బీన్స్‌ వండేసుకుందామా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

బీన్స్‌ వండేసుకుందామా...

బీన్స్‌... చిక్కుడు జాతికి చెందిన ఈ కూరగాయను మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పండిస్తున్నారు. లేత ఆకుపచ్చగా ఉండే ఈ కాయల్ని కొంతమంది ఉడికించి కూడా తింటారు. బీన్స్‌లో పోషకాలు ఎక్కువ. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్‌ శరీరంలో ఉండే విష వ్యర్థాలను తరిమేస్తాయి. గుండెను కాపాడతాయి. ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఇందులో వుండే విటమిన్‌ బి పుట్టుకతో వచ్చే లోపాల్ని సరిచేస్తుంది. అటువంటి బీన్స్‌తో చేసే కొన్ని సులభమైన వంటకాల్ని ఈరోజు నేర్చుకుందాం...

బట్టర్‌ గార్లిక్‌
కావల్సిన పదార్థాలు: బీన్స్‌ - 400 గ్రాములు, వెన్న - మూడు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - మూడు, లవంగాలు - మూడు, మిరియాల పొడి - పావు స్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం: బీన్స్‌ రెండు ముక్కలుగా చేసుకుని పెద్ద గిన్నెలో వేసి సగం వరకు నీరు పోసి మీడియం లేదా తక్కువ మంటపై బాగా మరిగించాలి. బీన్స్‌ మెత్తబడుతున్నప్పుడు సిమ్‌లో ఉంచి నీటిని వంపేయాలి. తర్వాత అందులో వెన్నను వెయ్యాలి. వెన్న కరిగేవరకు ఉడికించాలి. తర్వాత మూడు ముక్కలుగా చేసిన వెల్లుల్లి, లవంగాలను బీన్స్‌లో వేసి మెత్తగా, సువాసవ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత లెమన్‌ పెప్పర్‌, ఉప్పు వేసి సెర్వ్‌ చేసుకోవాలి.

పోరియాల్‌
కావల్సిన పదార్థాలు: బీన్స్‌ - 250 గ్రాములు, నూనె - టేబుల్‌ స్పూను, ఆవాలు - పావు స్పూను, శనగలు - ఒక స్పూను, ఎండు మిర్చి - ఒకటి, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు, ఉప్పు - రుచికి సరిపడా, సాంబర్‌ పౌడర్‌ - అర టీ స్పూను, తురిమిన కొబ్బరి - రెండు నుంచి మూడు టేబుల్‌ స్పూన్లు,
తయారీ విధానం: ముందుగా బీన్స్‌ను పావు అంగుళం ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత ఓ టేబుల్‌ స్పూన్‌ నూనెను పెనంలో వేసి వేడి చేయాలి. ఆవాలు, శనగలు, ఎండు మిర్చి వెయ్యాలి. ఇవన్నీ బంగారు రంగులో వచ్చే వరకు వేయించి చిటికెడు ఇంగువ, కరివేపాకు వెయ్యాలి. ఇందులో తరిగిన బీన్స్‌ ముక్కలను వేసి రుచికి సరిపడా పసుపు, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. అందులో రెండు నుంచి మూడు టేబుల్‌ స్పూన్ల నీటిని పోసి... చిన్న మంటపై మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత సాంబార్‌ పౌడర్‌, తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. తర్వాత ఓ నిమిషం పాటు ఉడికించి సర్వ్‌ చేసుకోవాలి.

మసాలా ఫ్రై
కావల్సిన పదార్థాలు: బీన్స్‌ - 250 గ్రాములు, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఇంగువ, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర స్పూను, కారం - స్పూను, కొత్తిమీర - స్పూను.
తయారీ విధానం: ముందుగా బీన్స్‌ను సన్నగా కట్‌ చేసుకోవాలి. పెనంలో నూనె పోసి వేడి చెయ్యాలి. అందులోనే ఇంగువ, జీలకర్ర, బీన్స్‌ ముక్కలు వేసి 15 నుంచి 20 సెకన్ల పాటు ఉడికించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసి 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కారం, కొత్తిమీర వెయ్యాలి. మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్‌ ఆపేసి అన్నంతో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.

పెసరపప్పుతో...
కావల్సిన పదార్థాలు: బీన్స్‌ - 250 గ్రాములు, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - అర టీస్పూను, ఆసాఫెటికా - పావు టీ స్పూను, పచ్చిమిర్చి - రెండు లేదా మూడు, పెసరపప్పు - 100 గ్రాములు, ఉప్పు, పసుపు - రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - 4 లేదా 5, లవంగాలు - రెండు, కొత్తిమీర పొడి - అర టీ స్పూను, జీలకర్ర - పావు స్పూను, కొత్తిమీర ఆకులు - రెండు టేబుల్స్‌ స్పూన్లు.
తయారీ విధానం: గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఆసాఫెటిడా, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పును అందులో వేయాలి. ఇందులో తరిగిన బీన్స్‌ కూడా వేసి కలపాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి పెసరపప్పు, బీన్స్‌ బాగా కలిసేంత వరకు ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, కొత్తిమీర పొడి, జీలకర్ర, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరిగా రెండు టేబుల్‌ స్పూన్ల కొత్తిమీర ఆకులను మిశ్రమంపై వేసి అలంకరించి వడ్డించాలి.

ఆలూ బీన్స్‌
కావల్సిన పదార్థాలు: బీన్స్‌ - 250 గ్రాములు, ఆవ నూనె - టేబుల్‌ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఆలూ - రెండు (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర పొడి - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, కారం - అర టీ స్పూను, ఆసాఫాటిడా - అరపావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం: ఆవ నూనెను గిన్నెలో వేసి జీలకర్రను కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత ఆలూ ముక్కలు కూడా వేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. బీన్స్‌ ముక్కలు, కొత్తిమీర పొడి, కారం, ఆసాఫాటీడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి పావు కప్పు నీరు పోసి మూత పెట్టాలి. ఆలూ, బీన్స్‌ ఉడికేంత వరకు వేడిచేయాలి. 

బీన్స్‌ వండేసుకుందామా...

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా

25-02-2021

కాప్సికం అంటే చాలూ చిన్నా పెద్దా అందరికీ బోరు కొడుతుంది. అస్సలు సహించదు. దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కూరగాయలన్నీ కచ్చితంగా తినాల్సిందే. ప్రతిదాంట్లో

manavi

వంటలు - చిట్కాలు

రాగులతో రుచికరంగా...

18-02-2021

రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని ఆహారంగా తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ఎముకలు ఆరోగ్యంగా

manavi

వంటలు - చిట్కాలు

కమ్మని అల్పాహారం!

11-02-2021

తెల్లవారుతుందంటే చాలు ఈ రోజు ఏం వండాలి అనే ఆలోచన మొదలవుతుంది. పిల్లలకు రోజుకొక కొత్త రుచి కావాలి. పిల్లలకే కాదు అప్పుడప్పుడూ పెద్దలకు కూడా ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది. సాధారణంగా ఉదయం

manavi

వంటలు - చిట్కాలు

అదిరే ఆమ్లెట్స్‌

04-02-2021

కరోనా వైరస్‌ వచ్చినప్పటి నుండి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఉదయం తీసుకునే బ్రేక్‌ ఫాస్ట్‌ మొదలుకుని తినే ఆహారంలో కొంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం చికెన్‌, మటన్‌, కోడిగుడ్లను

manavi

వంటలు - చిట్కాలు

పనీర్‌ తో పసందుగా...

28-01-2021

కమ్మటి పాలతో తయారు చేసే పనీర్‌ ముక్కలను చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక దాంతో చేసిన వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి టేస్ట్‌ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. చాలా మందికి వీటితో వంటలు ఎలా చేయాలో తెలియక పెద్దగా ఉపయోగించరు.

manavi

వంటలు - చిట్కాలు

సంక్రాంతి రుచులు...

07-01-2021

సంక్రాంతి అంటేనే తెలుగు వారికి పెద్ద పండుగ. మన రాష్ట్రంలో బతుకమ్మ తర్వాత గొప్పగా చేసుకునే పండుగ ఏదైనా ఉందీ అంటే అది ఇదే. పండిన ధాన్యం చేతికి వచ్చే సమయం. అందరి గాదెలు కొత్త ధాన్యంతో నిండి కళకళలాడుతుంటాయి.

manavi

వంటలు - చిట్కాలు

ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

18-12-2020

వంటలకు అదనపు టేస్ట్‌ ఇవ్వాలంటే... వాటిలో పనీర్‌ చేర్చాలి. అయితే బయటి షాపుల్లో లభించే పనీర్‌ తాజాది కాకపోవచ్చు. అది వంటలకు అంత

manavi

వంటలు - చిట్కాలు

కలర్‌ఫుల్‌ రైస్‌ వెరైటీస్‌

17-12-2020

చిరుతిండ్లు ఎన్ని తిన్నా రెండు ముద్దలైనా అన్నం తినందే కడుపు నిండినట్టుగా వుండదు. రోజూ తెల్లటి అన్నంలో కూరలు కలుపుకుని ఏం తింటాం చెప్పండి..?