రాగులతో రుచికరంగా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

రాగులతో రుచికరంగా...

రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని ఆహారంగా తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఇక వీటిలోని పీచు పదార్థం వల్ల కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువగా తినకుండా చేస్తాయి. దాంతో బరువు నియంత్రణకు కూడా తోడ్పడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగులతో కొన్ని వెరైటీ వంటకాలు మీకోసం...

రాగి సేమ్యా ఖీర్‌

కావలసిన పదార్ధాలు: రాగి సేమ్యా - అర కప్పు, యాలకుల పొడి - చిటికెడు, కొబ్బరి తురుము - పావు కప్పు, కొబ్బరిపాలు - రెండు కప్పులు, నెయ్యి - తగినంత, బెల్లం పొడి - అర కప్పు, జీడి పప్పు పలుకులు - 20.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి. తర్వాత జీడిపప్పులు వేసి గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. రాగి సేమ్యాను కూడా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మరుగుతున్న పాలలో సేమ్యా వేసి కలపాలి. సేమ్యా ఉడికిన తరవాత బెల్లం పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించాలి. బాగా ఉడుకుతుండగా యాలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి.

రాగి లడ్డు

కావల్సిన పదార్థాలు: రాగిపిండి - కప్పు, బెల్లం తరుగు - పావు కప్పు, వేయించిన పల్లీలు - పావు కప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ఉప్పు - చిటికెడు, నెయ్యి - పావుకప్పు.
తయారుచేసే విధానం: ముందుగా ఓ గిన్నెలో రాగిపిండీ, ఉప్పు తీసుకుని నీళ్లు చల్లుకుంటూ తడిపొడిగా కలపాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి కలపాలి. ఇప్పుడు ఈ పిండిని ఆవిరి మీద పది, పదిహేను నిమిషాలు ఉడికించుకుని ఓ పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అందులో సన్నగా చేసిన పల్లీల పలుకులూ బెల్లం తరుగూ వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది.

రాగి కేక్‌
కావలసిన పదార్ధాలు: రాగి పిండి - ముప్పావు కప్పు, గోధుమ పిండి - ముప్పావు కప్పు, కొబ్బరి పాలు - ముప్పావు కప్పు, ఉప్పు - చిటికెడు, బేకింగ్‌ పౌడర్‌ - టీ స్పూను, బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, బెల్లం పొడి - కప్పు, పంచదార - రెండు టేబుల్‌ స్పూన్లు, కోకో పొడి - మూడు టేబుల్‌ స్పూన్లు, బటర్‌ - 150 మి.లీ. (కరిగించినది), వెనిలా ఎసెన్స్‌ - టేబుల్‌ స్పూను, కొబ్బరి పాలు - కప్పు, పెరుగు - పావు కప్పుటాపింగ్‌ కోసం.
తయారుచేసే విధానం: ముందుగా కేక్‌ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. ఓవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్‌ చేయాలి. ఒక బౌల్‌లో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి ఇందులో కలపాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు కూడా కలపాలి. తర్వాత కరిగించిన బటర్‌, పెరుగు జత చేయాలి. ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, ఓవెన్‌ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి. ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్‌ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్‌ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేయాలి. అంతే... టేస్టీ టేస్టీ రాగి కేక్‌ రెడీ.

రాగి వడ
కావలసిన పదార్ధాలు: రాగి పిండి - కప్పు, పల్లీలు - అర కప్పు, పుట్నాల పప్పు - అర కప్పు, ఉల్లిగడ్డ (మీడియం సైజు) - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - మూడు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - డీప్‌ ఫ్రై చేయడానికి కావాల్సినంత.
తయారుచేసే విధానం: పుట్నాల పప్పు, పల్లీలు మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా పొడి చేసుకోవాలి. ఒక బౌల్‌లో రాగి పిండి, పైన చేసిన పప్పుల పొడి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి వడ చేయటానికి సరిపడేలా కలుపుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి వేడిచేసుకోవాలి. వడ పిండిని ఉండలా చేసుకొని అరచేతి మీద ఫ్లాట్‌గా వత్తుకొని కాగిన నూనెలో వేయాలి. వడలను మీడియం సెగ మీద గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వేడి వేడి రాగి వడలను చట్నీతో సర్వ్‌ చేయండి. 

రాగులతో రుచికరంగా...

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

మోరంగడ్డ(చిలగడదుంప)తో నోరూరించేలా...

25-03-2021

ఈ కాలంలో విరివిగా దొరికే మోరంగడ్డలు ఎక్కువగా ఉడికించుకుని తినడం మనలో చాలా మందికి అలవాటు. కానీ పోషకాలనందించే ఈ దుంపలతోనూ

manavi

వంటలు - చిట్కాలు

సాయంత్రం స్నాక్స్‌ కోసం

18-03-2021

కాలం ఏదైనా సాయంత్రం పూట ఏమైనా కడుపులో పడితేనే ప్రశాంతంగా ఉంటుంది. గతంలో మాదిరిగా ఏది పడితే అది తినే పరిస్థితి ప్రస్తుతం లేదు.

manavi

వంటలు - చిట్కాలు

చల్లని మిల్క్‌ షేక్స్‌

11-03-2021

ఎండల్లో చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే

manavi

వంటలు - చిట్కాలు

క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా

25-02-2021

కాప్సికం అంటే చాలూ చిన్నా పెద్దా అందరికీ బోరు కొడుతుంది. అస్సలు సహించదు. దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కూరగాయలన్నీ కచ్చితంగా తినాల్సిందే. ప్రతిదాంట్లో

manavi

వంటలు - చిట్కాలు

కమ్మని అల్పాహారం!

11-02-2021

తెల్లవారుతుందంటే చాలు ఈ రోజు ఏం వండాలి అనే ఆలోచన మొదలవుతుంది. పిల్లలకు రోజుకొక కొత్త రుచి కావాలి. పిల్లలకే కాదు అప్పుడప్పుడూ పెద్దలకు కూడా ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది. సాధారణంగా ఉదయం

manavi

వంటలు - చిట్కాలు

అదిరే ఆమ్లెట్స్‌

04-02-2021

కరోనా వైరస్‌ వచ్చినప్పటి నుండి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఉదయం తీసుకునే బ్రేక్‌ ఫాస్ట్‌ మొదలుకుని తినే ఆహారంలో కొంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం చికెన్‌, మటన్‌, కోడిగుడ్లను

manavi

వంటలు - చిట్కాలు

పనీర్‌ తో పసందుగా...

28-01-2021

కమ్మటి పాలతో తయారు చేసే పనీర్‌ ముక్కలను చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక దాంతో చేసిన వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి టేస్ట్‌ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. చాలా మందికి వీటితో వంటలు ఎలా చేయాలో తెలియక పెద్దగా ఉపయోగించరు.