రోజుకి ఐదు తింటే ఆరోగ్యమే.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

రోజుకి ఐదు తింటే ఆరోగ్యమే..

ప్రతిరోజు ఐదు ద్రాక్షలు తించే ఆరోగ్యానికి ఏ ఢోకా లేదంటున్నారు వైద్య నిపుణులు. తక్షణ శక్తిని ఇవ్వడంలో ఎండుద్రాక్ష ముందుంటుంది. ఎండు ద్రాక్షలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపు మెరుగుపడటానికి సాయపడతాయి.
పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీని వల్ల పిల్లలు పక్క తడపకుండా ఉంటారు.
ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని కలుగజేస్తాయి. రాత్రి పూట ఎండుద్రాక్షను నానబెట్టి ఉదయాన్నే తినాలి.
ఇంకా దీనిలో ఉండే ఫైబర్‌ వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలను పోగొడుతుంది. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, పది ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీనిలోని పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
ఎండు ద్రాక్షలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. నాలుగైదు గంటల తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అనీమియా నుంచి బయటపడొచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కాన్సర్‌ కారకకణాలను నాశనం చేస్తాయి.
ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను బలంగా చేస్తాయి. దీనిలోని కాల్షియం వల్ల కీళ్లనొప్పులను అరికడుతుంది.
ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన మలినాలు బయటకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది. ు

రోజుకి ఐదు తింటే ఆరోగ్యమే..

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

ఇచట చట్నీలు అమ్మబడును..!

13-01-2020

భారతీయులు ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చే చట్నీలు మార్కెట్లో కల్తీ అవుతు న్నాయి. పోనీ ఇంట్లో చేసుకుందాం అంటే అంత ఓపిక, సమయం ఉండదు. అందుకే ఆమె మార్కెటింగ్‌ ఉద్యోగం వదలి సేంద్రియ పద్ధతిలో చట్నీలు

manavi

వంటలు - చిట్కాలు

ఇట్లా చేద్దాం

10-01-2020

అల్లం చాయ్ అంటే అందరు ఇష్టపడతారు, మరి అల్లం రోజు దంచి వేయకుండా ఈ చిన్న టిప్‌ పాటిస్తే చాలు.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ చేసేటపుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి పొట్టు తీస్తాం కదా దాన్ని పడేయకుండా కాసేపు

manavi

వంటలు - చిట్కాలు

కండరాల పుష్టికి పెరుగు

09-01-2020

చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు భోజనం చివర్లో పెరుగుతో తిననిదే అస్సలు తప్తి చెందరు. భోజనం అయిపోనట్టుగానే భావిస్తారు. కానీ కొంతమందికి పెరుగు కాదు

manavi

వంటలు - చిట్కాలు

ఆహార పదార్థాలు వృథాకాకుండా...

03-01-2020

వంటిట్లో పదార్థాలు చాలావరకూ వథా అవుతుంటాయి. అందువలన డబ్బులు అనవసరంగా ఖర్చైనట్టే కదా. మరి పదార్థాలను వథాకానివ్వకుండా అరికట్టడం ఎలాగంటే...

manavi

వంటలు - చిట్కాలు

మేలైన అల్పాహారం

02-01-2020

దక్షిణాది అల్పాహారాల్లో ఇడ్లీదే మొదటి స్థానం. నూనె అవసరం లేని, తేలికగా జీర్ణమయ్యే మేలైన పోషకాలుగల అల్పాహారం ఇడ్లీ. ప్రపంచంలోని మొదటి పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఇడ్లీ ఒకటి . పసిపిల్లల నుంచి వద్ధుల వరకు ఎవరైనా తీసుకోదగిన ఈ

manavi

వంటలు - చిట్కాలు

నచ్చింది తింటూనే నాజూగ్గా...

02-01-2020

పాత రోజుల్లో సన్నగా ఉన్నవారిని బాగా తినాలని పెద్దలు చెబుతుండేవారు. అదే ఇప్పుడైతే కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు పెద్దలే డైటింగ్‌ చేయమని చెబుతున్నారు. చదువుకునే వారు, నిపుణుల మొదలు సామాన్యుల వరకు వీలున్నత మేర సన్నగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. అలాగే సన్నబడే

manavi

వంటలు - చిట్కాలు

టేస్టీగా.. ఈజీగా

29-12-2019

సాధారణంగా కూర ఎలా ఉన్నా ఫర్వాలేదు.. కానీ ఉప్పో, కారమో ఎక్కువో తక్కువో అయితే మాత్రం తినలేం. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కూరలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా చపాతీ తయారుచేయడానికి సిద్ధం

manavi

వంటలు - చిట్కాలు

రక్తహీనతను తగ్గించే బెల్లం

27-12-2019

పండుగల వేళ పిండివంటల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడటం తెలిసిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బెల్లం, వేయించిన వేరుశనగపప్పులను మేలైన చిరుతిండిగా పరిగణిస్తారు. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.

manavi

వంటలు - చిట్కాలు

స్వచ్ఛతను తెలుసుకునేదెలా?

27-12-2019

పల్లెలు, తండాలు, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతి చోట తేనే లభిస్తుంది. తేనె ఇప్పుడు మార్కెట్‌లో సులువుగా దొరికే వస్తువుగా మారిపోయింది. అందులో కూడా చాలా బ్రాండ్లు ఇప్పుడు

manavi

వంటలు - చిట్కాలు

పోషకాల బఠాణీ

26-12-2019

పోషకాల రారాణి బఠాణీ. చలికాలంలో ఎక్కువగా లభించే వీటిల్లో ఆరోగ్య కారకాలు బోలెడుంటాయి. అంతేకాకుండా ఈ కాలంలో ఇవి తినడం చాలామంచిది. అందుకే, వింటర్‌ డైట్‌కు చాలా పర్‌ఫెక్ట్‌ వెజిటబుల్‌