అన్నింట్లోనూ పొదుపుగా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిడబ్బు - పొదుపు

అన్నింట్లోనూ పొదుపుగా...

ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. మరి ఇలాంటి రోజుల్లో పొదుపు పాటించవలసిన అవసరం ఎంతయినా ఉంది. మరి ఆ పొదుపు మంత్రమేమిటి? పొదుపు అన్నది కేవలం డబ్బు విషయంలోనే కాదు, నిత్య జీవితంలో ఎన్నో విషయాల్లో పాటించవలసి ఉంటుంది.
వండే ఆహార పదార్థాలు, నీరు, విద్యుత్‌, గ్యాస్‌ వంటి ఎన్నో విషయాల్లో వథా అరికట్టాలి. ఇలా అన్ని విషయాల్లో పొదుపు పాటిస్తే డబ్బు దానంతట అదే పొదుపవుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉన్నదే కదా! కాబట్టి ప్రత్యేకంగా డబ్బును మాత్రమే పొదుపు చేస్తే సరిపోదు. పొదుపు అంటే అవసరం మేరకే ఉపయోగించి, దుబారాను తగ్గించడం అని తెలుసుకోవాలి.
ఎలా అమలు చేయాలి?
ఎ ఆహార పదార్థాల ధరలు ఎక్కువయ్యాయని విచారించే బదులు మనకు అందుబాటులో ఉన్న వాటితో ఆహారపదా ర్థాలు వండుకునే వీలుంది. తగిన ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి మనసు పెట్టి వండితే అందరికీ తప్తిగా ఉంటుంది. కావలసినంతవరకే ఆహార పదార్థాలను వండు కోవాలి. ఎక్కువగా వండి వథా చేయకూడదు. సరుకులు నెలకు సరిపడా ఒకేసారి తెచ్చుకోవడం, కాయగూరలు రైతు బజారుకో, కూరల మార్కెట్టుకో వెళ్ళి తెచ్చుకోవడం వల్ల కొంత డబ్బు ఆదా చేయవచ్చు.
- కుళాయి కింద బకెట్టు పెట్టి నీళ్ళు కారిపోతున్నా, ట్యాప్‌ కట్టెయ్యని వారు కొందరయితే, కుళాయి కిందే గిన్నెలను కడిగే వారు ఇంకొందరు. ఆ రెండు చర్యల వల్ల ఎంతో నీరు వథా అవుతుంది. అలా కాకుండా ఒకేసారి కావలసినంత నీటిని బకెట్‌లో పట్టుకొని వాడుకుంటే ఉత్తమం. ఇతరత్రా పనులకు వాడిన నీటిని వథా చేయకుండా మొక్కలకు పోయవచ్చు. ఈ విధంగా నీటి వాడకంలో జాగ్రత్తలు పాటించాలి.
- గ్యాస్‌ వాడకంలోనూ పొదుపు పాటించాలి. వంటకు కావలసిన పాత్రలు, వండే కూరగాయలు అమర్చుకున్న తర్వాతే గ్యాస్‌ను అంటించాలి. కుక్కర్‌లో వండటం ద్వారా గ్యాస్‌ను ఆదా చేయవచ్చు. గ్యాస్‌ బర్నర్‌లు శుభ్రంగా ఉండేలా చూసుకుంటుండాలి. బర్నర్‌ రంధ్రాలు మూసుకుపోకుండా, మంట పాత్రకు సమంగా అందేలా చూడాలి.
- విద్యుత్‌తో వాడే పరికరాలను అవసరం మేరకే వాడాలి. మనుషు లు గదుల్లో లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు కట్టెయ్యాలి. ఫ్రిజ్‌ వాడకంలో కరెంటు ఎక్కువ ఖర్చవుతుంది. ఒకసారి ఫ్రిజ్‌ తెరచి కావలసిన వస్తువులన్నింటినీ ఒకేసారి తీసుకోవాలి. అలా చేస్తే విద్యుత్‌ వాడకం తగ్గుతుంది.
- పిల్లలకు ఎక్కువ కాలం మన్నిక ఉండే నాణ్యమైన దుస్తులనే కొనాలి. ఎదిగే పిల్లలకు అప్పటికప్పుడు సరిపోయేవి కాకుండా ఒక సైజు పెద్దవి తీసుకోవాలి. అలాగే విలువైన సమయాన్ని సద్వినియోగపరచటం కూడా ఎంతో ముఖ్యం. వథాగా గడిచిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవడం అసాధ్యం. కాలాన్ని కూడా డబ్బుతో సమానంగా కొలుస్తారు. మరి అంత విలువైన కాలం విలువ తెలుసుకుని దాన్ని వథా చేయకుండా సక్రమంగా ఉపయోగించుకోవడం ప్రతివారికి ఎంతో అవసరం. మాటలు కూడా పొదుపుగా ఉండాలి. అనవసరంగా పావుగంట మాట్లాడేకంటే అర్థవంతమయిన ఒక్క వాక్యం చాలు. 

అన్నింట్లోనూ పొదుపుగా...

MORE STORIES FROM THE SECTION

manavi

డబ్బు - పొదుపు

ప్లాస్టిక్‌కి దూరంగా...

29-02-2020

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల అనారోగ్యం, ప్రాణాపాయం అని తెలిసినా ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్‌ మయమయిపోయింది. ఇందులోంచి ముందుగా పిల్లలను రక్షించే మార్గాలనైనా ఆలోచించాలి. అందుకోసం చేయాల్సింది....

manavi

డబ్బు - పొదుపు

ఖర్చులు తగ్గించుకోవాలంటే...

26-02-2020

మనలో చాలామంది నెలలో మొదటి వారం గడిపినట్లుగా.. ఆఖరి వారం గడపలేరు. మొదటి వారం జీతం రాగానే ఎక్కువగా ఖర్చు చేసేసి.. ఆఖరి వారం వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ప్రతి వారం కొన్ని ఖర్చులను తగ్గించుకొని.. మిగిలిన

manavi

డబ్బు - పొదుపు

సంపాదన మొదలైన నాటినుంచే..!

17-02-2020

'ధనం మూలం ఇదమ్‌ జగత్‌' అన్న నానుడి శతాబ్దాల కిందటే మన పెద్దవారు చెప్పారు. మనిషి జీవించడానికి కావల్సిన గాలి, నీరు, తిండి, బట్ట, గూడు ఇవ్వన్ని కావాలంటే డబ్బు ఉండాలి. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. అయితే దినసరి వేతనాలతో బతికేవారికి ఈ రోజు గురించి