ఓట్స్‌ బోర్‌ కొట్టకుండా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవివంటలు - చిట్కాలు

ఓట్స్‌ బోర్‌ కొట్టకుండా...

ఓట్స్‌... ఈ మధ్య ఎక్కువమంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవాలి అనుకునే వారికి ఓట్స్‌ ఓ చక్కని పరిష్కారం. అల్పాహారంలో ఓట్స్‌ను చేర్చుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి కూడా ఓట్స్‌ ఎంతో మంచివి. చాలా మంది ఓట్స్‌ను పాలల్లో కలుపుకుని తింటారు. అయితే వీటితో మరికొన్ని వెరైటీలు చేసుకుంటే బోర్‌ కొట్టకుండా లాగించొచ్చు. ఈ రోజు ఓట్స్‌తో ఇడ్లీ, ఉప్మా ఎలా చేయాలో చూద్దాం.
ఓట్స్‌ ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు : ఓట్స్‌- రెండు కప్పులు, పుల్లని పెరుగు-రెండు కప్పులు, ఆవాలు- టీస్పూన్‌, మినప్పప్పు - టేబుల్‌ స్పూన్‌, సెనగపప్పు- అర టేబుల్‌ స్పూన్‌, నూనె-అరటీస్పూన్‌, పచ్చి మిర్చి -రెండు (సన్నగా తరగాలి), క్యారెట్‌ తురుము -రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తురుము - టేబుల్‌ స్పూన్‌, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, సాల్ట్‌- చిటికెడు.
తయారుచేసే విధానం : మొదట బాణలిలో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారే వరకూ వేయించాలి. తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నూనె పోసి వేగయ్యాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి. అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే వేడివేడి ఓట్స్‌ ఇడ్లీ రెడీ అయినట్టే.
ఓట్స్‌ ఉప్మా
కావాల్సిన పదార్థాలు: ఓట్స్‌ - రెండు కప్పులు, మినప్పప్పు - టేబుల్‌ స్పూన్‌, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, అల్లం ముక్కలు - ఒక టీ స్పూన్‌. ఇంకా కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఒక టీ స్పూన్‌ ఆవాలు, మూడు పచ్చిమిరపకాయలు, రెండు ఎండు మిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టీస్పూన్‌ నూనె, నాలుగున్నర కప్పులు నీరు, తగినంత ఉప్పు.
తయారు చేసే పద్ధతి: పాన్‌లో మూడు నిమిషాలపాటు ఓట్స్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. ఉల్లి, అల్లంముక్కలు, కరివేపాకు కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగాక ఇంగువ, ఉప్పు కలిపి నీరు పోసి మరిగించాలి. ఓట్స్‌ వేసి, నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. ఇక మీరు కోరే రుచికర ఓట్స్‌ ఉప్మా రెడీ. షుగర్‌తో బాధపడే వారికి ఇది మంచి ఆహారం.

ఓట్స్‌ బోర్‌ కొట్టకుండా...

MORE STORIES FROM THE SECTION

manavi

వంటలు - చిట్కాలు

కాకరతో కమ్మగా...

19-03-2020

కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. షుగర్‌తో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. షుగర్‌ను ఇది నియంత్రణలో వుంచుతుంది. కాకర ఆకుల రసం కూడా చాలా మంది జ్యూస్‌లా చేసుకుని తాగుతారు. అంతేకాదు ఇది అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది.

manavi

వంటలు - చిట్కాలు

నిర్లక్ష్యం వద్దు

12-03-2020

ఉదయం పని ఒత్తిడిలో పడి చాలా మంది మహిళలు అల్పాహారం సంగతే మర్చిపోతారు. కానీ అల్పాహారాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే ఒబీసీటీ ఇబ్బంది వుండదు. ఉదయం పూట కడుపు నిండా

manavi

వంటలు - చిట్కాలు

వంటింట్లో శుభ్రంగా...

04-03-2020

వంటింట్లో కూరగాయలు తరగడానికి కొడవలి, కత్తిపీట స్థానంలో చాక్‌, చాపింగ్‌ బోర్డ్‌, పీలర్‌.. ఇలా చాలా రకాలుగా వెజిటబుల్‌ కట్టర్స్‌ ఇప్పుడు విపణిలోకి వచ్చాయి. వీటిల్లో కటింగ్‌ ఎడ్జ్‌ ఇనుము, స్టీల్‌తో ఉండగా బేస్‌, హ్యండిల్స్‌ కర్ర

manavi

వంటలు - చిట్కాలు

మామిడి పచ్చడి...

02-03-2020

ఈ ఏడాదికి వేసవి వచ్చేసినట్లే. వేసవి వస్తూ వస్తూ ఎండలతో బాటు పుల్లని మామిడి కాయలనూ తెచ్చేసింది. ఈ సీజన్లో కమ్మని రుచితో బాటు మేలైన ఆరోగ్యాన్నిచ్చే పుల్ల మామిడితో అప్పటికప్పుడు చేసుకొనే ముక్కల పచ్చడి

manavi

వంటలు - చిట్కాలు

మరకల్ని తొలగించే పంచదార

02-03-2020

ఇంట్లోని వస్తువులు, ఫ్లోర్‌, టైల్స్‌, దుస్తులు.. ఏవైనా ఇట్టే మురికి వదలాలంటే పంచదార ఉండాల్సిందే. అదెలాగా అంటారా.. మీరూ ప్రయత్నించి చూడండి.. ఇలా చేయడం వల్ల హౌం క్లీనింగ్‌లో ఘాటైన రసాయనాల వాడకం తప్పుతుంది. పైగా సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏమీ దరిచేరవు.

manavi

వంటలు - చిట్కాలు

కొత్తిమీరతో కొత్త రుచులు

27-02-2020

వంటకాల్లో కొత్తిమీరకున్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. ఏది చేసినా చివర్లో ఇది పడకపోతే ఆ వంట పూర్తి కానట్టే. అంతటి ప్రాధాన్యం ఉందిమరి ఈ ఆకు కూరకు. కొత్తిమీర రుచికీ, అలంకరణకే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే కొత్తిమీరతో కొత్తవంటకాలు

manavi

వంటలు - చిట్కాలు

దుర్వాసన దూరం...

24-02-2020

మాములుగా మనం వంటసోడాను వంటల్లో వాడుతుంటాం. అదే కాకుండా వంట సోడా వలన చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో చూద్దాం... ఆమ్లెట్‌ ఉబ్బినట్లుగా రావాలంటే గుడ్డుసొనలో చిటికెడు వంటసోడా కలపాలి. అలాగే కేక్‌ తయారీలోనూ ఉపయోగించవచ్చు.

manavi

వంటలు - చిట్కాలు

రాకోయి అనుకోని అతిథి

18-02-2020

చదువు, ఉద్యోగం, ఇతరత్రా పనుల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే స్నేహితులు, బంధువుల ఇళ్లకు అతిథులుగా వెళ్లాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలను బట్టి

manavi

వంటలు - చిట్కాలు

గ్యాస్‌ స్టౌతో జాగ్రత్త

13-02-2020

మనం నిత్యం వాడే సహజవనరులలో వంటగ్యాస్‌ అతి ముఖ్యమైనది. . దీన్ని జాగ్రత్తగా వాడాలి. అప్పుడే సురక్షితం, గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా వంటింటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ అగ్నిప్రమాదాలతో ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు.

manavi

వంటలు - చిట్కాలు

వంటింటి రాణి

13-02-2020

చక్కని ఆరోగ్యానికి కారం తప్పనిసరి. మిరప మేటి ఔషధకారిణి. పండు మిరప పచ్చడి, చల్ల మిరపకాయలు అందరి అభిమాన ఆహారపదార్థాలు. మిరపకాయ కారంగా ఉండడానికి ప్రధాన కారణం కాప్సిసిన్‌ అనే ఆల్కలాయిడ్‌ మెండుగా ఉండడమే. మిరపకాయలో మాంసకత్తులు, భాస్వరం, ఇనుము, కాల్షియం,