వంట త్వరగా పూర్తవ్వాలంటే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

వంట త్వరగా పూర్తవ్వాలంటే...

వంట వండేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి మనకు. వాటిని చిటికెలో తీర్చే కొన్ని టిప్స్‌ కూడా ఉన్నాయి. అవి....
- వెల్లుల్లిపైనున్న పొట్టును సులభంగా తీయాలంటే వీటిని మైక్రోవేవ్‌లో పెట్టి కొద్దిసేపు వేడిచేయాలి. నీళ్లల్లో పదినిమిషాలు నానబెట్టినా కూడా వాటిపైనున్న పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
- పిండిలో నీరెక్కువయి పలుచగా అయితే అందులో టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేస్తే పిండి దగ్గరపడి నూనెలో బాగా వేగుతుంది.
- వండేటప్పుడు ఆకుకూరల పచ్చదనం పోకుండా ఉండాలంటే అందులో కొద్దిగా చక్కెర కలపాలి. కూరగాయలను కడిగిన తర్వాత చల్లటి నీటిలో పెడితే కూడా పచ్చదనం పోదు.
- అన్నం మెతుకులు ఒకదానితో ఒకటి అతుక్కుపోకుండా పొడి పొడిగా ఉండాలంటే అన్నం వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం అందులో వేయాలి.
- పప్పులో చిటికెడు పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది.
- అరటిపళ్లను న్యూస్‌పేపర్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ కాలం ఉంటాయి.
- ఇన్‌స్టాంట్‌ టొమాటో ప్యూరీ చేయాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసి టొమాటోలను ప్రెషర్‌కుక్కర్‌లో పెట్టాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేయాలి. తర్వాత ఆ రసాన్ని ఐస్‌ట్రేలో పోసి డీప్‌ ఫ్రిజర్‌లో పెట్టాలి. ఈ జ్యూస్‌ క్యూబ్స్‌ను బాక్స్‌లోగాని, ప్లాస్టిక్‌ బ్యాగులో గాని వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. టొమాటో సూప్‌, గ్రేవీల్లోను, కూరల్లోను ఈ క్యూబ్స్‌ను వాడొచ్చు.
- పాలను గిన్నెలో పోసి కాగబెట్టే ముందు గిన్నె పైఅంచులకు, లోపలి భాగంలోని అంచులకూ కొద్దిగా వెన్న రాస్తే పాలు పొంగవు.
- కూరలో లేదా పప్పులో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా టొమాటో ముక్కలు లేదా బంగాళాదుంప ముక్కలు వేస్తే ఉప్పదనం తగ్గుతుంది. ఒక చెంచా చక్కెరను కలిపితే కూడా ఉప్పదనం ఉండదు.
- రన్నింగ్‌ వాటర్‌ కింద ఉల్లిపాయలను పెట్టి కట్‌ చేస్తే కళ్లల్లో నీళ్లు రావు. గ్యాస్‌ ఫ్లేమ్‌కు దగ్గరగా ఉండి వీటిని కోసినా కూడా కళ్లల్లో నీళ్లు రావు. ఇవే కాకుండా ఉల్లిపాయలను తరగడానికి ముందర కాసేపు రిఫ్రిజిరేటర్‌లో పెడితే కళ్లల్లో నీళ్లు రావు.
- పన్నీరు వాటర్‌లో ప్రొటీన్లు, కాల్షియం బాగా ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఇది చపాతీ పిండిని మెత్తగా చేస్తుంది. పన్నీరు వాటర్‌ కలిపిన చపాతీలు ఎంతో మదువుగా ఉంటాయి. పన్నీర్‌ వాటర్‌తో సూప్‌ కూడా చేసుకోవచ్చు.
- నిమ్మకాయలు బయటపెడితే వారానికే వడలిపోతాయి. అలాకాకుండా వాటిపై కొబ్బరి నూనె రాసి మూతలేని గిన్నెలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయి. 

వంట త్వరగా పూర్తవ్వాలంటే...

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

ఇట్లా చేద్దాం

05-12-2019

కండ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడేవారికి పైనాపిల్‌ మంచి ఉపశమనం. ఒక టేబుల్‌ స్పూన్‌ పైనాపిల్‌ జ్యూస్‌లో రెండు టీ స్పూన్ల పసుపును వేసి బాగా కలపాలి. రోజూ ఉదయం లేచిన వెంటనే

manavi

వంటలు - చిట్కాలు

పోషకాల చిరుతిండి

05-12-2019

సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే పిల్లలు చిరుతిండి తీసుకునేందుకు ఇష్టపడతారు. అదీ ఇంట్లో అప్పటికప్ప్పుడు చేసిన తాజా చిరుతిండిని వారు మరింత ఇష్టంగా తింటారు. అయితే అవి రుచితో పాటు, పోషకాలతో కూడి ఉంటే ఉపయోగం.

manavi

వంటలు - చిట్కాలు

పిల్లలు మెచ్చే మఫిన్స్‌

02-12-2019

మనం కప్పు కేకులుగా చెప్పేవే.. మఫిన్స్‌. ఎంతో మదువుగా, మంచి సువాసనతో, మేలైన రుచితో అలరించే మఫిన్స్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.

manavi

వంటలు - చిట్కాలు

చలికాలం వేడివేడిగా...

28-11-2019

వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఏవైనా తినాలనిపిస్తుంటుంది.. అప్పుడు మనం ఇంట్లో కామన్‌గా చేసుకునే పకోడీ, రోడ్డు పక్కన దొరికే చాట్‌... ఓవైపు గుర్తొస్తాయి. కానీ

manavi

వంటలు - చిట్కాలు

సహజమైన స్క్రబ్‌

26-11-2019

మెంతులు అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్‌ యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. వీటిల్లో ఉండే నియాసిన్‌ దెబ్బతిన్న చర్మ కణాలకు

manavi

వంటలు - చిట్కాలు

బోలెడు ప్రయోజనాల నిమ్మ

26-11-2019

నిమ్మ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం తెలిసిందే.

manavi

వంటలు - చిట్కాలు

హ్యాండ్‌ బ్యాగ్‌ మన్నికగా...

25-11-2019

ట్రెండీగా కనిపించాలన్నా లేక సౌకర్యంగా ఉండాలన్నా వెంట హ్యాండ్‌బ్యాగ్‌ తప్పనిసరి. రోజూ వాడినా, వేడుకలకు తగ్గట్టు ఉపయోగించాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పుడే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.

manavi

వంటలు - చిట్కాలు

వీటికి దూరంగా...

24-11-2019

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్‌ బౌల్‌, మన ఇంటి ఫ్లోర్‌ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం

manavi

వంటలు - చిట్కాలు

బ్రెడ్‌ వెజ్‌ బర్గర్‌

24-11-2019

అల్పాహారంగా తీసుకోదగిన వంటకాల్లో బ్రెడ్‌ వెజ్‌ బర్గర్‌ ఒకటి. ఇది మంచి పోషకాహారమే గాక కమ్మని రుచిగానూ ఉంటుంది. తిండి విషయంలో పేచీ పెట్టే పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని బయట బేకరీలలో తినడం కంటే ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. మరి ఎలాచేయాలో

manavi

వంటలు - చిట్కాలు

చలికాలంలో...

24-11-2019

చలి కాలంలో వాతావరణం హాయిగానే ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువే. ఈ సమయంలో వచ్చే సూక్ష్మజీవుల ప్రభావం నుంచి బయటపడేందుకు రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. అందుకోసం వెల్లుల్లి, ఉల్లిని ఆహారంలో పెంచాలి. గొంతు సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇందుకు పరిష్కారం తేనే,