కాస్త వేడి వేడిగా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

కాస్త వేడి వేడిగా...

సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలి. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. చలిగాలికి, వర్షానికి గొంతులోకి కాస్త వేడి వేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా.. సూప్‌ లు ఉన్నాయి కదా.. ఒక పట్టు పట్టవచ్చు కదా.... ఉప్పు, కారం, ఒకటి రెండు కూరగాయలు కలిపి మరిగించి స్పూన్‌తో నోటికి అందుకుంటే ఆకలి అందుకుంటుంది. బద్దకం పారిపోతుంది. మూడ్‌ హుషారవుతుంది. కూరగాయలతో పాటు మాంసాహారంతో తయారు చేసే సూప్‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. కమ్మనైన రుచి ఘుభాళించే సువాసనతో ఉండే ఈ సూప్‌లు రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. తయారు చేయడం కూడా సులభమే.
చికెన్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌
కావల్సినన పదార్థాలు : చికెన్‌ - వంద గ్రాములు, క్యారెట్‌ ముక్కలు - అర కప్పు, క్యాబేజీ - అర కప్పు, స్వీట్‌ కార్న్‌ - రెండు కప్పులు, మిరియాలపొడి - టీస్పూను, కారప్పొడి - అర టీ స్పూను, కార్న్‌ ఫ్లోర్‌ - టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
తయారుచేయు విధానం : ముందుగా ఒక పాన్‌ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్‌ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి. ఒక నిముషం తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి. వేడి అయిన తర్వాత అందులో స్వీట్‌ కార్న్‌, సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్‌ ముక్కలు వేయాలి. తర్వాత రెండు లీటర్ల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్‌ చేయాలి. ఇప్పుడు వాటికి మిరియాల పొడి, కారప్పొడి వేసి మిక్స్‌ చేయాలి. తర్వాత అందులోనే చికెన్‌ కూడా వేసి మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌ తీసుకొని అందులో నీరు, కార్న్‌ ఫ్లోర్‌ వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలగలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం అంతా 10-15 నిమిషాలు మెత్తగా ఉడకనివ్వాలి. అంతే హాట్‌ అండ్‌ స్పైసీ చికెన్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌ రెడీ.

ఓట్స్‌ సూప్‌
కావల్సినన పదార్థాలు : ఓట్స్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ - పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు - 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి), ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల - కొద్దిగా, నూనె - కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా.
తయారుచేయు విధానం : పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఈలోపు వేరుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌ వేసి ఉడికించుకోవాలి. చిక్కగా ఉడికిన తర్వాత అందులో పాలు మిక్స్‌ చేయాలి. ఐదు నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు అందులో వేగించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్‌ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో ఓట్స్‌ సూప్‌ను గార్నిష్‌ చేయాలి. అంతే ఓట్స్‌ సూప్‌ రెడీ. ఈ స్పైసీ ఓట్స్‌ సూప్‌ను వేడి వేడిగా సర్వ్‌ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. స్పైసీగా ఉండాలంటో ఒకటి రెండు పచ్చిమిర్చిని జోడిచవచ్చు.

చికెన్‌ మష్రుమ్‌ సూప్‌
కావల్సినన పదార్థాలు : బోన్‌ లెస్‌ చికెన్‌ - 250 గ్రాములు, చికెన్‌ - నాలుగు కప్పులు, మష్రుమ్‌ - 10(రెండుగా కట్‌ చేయలి) ఉల్లిగడ్డ - 4 (కట్‌ చేయాలి), పచ్చిమిర్చి - 2(కట్‌ చేసినవి), మిరియాలు - 10(పొడి చేసుకోవాలి), కొత్తిమీర - ఒకకట్ట(సన్నగా కట్‌ చేసుకోవాలి), బట్టర్‌ - టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేయు విధానం : ముందుగా కుక్కర్‌లో చికెన్‌ వేసి, అందులో నీళ్ళు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి కుక్కర్‌లో చికెన్‌ ముక్కలను వేరుగా తీసుకోవాలి. చికెన్‌ ఉడికించిన నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా బట్టర్‌ వేసి కరిగిన తర్వాత మిరియాల పొడి వేసి ఒక సెకన్‌ వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేగించుకవాలి. తర్వాత అందులో మష్రుమ్‌ కూడా వేసి వేగించాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిగడ్డ కాడలు, పక్కన పెట్టుకొన్న సన్నని చికెన్‌ పీసులు వేసి బాగా మిక్స్‌ చేసి రెండు నిముషాలు వేగించుకోవాలి. వేగిన తర్వాత అందులో నీళ్ళు నాలుగు కప్పులు పోసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసి కొత్తిమీర తరుగు కూడా వేసి 10 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే చికెన్‌ మష్రఉమ్‌ సూప్‌ రెడీ.

క్యాబేజీ పెప్పర్‌ సూప్‌
కావల్సినన పదార్థాలు : క్యాబేజీ - 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి), క్యారెట్‌ - 2 (పొట్టు తీసి సన్నగా తరిగిపెట్టుకోవాలి), ఉల్లిగడ్డ - 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి), కార్న్‌ ఫ్లోర్‌ - అర టీ స్పూను, మిరియాలు - 1 టీస్పూను(పొడి), ఉప్పు - రుచికి సరిపడా, బట్టర్‌ - టీ స్పూను.
తయారుచేయు విధానం : ముందుగా కూరగాయల ముక్కలన్నీ నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెజర్‌ కుక్కర్‌ స్టౌ మీద పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న క్యాబేజీ, క్యారెట్‌, ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. అన్ని బాగా మిక్స్‌ చేసి, మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీయాలి. ఇప్పుడు ఓ పాన్‌లో బటర్‌ వేసి అందులో కూరగాయ ముక్కలతో సహా సూప్‌(కూరలు ఉడికిన నీరు) కూడా అందులో పోయాలి. ఇప్పుడు అందులో మిరియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్‌ చేయాలి. సూప్‌ చిక్కగా రావాలంటే కొద్దిగా కార్న్‌ ఫ్లోర్‌ కలిపి ఉండలు కట్టకుండా మిక్స్‌ చేయాలి. అంతే పెప్పర్‌, క్యాబేజీ సూప్‌ రెడీ. వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. ఇది దగ్గు జలుబును నివారిస్తుంది. అలాగే శరీరంలో వేడి పుట్టించి కొవ్వును కరిగిస్తుంది.

కాస్త వేడి వేడిగా...

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

దసరా ఘుమఘుమలు

22-10-2020

మనకి అన్నింటికంటే పెద్ద పండుగ దసరా. రకరకాల వంటకాలు చేసుకొని రుచి చూస్తాం. ప్రస్తుత వాతావరణం, కరోనా పరిస్థితుల్లో గతంలో వలె పండుగ చేసుకునే మూడ్‌

manavi

వంటలు - చిట్కాలు

నాన్‌ స్టిక్‌ వాడుతున్నారా?

17-10-2020

దోశలు వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనం వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. ఇనుప దోసె పెనం వాడండి చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్‌స్టిక్‌ పెనంపై దోసెలు అంటుకోకుండా వస్తాయి.

manavi

వంటలు - చిట్కాలు

రెగ్యులర్‌ కూరలతో బోర్‌ కొట్టిందా..?

08-10-2020

ఇంట్లో ప్రతి రోజూ ఏం కూర చేయాలి అనే సందేహం తప్పకుండా వస్తుంది. పెద్దలకు నచ్చింది పిల్లలకు నచ్చదు. పిల్లల కోసం పెద్దలు కొన్ని రుచులు వదులుకోవాల్సి వస్తుంది.

manavi

వంటలు - చిట్కాలు

ఇంట్లోనే హెల్తీ స్నాక్స్‌

01-10-2020

పిల్లలకు రోజుకొక రుచికావాలి. వాళ్ళు కడుపునిండా తింటేనే అమ్మకు సంతోషం. సాధారణంగా అన్నం కంటే చిరుతిళ్ళను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బయటి ఫుడ్‌ ఆరోగ్యానికి అంత

manavi

వంటలు - చిట్కాలు

ఓట్స్‌తో రుచికరంగా...

24-09-2020

ఓట్స్‌... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌కే మొదటి ఓటు వేస్తారు. మామూలుగా అయితే ఓట్స్‌తో చేసిన వంటకాలు అంత రుచిగా

manavi

వంటలు - చిట్కాలు

అన్నంతో వెరైటీగా...

17-09-2020

పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త రుచులు కావాలి. లేదంటే ఓ పట్టాన తినరు. చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా వుండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. అన్నం తింటానికి సాధారణంగా పిల్లలు మారాం చేస్తారు.