పులిహోర కలిపేయండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

పులిహోర కలిపేయండి

వాతావరణం చల్లబడింది. ఈ కాలంలో అన్నం త్వరగా పాడవదు. వండిన అన్నం మిగిలితే చల్లటి అన్నం తినడానికి మనసు అంగీకరించదు. ఎంత మంచి కూర చేసిన ముద్ద నోట్లోకి దిగదు. అలాంటి అప్పుడు చాలా మంది చేసే పని పోపు వేయడం. అందులో కాస్త పసుపు, నిమ్మరసం కలిపితే పులిహౌర అయిపోతుంది. పులిహౌరను ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఎంత ఇష్టమున్నా ఎప్పుడూ అదే నిమ్మరసం, అదే చింతపండు పులిహౌర ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే చింతపండుతో పాటు ఈ సారి కొన్ని వెరైటీ పులిహౌరలు మీకోసం.. ఓసారి ట్రై చేసి చూడండి.

పెసరిపొడి పులిహోర
తయారు చేసే విధానం : పెసరపప్పు, ఎండు మిర్చి మూకుడులో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి వేగిన కమ్మటి వాసన వచ్చేవరకు. అది చల్లారాక అందులో జీలకర్ర, ఉప్పు, ఇంగువ వేసి మెత్తగా కంది పొడిలా చేసుకోవాలి. రెండు కప్పుల అన్నంలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి, అందులో ఐదు స్పూన్ల పెసరిపొడి వేయాలి. ఇప్పుడు పులిహోర తాలింపు చేసుకోవాలి. మూకుడులో నూనె, ఇంగువ, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి లేదా ఊరమిరపకాయలు వేసి పోపు అయ్యాక ఆ పోపు అన్నంలో వేయాలి. ఆ తర్వాత అదే మూకుడులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసి అది చక్కగా వేగాక ఆ పెసరిపొడి అన్నంలో వేసి చక్కగా కలపాలి. రుచి రుచిగా వుండే పెసరిపొడి పులిహోర రెడీ.

ఆవపిండి పులిహోర
తయారు చేసే విధానం : రెండు కప్పుల అన్నంలో ఒకటిన్నర స్పూన్స్‌ ఆవపిండి, చిటికెడు మెంతిపొడి వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక స్పూన్‌ నూనె వేయాలి. ఇప్పుడు అచ్చం పులిహోర పోపులా ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి లేదా ఊరమిరపకాయలు వేసి మంచి ఇంగువతో పులిహోర పోపు చేసి ఆవపిండి కలిపిన అన్నంలో వేయాలి. మూకుడులో పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి, అప్పుడు సరిపడా ఉప్పు వేసి, పచ్చి మిర్చి నూనెలో వేగాక పులిహోరలో కలిపెయ్యాలి. అవపిండి పులిహోర రెడీ. పులుపు కోసం ఏదీ వేయకూడదు.

కొబ్బరి పులిహోర
తయారు చేసే విధానం : ముందుగా సగం చిప్ప ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు నాలుగు కప్పుల అన్నంలో ఈ తురిమిన ఎండు కొబ్బరి వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఒక స్పూన్‌ నూనె వేయాలి. ఇప్పుడు పులిహోర పోపు చేయాలి. ఒక బాండీలో నూనె వేసి అది కాగిన తర్వాత అందులో ఇంగువ, ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసి అవి వేగాక ఆ కొబ్బరి తురుము వేసిన అన్నంలో వేయాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్‌ నూనె వేసి నాలుగు సగంగా కట్‌ చేసిన పచ్చిమిర్చీలు కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి అవి దోరగా వేగాక ఆ కొబ్బరి తురుము వేసిన అన్నంలో వేసి అంతా సమంగా కలుపుకోవాలి. కొబ్బరి పులిహోర తయారయింది.

నువ్వులపొడి పులిహోర
తయారు చేసే విధానం : నువ్వులపొడి పులిహోర తయారు చేసే ముందు ఎనిమిది స్పూన్ల నువ్వులు వేయించి పొడిచేసి అందులో ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాలుగు కప్పుల అన్నంలో ఈ నువ్వుల పొడి వేసి అందులో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, స్పూన్‌ నూనె వేయాలి. పులిహోర పోపు కోసం బాండీలో నూనె వేసి, వేడయ్యాక అందులో ఇంగువ, ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి లేదా ఊర మిరపకాయలు వేసి ఆ పోపు వేగాక ఆ నువ్వుల పొడి అన్నంలో వేసి అదే బాండీలో నాలుగు సగం కట్‌ చేసుకున్న పచ్చిమిర్చీలు, కరివేపాకు కొంచెం ఉప్పు (నువ్వుల పొడిలో వేశాము కనుక చూసికుని వేయాలి) వేసి మిరపకాయలు దోరగా వేగాక ఆ నువ్వులపొడి వేసిన అన్నంలో వేసి అంతా సమంగా కలపాలి. అంతే ఎంతో రుచిగా వుండే నువ్వులపొడి పులిహోర తయారయినట్టే.

దానిమ్మరసంతో పులిహోర
తయారు చేసే విధానం : ఒక పుల్లటి దానిమ్మకాయ (ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి) గింజలు మిక్సీలో వేసి కొంచెం ఉప్పు వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకున్న దానిమ్మ గింజల నుండి రసం తీసుకోవాలి. ఇప్పుడు నాలుగు కప్పుల అన్నంలో కొంచెం ఉప్పు, పసుపు, ఒక స్పూన్‌ నూనె వేసి అందులో ఈ దానిమ్మరసం వేయాలి. ఇప్పుడు పులిహోర పోపు ఒక బాండీలో నూనె వేసుకుని అది వేడయ్యాక అందులో ఇంగువ, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, ఊరమిరపకాయలు లేదా ఎండుమిర్చీ వేసి పోపు వేగాక దానిమ్మరసం వేసిన అన్నంలో వేసి అదే బాండీలో ఒక స్పూన్‌ నూనె వేసి, 3 సగం కట్‌ చేసుకున్న పచ్చిమిర్చీ, కరివేపాకు, కొంచెం మెంతి పొడి, సరిపడా ఉప్పు వేసి అవి దోరగా వేగాక దానిమ్మరసం అన్నంలో వేసి కొంచెం కొత్తిమీర వేసి అంతా సమంగా కలుపుకోవాలి. దానిమ్మరసం పులిహోర తయారయినట్టే.

చింత పండుపులిహోర
తయారు చేసే విధానం : 50 గ్రాముల చింతపండు నారలు, గింజలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని చింతపండు మునిగే వరకు నీళ్ళు పోసి పదిహేను నిముషాలు నాన బెట్టి, ఆ తర్వాత చిక్కగా చింతపండు రసం తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో కొంచెం ఎక్కువగానే నూనె వేసి అది కాగిన తర్వాత అందులో ఇంగువ,ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సగం కట్‌ చేసిన నాలుగు పచ్చిమిర్చి, కొంచెం పసుపు కూడా వేసి పోపు వేగాక అందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసం వేసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. కాస్త ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు, కొంచెం మెంతిపొడి, చిన్న బెల్లం ముక్క వేసి చింతపండు పులుసు బాగా ఉడికి పైన నూనె తేలుతున్నప్పుడు స్టవ్‌ కట్టేసి ఆ చింతపండు పులుసుని పక్కన పెట్టుకోవాలి చింతపండు పులిహోర పులుసు రెడీ అయినట్టు. ఇప్పుడు ఆరు కప్పుల అన్నం తీసుకుని అందులో కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు, ఒక స్పూన్‌ నూనె వేయాలి. ఆ తరువాత అందులో ఉడికించుకున్న చింతపండు చిక్కటి పులిహోరా పులుసు మూడు స్పూన్లు వేయాలి. ఇప్పుడు స్టవ్‌ మీద మూకుడు పెట్టి అందులో పులిహోరా పోపు కోసం కాస్త ఎక్కువగానే నూనె వేసి అందులో ఇంగువ ఘుఘుమలాడేట్టు వేసి ఆవాలు, పల్లీలు (ఇష్టం ఉన్నవారు జీడిపప్పు వేసుకో వచ్చు), శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండు మిర్చి వేసి అవి వేగాక (ఊరమిరపకాయలు వేస్తే ఇంకా బావుం టుంది) చింతపండు పులుసు వేసిన అన్నంలో వేయాలి. మళ్ళీ అదే మూకుడులో కొంచెం నూనె వేసి సగం కట్‌ చేసుకున్న పచ్చి మిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుని అన్నీ దోరగా వేగాక అన్నంలో ఈ మిశ్రమాన్ని వేసి కలుపు కోవాలి. అంతే రుచిరుచిగా చింతపండు పులిహోర రెడీ.

- లేళ్ళపల్లి శ్రీదేవి రమేష్‌
చెన్నై

పులిహోర కలిపేయండి

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

దసరా ఘుమఘుమలు

22-10-2020

మనకి అన్నింటికంటే పెద్ద పండుగ దసరా. రకరకాల వంటకాలు చేసుకొని రుచి చూస్తాం. ప్రస్తుత వాతావరణం, కరోనా పరిస్థితుల్లో గతంలో వలె పండుగ చేసుకునే మూడ్‌

manavi

వంటలు - చిట్కాలు

నాన్‌ స్టిక్‌ వాడుతున్నారా?

17-10-2020

దోశలు వేయడానికి నాన్‌ స్టిక్‌ పెనం వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. ఇనుప దోసె పెనం వాడండి చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్‌స్టిక్‌ పెనంపై దోసెలు అంటుకోకుండా వస్తాయి.

manavi

వంటలు - చిట్కాలు

కాస్త వేడి వేడిగా...

15-10-2020

సాధారణంగా వర్షాకాలమో, శీతాకాలమో వచ్చిందంటే చాలు ఇంట్లో నుండి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టం ఉండదు చాలా మందికి. ఎముకలు కొరికే చల్లగాలి.

manavi

వంటలు - చిట్కాలు

రెగ్యులర్‌ కూరలతో బోర్‌ కొట్టిందా..?

08-10-2020

ఇంట్లో ప్రతి రోజూ ఏం కూర చేయాలి అనే సందేహం తప్పకుండా వస్తుంది. పెద్దలకు నచ్చింది పిల్లలకు నచ్చదు. పిల్లల కోసం పెద్దలు కొన్ని రుచులు వదులుకోవాల్సి వస్తుంది.

manavi

వంటలు - చిట్కాలు

ఇంట్లోనే హెల్తీ స్నాక్స్‌

01-10-2020

పిల్లలకు రోజుకొక రుచికావాలి. వాళ్ళు కడుపునిండా తింటేనే అమ్మకు సంతోషం. సాధారణంగా అన్నం కంటే చిరుతిళ్ళను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బయటి ఫుడ్‌ ఆరోగ్యానికి అంత

manavi

వంటలు - చిట్కాలు

ఓట్స్‌తో రుచికరంగా...

24-09-2020

ఓట్స్‌... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌కే మొదటి ఓటు వేస్తారు. మామూలుగా అయితే ఓట్స్‌తో చేసిన వంటకాలు అంత రుచిగా

manavi

వంటలు - చిట్కాలు

అన్నంతో వెరైటీగా...

17-09-2020

పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త రుచులు కావాలి. లేదంటే ఓ పట్టాన తినరు. చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా వుండాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. అన్నం తింటానికి సాధారణంగా పిల్లలు మారాం చేస్తారు.