దసరా ఘుమఘుమలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

దసరా ఘుమఘుమలు

మనకి అన్నింటికంటే పెద్ద పండుగ దసరా. రకరకాల వంటకాలు చేసుకొని రుచి చూస్తాం. ప్రస్తుత వాతావరణం, కరోనా పరిస్థితుల్లో గతంలో వలె పండుగ చేసుకునే మూడ్‌ లో మనం లేము. కానీ తినాల్సిందే. రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. కాబట్టి మనలో శక్తిని నింపుకునేందు కొర్ర బియ్యంతో చేసిన చెక్కర పొంగలితో పాటు నోరు తీపి చేసుకునేందుకు సగ్గుబియ్యం పాయసం, కాస్త కారం కారంగా నాటుకోడి పులుసు, దానికి తోడు మినప గారెలు చేసుకుని ఈ దసరా సెలబ్రెట్‌ చేసుకుందాం...

సగ్గు బియ్యం పాయసం
కావల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం - 15 గ్రాములు, బెల్లం - 150 గ్రాములు, పాలు - అర లీటరు, స్వీట్‌ కండెన్సడ్‌ మిల్‌ - అర కప్పు, ఇలాచీ - మూడు, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్ళు - 150 మి.లీ. (బెల్లం పాకం కొరకు), బాదంపప్పులు - పది, జీడిపప్పులు - 10, ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌ స్పూన్లు, పిస్తా పప్పులు - నాలుగు, కొబ్బరి ముక్కలు - కొన్ని (సన్నగా తరిగినవి).
తయారు చేసే విధానం : ముందుగా సగ్గుబియ్యం 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉడికించే ముందు ఒకసారి కడగాలి. సగ్గబియాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగేలా నీళ్ళు పోసి ఉడకపెట్టుకోవాలి. ఉడకేటప్పుడు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తురుమును ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్ళు పోయాలి. పెద్దమంట మీద ఉంచి మరిగే వరకు ఉడికించాలి. ఒకసారి ఉడకటం మొదలవగానే తిప్పుతూ ఉండాలి. తీగపాకం అవసరం లేదు. పాకాన్ని పట్టుకుంటే జిడ్డుగా నూనెలా అనిపించే వరకు కాచి స్టవ్‌ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. బాదంపప్పు, జీడిపప్పు, ఇలాచీలను మిక్సీలో వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. మందపాటి పాత్రలో పాలు పోసి మరిగే వరకు కాచాలి. పాలు మరగడం మొదలవగానే అందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి మూడు నిమిషాల పాటు వేడిచేయాలి. తర్వాత స్వీట్‌ కండెన్సడ్‌ మిల్క్‌, పప్పుల పొడి వేసి కలిపి మూడు నుండి ఐదు నిమిషాల పాటు సన్నని సెగ మీద కలుపుతూ మరగనివ్వాలి. స్టవ్‌ కట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత పాయసంలో బెల్లం పాకం పోసి కలపాలి. ఒక చిన్న పెనంలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదంపప్పులను దోరగా వేయించి పాయసంలో వేసి వేడిగా గానీ లేదా రెండు నుండి మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్‌ చేయవచ్చు.

కొర్ర బియ్యంతో చెక్కర పొంగలి
కావలసిన పదార్దాలు : కొర్ర బియ్యం - అర కప్పు, పెసరపప్పు - అర కప్పు, నెయ్యి - నాలుగు స్పూన్‌, డ్రై ఫ్రూట్స్‌ - పావు కప్పు, ఇలాచీ పౌడర్‌ - చిటికెడు, మిల్క్‌ మెయిడ్‌ - 200 గ్రాములు.
తయారు చేసే విధానం : విడివిడిగా కొర్రబియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టు కోవాలి. ఇప్పుడు బాణలిలో మూడు చెంచాలు నెయ్యి వేసి... నేతిలో డ్రైఫ్రూట్స్‌ వేయించి అందులో నానిన పెసరపప్పువేసి కమ్మని వాసనా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నీరుపోసి పెసరపప్పు... సగంపైన ఉడికిన తరువాత కొర్రబియ్యం వేసి మరి కొద్ది నీటిని జోడించి.... రెండు పూర్తిగా ఉడికిన తరువత ఇలాచీ పౌడర్‌, మిల్క్‌ మెయిడ్‌ వేసి ఒక స్పూన్‌ నెయ్యి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. చాలా రుచిగా ఉండే కొర్రబియ్యం చెక్కర పొంగలి రెడీ అయిపోయినట్టే. దీనిని పాలతో ఉడికించి బెల్లం తరుగు (లేదా) చెక్కర కూడా కలుపుకోవచ్చు .

నాటుకోడి పులుసు
కావలసిన పదార్ధాలు : నాటుకోడి - 1, ఉల్లిగడ్డలు - 2, కరివేపాకు -2 రెమ్మలు, కొత్తిమీర -1 కట్ట (సన్నగా తరగాలి), కారం - 2 చెంచాలు, ఉప్పు - తగినంత, పసుపు - 1 చెంచా, ధనియాల పొడి - 2 చెంచాలు, ఎండు కొబ్బరి - 1 చిప్ప (చిన్నది), గసగసాలు - 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 చెంచాలు, నూనె - 4 చెంచాలు,
తయారు చేసే విధానం : ముందుగా నాటుకోడిని మొత్తంగా తీసుకొని దానికి పసుపు, ఉప్పు కొద్దిగా నూనె పట్టించి, చిన్న అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి. లేదా ఓవెన్‌ లో 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత నాటుకోడి చల్లారే వరకూ పక్కన పెట్టి.. అది చల్లారిన తరువాత దానిని తీసుకొని బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. (చిన్న ముక్కలుగా చేసుకున్న తరువాత కడగరాదు). ఈ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి వేపాలి. ఉల్లిగడ్డలు వేగాక మసాలా పట్టించిన నాటుకోడి ముక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లుపోసి సన్నని మంటమీద చికెన్‌ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎండుకొబ్బరిని సన్నగా తరిగి పొడిగా వేపుకోవాలి. గసగసాలు కూడా వేపుకోవాలి. ఎండుకొబ్బరి, గసగసాలు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఉడికిన చికెన్‌లో వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఇంకో పదినిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్‌ ఉడికిన తరువాత దించి సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి. గారెలతో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.
మినప గారెలు
కావల్సిన పదార్థాలు : మినపప్పు - పావు కేజీ, అల్లం - రెండు అంగుళాలు, పచ్చిమిర్చి - ఆరు, ఉల్లిగడ్డ - వంద గ్రాములు, కరివేపాకు - ఒక రెమ్మ, నెయ్యి - ఒక టీ స్పూన్‌, ఇంగువ - అర టీ స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - అర కేజీ.
తయారు చేసే విధానం : మినప్పప్పును ఒక గంట నానపెట్టి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ సన్నగా తరిగిపెట్టుకోవాలి. పిండిలో ఉప్పు, నెయ్యి, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిగడ్డ వేసి బాగా కలపాలి. డీప్‌ ఫ్రై పాన్‌లో పోసి పిండిని ఒత్తుని మధ్యలో రంధ్రంల పెట్టి నూనెలో వేసి వేయించుకోవాలి. అది గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే మినపగారెలు రెడీ.

దసరా ఘుమఘుమలు

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

నాన్‌ స్టిక్‌ వాడుతున్నారా?

17-10-2020

దోశలు వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనం వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. ఇనుప దోసె పెనం వాడండి చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్‌స్టిక్‌ పెనంపై దోసెలు అంటుకోకుండా వస్తాయి.

manavi

వంటలు - చిట్కాలు

కాస్త వేడి వేడిగా...

15-10-2020

సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలి.

manavi

వంటలు - చిట్కాలు

రెగ్యులర్‌ కూరలతో బోర్‌ కొట్టిందా..?

08-10-2020

ఇంట్లో ప్రతి రోజూ ఏం కూర చేయాలి అనే సందేహం తప్పకుండా వస్తుంది. పెద్దలకు నచ్చింది పిల్లలకు నచ్చదు. పిల్లల కోసం పెద్దలు కొన్ని రుచులు వదులుకోవాల్సి వస్తుంది.

manavi

వంటలు - చిట్కాలు

ఇంట్లోనే హెల్తీ స్నాక్స్‌

01-10-2020

పిల్లలకు రోజుకొక రుచికావాలి. వాళ్ళు కడుపునిండా తింటేనే అమ్మకు సంతోషం. సాధారణంగా అన్నం కంటే చిరుతిళ్ళను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బయటి ఫుడ్‌ ఆరోగ్యానికి అంత

manavi

వంటలు - చిట్కాలు

ఓట్స్‌తో రుచికరంగా...

24-09-2020

ఓట్స్‌... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌కే మొదటి ఓటు వేస్తారు. మామూలుగా అయితే ఓట్స్‌తో చేసిన వంటకాలు అంత రుచిగా

manavi

వంటలు - చిట్కాలు

అన్నంతో వెరైటీగా...

17-09-2020

పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త రుచులు కావాలి. లేదంటే ఓ పట్టాన తినరు. చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా వుండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. అన్నం తింటానికి సాధారణంగా పిల్లలు మారాం చేస్తారు.