వావ్‌ సాస్‌! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

వావ్‌ సాస్‌!

టిఫిన్లు, ఇడ్లి, అట్టు వంటి వాటికి అల్లం చట్నీ, లేదా కొబ్బరి చట్నీ వంటివి సాధారణంగా అందరికి తెలిసినవే. కానీ ఫాస్ట్‌ ఫుడ్స్‌ అయిన పిజ్జాలు, బ్రెడ్‌ బర్గర్ల వంటి వాటికి టమాటా కెచప్‌, లేదా తియ్యటి చిల్లీ సాస్‌ వంటివి వాడుతారు. అయితే ఇవి కొనాలంటే బోలెడు డబ్బు ఖర్చుచేయాలి. అందుకే వీటిని మనం ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనివల్ల డబ్బు ఆదాతో పాటు.. శుభ్రంగా తయారుచేసుకున్నామన్న తృప్తీ మిగులుతుంది.
టమాట సాస్‌
కావాల్సిన పదార్థాలు : టమాటాలు- 10, బటర్‌- రెండు చెంచాలు, ఆలివ్‌నూనె- రెండు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి, క్యాప్సికమ్‌- ఒకటి, క్యారెట్‌- ఒకటి, వెల్లుల్లి రేకులు- నాలుగు, బిర్యాని ఆకు- ఒకటి, కష్ణతులసి ఆకులు- పావుకప్పు, ఉప్పు- తగినంత, సెలరీకాడలు- రెండు(సూపర్‌ మార్కెట్లో దొరుకుతాయి)
తయారీ విధానం
మరుగుతున్న నీటిలో టమాటాలని వేసి ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత చల్లని నీటిలో వేసుకోవాలి. ఇలా చేస్తే టమాటాలపైన ఉండే స్కిన్‌ సులభంగా ఊడి వచ్చేస్తుంది. మధ్యలో గింజలు తీసేసి సన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి మెత్తని ప్యూరీల చేేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్‌, బటర్‌ వేసుకుని కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయముక్కలు, క్యారెట్‌, క్యాప్సికమ్‌, వెల్లుల్లిరేకులు, తులసి ఆకులు చాలా సన్నగా తరిగి వేయాలి. ఎంత సన్నగా అంటే పాన్‌లో మగ్గుతున్నప్పుడు వాటి ఆకతి తెలియకూడనంత సన్నగా తరిగి వేయాలి. మగ్గుతున్నప్పుడు ఉప్పు, సెలరీ కాడలు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కనీసం గంటపాటు సన్నమంట మీద సాస్‌ని మగ్గనివ్వాలి. చివరిగా బిర్యానీ ఆకు, సెలరీ కాడలు తీసి పారేయాలి. చల్లార్చుకున్న సాస్‌ని డబ్బాల్లో నిల్వ చేసుకోవడమే. దించే ముందు కావాలనుకుంటే ఇటాలియన్‌ స్పైస్‌ పౌడర్స్‌ అని దొరుకుతాయి. అవి కూడా వేసుకోవచ్చు.
మిర్చితో..
కావాల్సిన పదార్థాలు : పచ్చిమిర్చి- 25 నుంచి 30, ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లి- ఆరు నుంచి ఎనిమిది, పంచదార- చెంచా, ఉప్పు- తగినంత, వెనిగర్‌- నాలుగు చెంచాలు, నీళ్లు- ఒకటిన్నర కప్పు, నూనె- చెంచా.
తయారీ విధానం:
పచ్చిమిర్చిని తొడిమలు తీసి తడిలేకుండా తుడిచి పెట్టుకోవాలి. వీటిని చిన్నముక్కలుగా తరగాలి. ఒక పాన్‌లో నూనె వేసుకుని వేడెక్కాక అందులో సన్నగా తరిగిన మిర్చి, వెల్లుల్లి పలుకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత దాంట్లో ఉప్పు, పంచదార, ఒకటిన్నర కప్పునీళ్లు వేసి పావుగంట పాటు ఉడికించుకోవాలి. చల్లార్చుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత నాలుగు చెంచాల వెనిగర్‌ వేసుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీనిని ఇండియనైజ్‌ చేసుకోవాలని అనుకుంటే పాన్‌లో వేయించేటప్పుడు జీలకర్ర, ఇంగువ కూడా వేసుకుంటారు. పకోడీ, కచోరీ, సమోసా, గోబీ మంచూరియా వంటివాటిల్లోకి ఈ చిల్లీ సాస్‌ బాగుంటుంది.
ఎండుమిర్చితో...
కావాల్సిన పదార్థాలు : ఎర్ర క్యాప్సికమ్‌- ఆరు (కొద్దిపాటి ఆయిల్‌లో వేయించి స్కిన్‌ తీసేసినవి), ఎండుమిర్చి-100గ్రా, టమాటాలు- పై తోలు తీసి విత్తనాలు తీసేయాలి, వెల్లుల్లిపాయ రెబ్బలు- ఐదు, అల్లంముక్క- చిన్నది, పంచదార- 450గ్రా, వైట్‌వైన్‌ వెనిగర్‌- 350గ్రా, ఉప్పు- రెండు చెంచాలు, నల్లమిరియాల పొడి- చిటికెడు, బాల్సమిక్‌ వెనిగర్‌(ముదురు గోధుమరంగులో చిక్కగా ఉంటుంది)- చెంచా.
తయారీ విధానం:
క్యాప్సికమ్‌, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, టమాటా అన్నింటిని మిక్సీలో రుబ్బుకోవాలి. పాన్‌లో పంచదార, వైట్‌వైన్‌ వెనిగర్‌, ఉప్పు, బల్సామిక్‌ వెనిగర్‌ వేసి వేడి చేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు క్యాప్సికమ్‌ ముద్ద, మిరియాలపొడి వేసి కలిపేసుకోవాలి. సన్నటిమంటపై ఉడికించుకుంటే స్వీట్‌చిల్లీ సాస్‌ సిద్ధం.
ఆవాలతో...
కావాల్సిన పదార్థాలు : ఆవాలు- అరకిలో (నల్లవి లేదా ముదురు గోధుమరంగులోవి) పసుపు రంగు ఆవాలు- పావుకిలో, వెల్లుల్లిరెబ్బలు- ఎనిమిది నుంచి పది, పంచదార- చెంచా, ఎండుమిర్చి- పది నుంచి పన్నెండు, ఉప్పు- తగినంత, వెనిగర్‌- తగినంత.
తయారీ విధానం:
ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పంచదార, వెనిగర్‌, ఉప్పు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో నీళ్లు కలపకూడదు. కొద్దికొద్దిగా వెనిగర్‌ వేసుకుంటూ మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొంచెం వెనిగర్‌ కలుపుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అదే అమెరికా విధానంలో అయితే ఇందులో ఆవాల ఘాటుకు తగిన విధంగా తేనె కలుపుతారు. ఇది శాండ్‌విచ్‌, హాట్‌డాగ్‌, పిజాస్‌తో అయితే బాగుంటుంది.
శనగలతో...
కావాల్సిన పదార్థాలు : రాత్రంతా నానబెట్టిన కాబూలి శనగలు(పెద్ద శనగలు)- 150గ్రా, వెల్లుల్లిరెబ్బ- ఒకటి, పావుకప్పు- ఆలివ్‌నూనె, తాజా నిమ్మరసం- రెండు చెంచాలు, తెల్లనువ్వులను నూనె లేకుండా వేయించి రుబ్బుకున్న పేస్ట్‌- రెండు చెంచాలు, జీలకర్రపొడి- చెంచా, కల్లుప్పు- తగినంత, చిల్లీఫ్లేక్స్‌- పావుచెంచా
తయారీ విధానం:
ఉప్పువేసి శనగలని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని వడకట్టి నువ్వుల పేస్ట్‌, ఉప్పు, జీలకర్రపొడి, వెల్లుల్లి, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఆలివ్‌ఆయిల్‌ వేసి కలుపుకోవాలి. నూనె వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకుని రుబ్బుకుంటే గ్రీన్‌ హమ్మూస్‌ సిద్ధం. ఇందులో
నీళ్లు చాలా తక్కువగా వేసుకోవాలి. రెండు చెంచాలకు మించి నీటిని వాడకూడదు. హమ్మూస్‌ని బ్రెడ్‌, చిప్స్‌ ఇలా కరకరలాడే ఏ స్నాక్స్‌తో అయినా కలిపి తినొచ్చు. ఆరోగ్యదాయకం కూడా!

వావ్‌ సాస్‌!

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

రాకోయి అనుకోని అతిథి

18-02-2020

చదువు, ఉద్యోగం, ఇతరత్రా పనుల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే స్నేహితులు, బంధువుల ఇళ్లకు అతిథులుగా వెళ్లాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలను బట్టి

manavi

వంటలు - చిట్కాలు

గ్యాస్‌ స్టౌతో జాగ్రత్త

13-02-2020

మనం నిత్యం వాడే సహజవనరులలో వంటగ్యాస్‌ అతి ముఖ్యమైనది. . దీన్ని జాగ్రత్తగా వాడాలి. అప్పుడే సురక్షితం, గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా వంటింటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ అగ్నిప్రమాదాలతో ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు.

manavi

వంటలు - చిట్కాలు

వంటింటి రాణి

13-02-2020

చక్కని ఆరోగ్యానికి కారం తప్పనిసరి. మిరప మేటి ఔషధకారిణి. పండు మిరప పచ్చడి, చల్ల మిరపకాయలు అందరి అభిమాన ఆహారపదార్థాలు. మిరపకాయ కారంగా ఉండడానికి ప్రధాన కారణం కాప్సిసిన్‌ అనే ఆల్కలాయిడ్‌ మెండుగా ఉండడమే. మిరపకాయలో మాంసకత్తులు, భాస్వరం, ఇనుము, కాల్షియం,

manavi

వంటలు - చిట్కాలు

గింజలు మొలకెత్తాలంటే...

12-02-2020

పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, కందులు, పచ్చిబఠాణీలు, బీన్స్‌... ఇలా గింజధాన్యాలు మొలకెత్తాలంటే పది నుంచి పన్నెండు గంటలు నీళ్లలో నానబెట్టాలి.

manavi

వంటలు - చిట్కాలు

ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు

12-02-2020

విటమిన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మనం తీసుకునే ఆహారంలో వాటినెలా తినాలో ప్లాన్‌ చేసుకోవచ్చు. వివిధ వ్యాధుల్లో ఉపయోగపడే రకరకాల విటమిన్ల సమాచారం మీకోసం...

manavi

వంటలు - చిట్కాలు

వంటింటి కిటుకులు

11-02-2020

ఇంట్లో కిచెన్‌ అత్యంత కీలకమైనది. ఈ గది ఎంత శుభ్రంగా ఉంటే కుటుంబమంతటికి అంత ఆరోగ్యం. అలాగే కొన్ని 'వంటింటి చిట్కాలు' ఘుమఘుమలాడే రుచికరమైన వంటలను అందించడంతో పాటు శారీరక శ్రమను, వృథా ఖర్చును తగ్గిస్తాయి. సమయం కలిసివస్తుంది. మరి ఇంటిళ్ళిపాది

manavi

వంటలు - చిట్కాలు

దోమలకు చెక్‌

11-02-2020

కావలసినవి: పది చుక్కల సిట్రోనెల్లా ఎసెన్షియల్‌ ఆయిల్‌, పది చుక్కల లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌, ఐదు చుక్కల టీ మొక్కలనుంచి తీసిన ఆయిల్‌, ఐదు చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, గరాటు, పెద్ద కప్పు ఒకటి స్ప్రే బాటిల్‌.

manavi

వంటలు - చిట్కాలు

నిమ్మతో మరకలు మాయం

09-02-2020

బీరువాల్లో సర్దిన బట్టలు చిందరవందర కావడం, ఎంత ఉతికినా వదలని మరకలు, దుస్తులకున్న జిప్పులు బిగదీసుకుపోవడం వంటి ఇబ్బందులు ప్రతి ఇంట్లో సాధారణం. ఈ రకమైన చిక్కులను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు.....

manavi

వంటలు - చిట్కాలు

చక్కని సొరకాయతో రకరకాలు

06-02-2020

పాలు పోసి వండినా, టొమాటో ముక్కలు కలిపినా, పులుసు చేసినా, ఆవపెట్టినా, నువ్వుల పొడి వేసినా... సొరకాయ రుచే వేరు. తియ్యగా, కమ్మగా, నోరూరించే సొరకాయతో మరికొన్ని రుచులు వండుకోవడం ఎలాగో చూద్దాం...

manavi

వంటలు - చిట్కాలు

కమ్మని కాకర

30-01-2020

రుచికి చేదుగా ఉండటం, వండేందుకు చాలా సమయం తీసుకోవడం వంటి కారణాల వల్ల చాలామంది కాకరకాయను ఇష్టపడరు. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకరకాయ పలు రోగాలకు