మార్పు మంచిదే! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

మార్పు మంచిదే!

''లైఫ్‌ బోర్‌గా వుంది'' అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే చాలా మంచి అవకాశం. రేపు భవిష్యత్తులో మీరు ఏదో సాధించబోతున్నారు అన్న దానికి సంకేతం అది. ఇవి మన మనసులను చదివే నిపుణుల మాటలు. అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించమట. కాబట్టి జీవితంలో కొత్తగా ఏ మార్పూ రాదు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా ఇష్టపడటం ఎంతోకాలం చేయలేం. ఏదో ఓ రోజున 'బోర్‌' అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఓ బ్రేక్‌, ఓ మార్పు కావాలనిపిస్తుంది. అదిగో అలా అనిపించింది అంటే అది జీవితంలో సరికొత్త మార్పుకి శ్రీకారమే కదా అంటున్నారు నిపుణులు. మరి అలా బ్రేక్‌ కావాలి, మార్పు కావాలి అనిపిస్తే అందుకు ఏం చేయాలి?
- జీవితంలో మార్పు కావాలని అనిపిస్తే ఆ మార్పు బయట ఎక్కడినుంచో రాదు. అది మనలో రావాలి అంటున్నారు నిపుణులు. ముందుగా మన పరిధులు, పరిమితులు, పరిస్థితులు, వయసు వంటి వాటి గురించి ఆలోచించడం, భయపడటం, సందేహపడటం మానేయాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏ మార్పు అయితే మీకు ఆనందాన్నిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారో ఆ మార్పు గురించి ఆలోచించండి. ఆ తరువాత దానిని అమలు చేయడమెలాగో చూడండి, ప్రయత్నించండి. గట్టి సంకల్పం వుంటే ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి.
- మీకు నచ్చిన ఓ కోర్స్‌ చేయడం, సగంలో ఆపేసిన హాబీని తిరిగి నేర్చుకోవడం, కొత్తగా ఓ హాబీని అలవర్చుకోవడం, ఈవినింగ్‌ కాలేజీలో చేరడం లేదా ఓ కొత్త భాషను నేర్చుకోవడం, సమాజసేవ, ఓ వ్యాపారం.. ఇలా ఏదైనా కావచ్చు. తప్పకుండా ఓ మంచి ప్రయత్నమే అవుతుంది. జీవితాన్ని ఇప్పటికంటే అందంగా మారుస్తుంది. నచ్చడం లేదంటూ పరిస్థితులను, జీవితాన్ని తిట్టుకుంటూ గడపటం, ఆ అసంతప్తిని ఇంట్లోవారిపై చూపించడం, మనల్ని మనం బాధపెట్టుకోవడం కంటే జీవితాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడం ఎంతో సులువు.
- అనుకుంటాంగానీ, మన గట్టి సంకల్పం ముందు కొండలైనా తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణగా నిత్యం మనకు ఎంతోమంది స్త్రీలు విజయబావుటా ఎగరేస్తూ కనిపిస్తూ వుంటారు. వారిని చూసి ఆనందపడి, అచ్చెరువొందే మనం రేపటి రోజున మరొకరికి స్ఫూర్తిగా నిలవగలం. చిన్న ప్రయత్నం, గట్టి సంకల్పం, మరింత తపన చాలు జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి. 

మార్పు మంచిదే!

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

సాగులో.. సంపదలో సమాన వాటా దక్కాలంటే..

02-03-2020

మరో ఆరు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. సమాన పనికి సమాన వేతనం హక్కుగా దక్కాలని, మెరుగైన పనిప్రదేశాలు కావాలని, పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇవ్వాలని నినదించి శతాబ్దం దాటిపోయింది. అయినా సమాన హక్కుల

manavi

న్యాయ సలహాలు

అన్యోన్యత పెరిగేలా...

24-02-2020

ఏ బంధమైనా సరే ప్రేమ, నమ్మకం వంటి వాటితోనే కలకాలం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య విషయంలో మీరు మీ పార్టనర్‌కి బలంగా మారాలి. అంతేగానీ, బలహీనతగా మారకూడదు. ఒకరినొకరూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రతీ విషయంలోనూ

manavi

న్యాయ సలహాలు

లావుగా ఉంటేనే లగ్గం

11-02-2020

ఈరోజుల్లో అమ్మాయిలు ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఏ కొంచెం బరువు పెరిగినట్లు అనిపించినా తెగ ఆందోళన చెందుతుంటారు. వ్యాయామాలు, జిమ్‌, డైటింగ్‌ అంటూ నానా హైరానా చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే ఓ దేశంలో మాత్రం అమ్మాయిలు లావుగా