ఈ ఆహారంతో మలబద్ధకం దూరం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

ఈ ఆహారంతో మలబద్ధకం దూరం

సాధారణ అనారోగ్య సమస్యల్లో మలబద్ధకం ప్రధానమైనది. నిజానికి ఇది చిన్న సమస్యే అయినా రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. జీవన శైలి మార్పులు, వేళ పట్టున తినకపోవడం, ఐరన్‌ టాబ్లెట్స్‌ అతిగా వాడటం, వేళకు మల విసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం, తక్కువ నీరు తాగటం, తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. హైబీపీ, మొలలు, ఫిషర్స్‌, తలనొప్పి మొదలు పలు జీర్ణాశయ సంబంధిత సమస్యలకు మలబద్ధకమే మూల కారణం. కొన్ని జీవన శైలి మార్పులతో బాటు ముఖ్యంగా పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ద్వారాఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.
పీచు ఎక్కువగా ఉండేజామపండును విత్తనాలతో సహా బాగా నమిలి తింటే మలబద్ధక సమస్య నివారించబడుతుంది.
రోజూ ఒక ఆపిల్‌ పండును చెక్కుతీయకుండా నేరుగా తినటం వల్ల పేగుల పనితీరు మెరుగుపడి సమస్య దూరం అవుతుంది.
రోజుకి కనీసం ఒక గ్లాసు క్యారెట్‌ రసం తాగితే మలబద్దకం దరిజేరదు.
రోజుకు కనీసం ఒకటి లేదా రెండు కప్పులు అల్లం టీ తాగితే సమస్య నియంత్రణలోకి వస్తుంది.
రాత్రి 10 ద్రాక్షపండ్లను నీటిలో నానబెట్టి మరునాటి ఉదయం పండ్లను తిని, ఆ నీరు తాగటమూ సమస్యకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
పీచు అధికంగా ఉండే బ్రెడ్‌, చిరు ధాన్యాలు, మొలకెత్తిన గింజలుతినటం వల్ల ఎంతటి మలబద్దకమైనా తగ్గుతుంది.
కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు రోజూ తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉదయం లేవగానే ఒక లీటరు గోరువెచ్చని నీరు తాగాలి. అలాగే రోజుమొత్తంలో కనీసం 10- 15 గ్లాసుల నీరు తాగటం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవటమే గాకపేగుల్లో మలం సాఫీగా ముందుకు సాగుతుంది.
ఆహారంలో క్యాబేజీ, బొప్పాయి, చిలగడదుంప, కొబ్బరి వంటివాటికి స్థానం కల్పించటం వల్ల మలవిసర్జన సాఫీగా సాగుతుంది.
రోజూ ఒక గ్లాసు పచ్చి పాలకూర రసం లేదానారింజ, బత్తాయి వంటి రసాలు తీసుకుంటే మలబద్దకం దూరమయ్యేందుకు దోహదపడతాయి.
పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, మైదాకు బదులు ముడి బియ్యం, గోధుమలు, జొన్నపిండి వంటివి వాడితే మలబద్దకం రాదు.
రోజువారీ ఆహారంలోఆకుకూరలు, పచ్చి కూరగాయలు, తేనె, పండ్లు, ఎండుఫలాలతో పాటు వెన్న, నెయ్యి వంటి పాలపదార్థాలు ఉండేలా చూసుకోవాలినిలువ పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ పూర్తిగా మానివేయాలి.మద్యపానం అసలే పనికిరాదు.వేళకు తినాలి.టీ, కాఫీలు మానివేయాలి

ఈ ఆహారంతో మలబద్ధకం దూరం

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

ఇచట చట్నీలు అమ్మబడును..!

13-01-2020

భారతీయులు ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చే చట్నీలు మార్కెట్లో కల్తీ అవుతు న్నాయి. పోనీ ఇంట్లో చేసుకుందాం అంటే అంత ఓపిక, సమయం ఉండదు. అందుకే ఆమె మార్కెటింగ్‌ ఉద్యోగం వదలి సేంద్రియ పద్ధతిలో చట్నీలు

manavi

వంటలు - చిట్కాలు

ఇట్లా చేద్దాం

10-01-2020

అల్లం చాయ్ అంటే అందరు ఇష్టపడతారు, మరి అల్లం రోజు దంచి వేయకుండా ఈ చిన్న టిప్‌ పాటిస్తే చాలు.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చేసేటపుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి పొట్టు తీస్తాం కదా దాన్ని పడేయకుండా కాసేపు

manavi

వంటలు - చిట్కాలు

కండరాల పుష్టికి పెరుగు

09-01-2020

చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు భోజనం చివర్లో పెరుగుతో తిననిదే అస్సలు తప్తి చెందరు. భోజనం అయిపోనట్టుగానే భావిస్తారు. కానీ కొంతమందికి పెరుగు కాదు

manavi

వంటలు - చిట్కాలు

ఆహార పదార్థాలు వృథాకాకుండా...

03-01-2020

వంటిట్లో పదార్థాలు చాలావరకూ వథా అవుతుంటాయి. అందువలన డబ్బులు అనవసరంగా ఖర్చైనట్టే కదా. మరి పదార్థాలను వథాకానివ్వకుండా అరికట్టడం ఎలాగంటే...

manavi

వంటలు - చిట్కాలు

మేలైన అల్పాహారం

02-01-2020

దక్షిణాది అల్పాహారాల్లో ఇడ్లీదే మొదటి స్థానం. నూనె అవసరం లేని, తేలికగా జీర్ణమయ్యే మేలైన పోషకాలుగల అల్పాహారం ఇడ్లీ. ప్రపంచంలోని మొదటి పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఇడ్లీ ఒకటి . పసిపిల్లల నుంచి వద్ధుల వరకు ఎవరైనా తీసుకోదగిన ఈ

manavi

వంటలు - చిట్కాలు

నచ్చింది తింటూనే నాజూగ్గా...

02-01-2020

పాత రోజుల్లో సన్నగా ఉన్నవారిని బాగా తినాలని పెద్దలు చెబుతుండేవారు. అదే ఇప్పుడైతే కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు పెద్దలే డైటింగ్‌ చేయమని చెబుతున్నారు. చదువుకునే వారు, నిపుణుల మొదలు సామాన్యుల వరకు వీలున్నత మేర సన్నగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. అలాగే సన్నబడే

manavi

వంటలు - చిట్కాలు

టేస్టీగా.. ఈజీగా

29-12-2019

సాధారణంగా కూర ఎలా ఉన్నా ఫర్వాలేదు.. కానీ ఉప్పో, కారమో ఎక్కువో తక్కువో అయితే మాత్రం తినలేం. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కూరలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా చపాతీ తయారుచేయడానికి సిద్ధం

manavi

వంటలు - చిట్కాలు

రక్తహీనతను తగ్గించే బెల్లం

27-12-2019

పండుగల వేళ పిండివంటల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడటం తెలిసిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బెల్లం, వేయించిన వేరుశనగపప్పులను మేలైన చిరుతిండిగా పరిగణిస్తారు. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.

manavi

వంటలు - చిట్కాలు

స్వచ్ఛతను తెలుసుకునేదెలా?

27-12-2019

పల్లెలు, తండాలు, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతి చోట తేనే లభిస్తుంది. తేనె ఇప్పుడు మార్కెట్‌లో సులువుగా దొరికే వస్తువుగా మారిపోయింది. అందులో కూడా చాలా బ్రాండ్లు ఇప్పుడు

manavi

వంటలు - చిట్కాలు

పోషకాల బఠాణీ

26-12-2019

పోషకాల రారాణి బఠాణీ. చలికాలంలో ఎక్కువగా లభించే వీటిల్లో ఆరోగ్య కారకాలు బోలెడుంటాయి. అంతేకాకుండా ఈ కాలంలో ఇవి తినడం చాలామంచిది. అందుకే, వింటర్‌ డైట్‌కు చాలా పర్‌ఫెక్ట్‌ వెజిటబుల్‌