలో మాత్రం అమ్మాయిలు లావుగా

manavi

న్యాయ సలహాలు

పిల్లల ముందు తగవులా?

03-02-2020

తల్లిదండ్రులు తగవులు పడటం.. వాదులాడుకోవటం మామూలే. అయితే అవి పిల్లలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందనేదాంట్లో చాలా తేడాలున్నాయి. మరి.. తల్లిదండ్రులు తమ తగవులు పిల్లలకు చేసే చేటును తగ్గించటానికి ఏం చేయవచ్చు?

manavi

న్యాయ సలహాలు

ఆడవాళ్లే బెస్ట్‌

26-01-2020

ఆడవాళ్ళూ మగవాళ్ళతో సమానంగా ఎదిగారని పోలుస్తుంటారు, కానీ నిజానికి ఆ పోలిక ఇటునుంచి అటు చేయాలి. ఎందుకంటే, ఎన్నో విషయాలలో ఆడవారు మగవారికన్నా ఎంతో మెరుగని గట్టిగా చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. అవేంటో తెలుసా?

manavi

న్యాయ సలహాలు

పాత న్యూస్‌ పేపర్లతో...

19-01-2020

న్యూస్‌ పేపర్‌ను పడేస్తున్నారా? లేదా అమ్మేస్తున్నారా. ఇకపై ఇంటి అవసరాలకు ఉప యోగించండి. ఈ చిన్న చిట్కాను ఉపయో గించి పాత న్యూస్‌ పేపర్‌ను మన ఇంటి అవసరాలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.

manavi

న్యాయ సలహాలు

కోపం సహజమే..!

18-01-2020

మనిషిలో ఉండే గుణాల్లో ఒకటైంది కోపం. ఇది ప్రతి మనిషిలో ఉండే సహజమైన భావోద్వేగం. ఒకరి అభిప్రాయాలకు భిన్నంగా, ఇష్టమైన వాటికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎదుటి వారి మీద కోపం వస్తుంది. ఈ ఉద్వేగం నియంత్రించుకోనప్పుడు అనారోగ్యకరమైన వాతావరణానికి దారి తీస్తుంది.

manavi

న్యాయ సలహాలు

చేతులే చురకత్తులుగా..!

18-01-2020

ఒంటరిగా ఉన్న ఆడవారిని టార్గెట్‌ చేసి దాడులు చేసే సంఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సేల్స్‌ రెప్రజెంటివ్స్‌గా ప్రాడక్ట్స్‌ చూయిస్తామంటూ మాయమాటలు చెప్పి ఆడవారిపై

manavi

న్యాయ సలహాలు

దయచేసి ఆపండి..!

17-01-2020

చిన్నారులు అభం, శుభం తెలియని వాళ్లు. అలాంటి వాళ్లను ఒంటరిగా బయటకు పంపిస్తే..మనసులో ఏదో భయం తల్లిదండ్రులకు. బస్సులో ఒంటరిగా వెళ్లినా భయం, గుడికి, బడికి వెళ్లినా భయం, న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళినా భయం, కాలేజీలో ప్రిన్సిపల్‌తో.. ప్రొఫెసర్లతో..