పరిష్కారం వెదికిన ఇంటర్‌ అమ్మాయి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిసామాజిక సేవ

పరిష్కారం వెదికిన ఇంటర్‌ అమ్మాయి

కోవిడ్‌ -19 మహమ్మారి విజృంభణతో ప్రజల జీవితంలో మాస్క్‌ ఒక ముఖ్య భాగమైపోయింది. ఫేస్‌ మాస్క్‌ లేనిదే బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముఖానికి వేసుకునే మాస్కులు కరోనా నుంచి రక్షణకు ఉపయోగపడుతున్నప్పటికీ వీటి అతి వినియోగం చెవిపై ఒత్తిడి, నొప్పికి దారి తీస్తుందని చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపింది పశ్చిమ బెంగాల్లోని పూర్బా బర్ధమాన్‌ జిల్లాకు చెందిన దిగంటికా బోస్‌ అనే 17 ఏళ్ల అమ్మాయి. మేమరిలోని విద్యాసాగర్‌ స్మృతి విద్యామందిర్‌లో ఇంటర్‌ చదువుతున్న దిగంటికా బోస్‌.. ఫేస్‌ మాస్క్‌తో ఇబ్బందులు పడుతున్న వారందరికీ పరిష్కారం చూపడానికి వినూత్నమైన 'ఇయర్‌ ప్రెజర్‌ రిడక్షన్‌ టూల్‌'ను రూపొందించింది.
ఇబ్బంది లేకుండా...
ఆమె చేసిన కృషికి గాను డాక్టర్‌ ఎ.పి.జె అబ్దుల్‌ కలాం ఇగేటెడ్‌ మైండ్‌ చిల్డ్రన్‌ క్రియేటివిటీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డ్‌ - 2020ను అందుకుంది. ఈ ఇన్నోవేషన్‌ పై దిగంటికా బోస్‌ మాట్లాడుతూ.. ''డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లతో పాటు ఇతర అత్యవసర సిబ్బంది నోరు, ముక్కును ఎక్కువ సేపు ఫేస్‌ మాస్కుతో కప్పబడి ఉంచాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సేపు ఫేస్‌ మాస్క్‌ను వాడటం వల్ల చెవుల్లో ఒత్తిడి, నొప్పి తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్లాస్టిక్‌ వంటి సౌకర్యవంతమైన బోర్డు సహాయంతో ఇయర్‌ ప్రెజర్‌ రెడెక్షన్‌ టూల్‌ను రూపొందించాను'' అంటుంది.
ఐదు ప్రత్యేక పరిశోధనలు
ఇన్నోవేషన్‌ అవార్డ్‌లో భాగంగా నిర్వహించిన వార్షిక పోటీల్లో గెలిచిన తొమ్మిది మంది పిల్లలలో ఒకరైన దిగంటికా, ఈ గౌరవాన్ని అందుకోవడంతో చాలా సంతోషంగా ఉందని అంటుంది. ''ఈ నూతన హెడ్‌ బ్యాండ్‌ చెవి పట్టీలను కలుపుతూ, వ్యక్తి తల వెనుక భాగంలో చుట్టడానికి వీలుగా ఉంటుంది'' అని ఆమె తెలిపింది. దీనితో చెవులపై ఎటువంటి ఒత్తిడి ఉండదని, ప్రజలు ఇకపై చెవిపోటు వంటి అసౌకర్యాన్ని ఎదుర్కోరని అన్నది. అయితే, దిగంటిగా బోస్‌ 'ఇయర్‌ ప్రెజర్‌ టూల్‌'ను మాత్రమే కాకుండా ఇదివరకే కోవిడ్‌ - 19కు సంబంధించిన ఐదు ప్రత్యేక పరిశోధనలు, నమూనాలను తయారు చేసింది.
గర్వంగా ఉంది
దీనిలో భాగంగానే దిగంటికా ఏప్రిల్‌లో 'ఎయిర్‌ ప్రొవైడింగ్‌ అండ్‌ వైరస్‌ డిస్ట్రాయింగ్‌ మాస్క్‌'ను కూడా తయారుచేసింది. దీనికి నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌), సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి గుర్తింపు లభించింది. దిగంటికా ఇన్నోవేషన్‌పై ఆమె తండ్రి సుదీప్తా బోస్‌ మాట్లాడుతూ.. ''నా కుమార్తె ఎప్పుడూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌ చేయడానికి ఇష్టపడుతుంది. ఇన్నోవేషన్‌ అవార్డు పొందిన తన కుమార్తెను చూసి గర్వపడుతున్నాను''అని ఆయన అన్నారు.

పరిష్కారం వెదికిన ఇంటర్‌ అమ్మాయి

MORE STORIES FROM THE SECTION

manavi

సామాజిక సేవ

నోబెల్‌తో మెరిసిన మహిళలు

14-10-2020

నోబెల్‌ బహుమతుల ఎంపికలో మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద 1901 నుంచి నోబెల్‌ బహుమతులను

manavi

సామాజిక సేవ

తొలిసారి ఇద్దరు మహిళలు

14-10-2020

బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాల యానికి చెందిన ఎమ్మాన్యుల్‌ షార్పెంటైర్‌... (51), అమెరికన్‌ బయోకెమిస్ట్‌ జెన్నిఫర్‌ డౌడ్నా(56)లకు ''జన్యు సంకలనం కోసం ఒక పద్ధతిని అభివద్ధి చేసినందుకు'' రసాయన

manavi

సామాజిక సేవ

వివక్షను ఖండించిన వరలక్ష్మమ్మ

06-10-2020

విద్యతో పాటు విషయ పరిజ్ఞానం ఉన్న మహిళలు తమ సమస్యలనే కాకుండా సమాజంలో తన లాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించగలుగుతారు. ఆ సమస్యలను చర్చిస్తూ పరిష్కారాలను సూచిస్తూ

manavi

సామాజిక సేవ

పేదలకు అవగాహన కల్పించినపుడే...

30-08-2020

సాధారణంగా ఆస్తులను మాత్రమే వారసత్వంగా తీసుకుంటారు పిల్లలు. కానీ అపర్ణ తోట అలా కాదు. అమ్మమ్మ, అమ్మ నుండి సమాజ సేవను, అక్షరాలను వారసత్వంగా తీసుకున్నారు. వామపక్ష భావాలు కలిగిన

manavi

సామాజిక సేవ

ప్యాడ్‌ ఉమెన్‌ అమన్‌ ప్రీత్‌

26-08-2020

రుతుస్రావం... ఇప్పటికీ ఇదో రహస్యంగా దాచాల్సిన విషయం. బయటకు చెప్పుకోవా లంటే మొహమాటం. ఆ సమయంలో ప్యాడ్స్‌ వాడాలనే అవగాహన లేని మహి ళలు మన దేశంలో ఎందరో ఉన్నారు. వాటి ని వాడడం మంచిది కాదని భావించే వారు కూడా ఉన్నారు. కొద్దో