మేములేని ఓ రోజు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిసామాజిక సేవ

మేములేని ఓ రోజు

మహిళలపై జరుగుతున్న హింసకు ప్రాంతం, దేశం అంటూ తేడా లేదు. ఎక్కడైనా ఆమె ద్వితియ శ్రేణి పౌరురాలే. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు వివక్ష తప్పడం లేదు. అందుకే హింసకు వ్యతిరేకంగా మెక్సికోలో మహిళలు ఓ రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ''మేము లేని ఓ రోజు'' అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనికి ఆ దేశ వ్యాప్తంగా విస్తృత మద్దతు లభించింది. మెక్సికన్‌ మహిళా సంఘాల ఐక్య కూటమి ఆధ్వర్యంలో మార్చి 9న మెక్సికో నగరంలో ఈ ఉద్యమం జరిగింది. భారతదేశంలో కూడా ఇటువంటి నిరసనలు అవసరమంటూ సామాజిక కార్యకర్త రషీద భగత్‌ రాసిన మెక్సికన్‌ మహిళల మీటూ ఉద్యమ వివరాలు మానవి పాఠకుల కోసం...
మీటూ లాంటి ఈ పోరాట ముఖ్య లక్ష్యం లాటిన్‌ అమెరికన్‌ దేశాలలో మహిళలపై జరుగుతున్న హింస పట్ల ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనతను ఎత్తిచూపడం. బహిరంగ ప్రదేశాలు మొదలుకుని పని ప్రదేశాలు, ప్రజా రవాణా, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ లాంటి చోట రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న హింసా సంస్కృతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసన ఇది. మెక్సీకోలో ఇటీవల హత్యలు, లైంగిక దాడులు, హింసకు సంబంధించిన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈమధ్య అక్కడ ఓ పాలిథిన్‌ సంచిలో వివస్త్రగా ఉన్న ఏడేండ్ల బాలిక మృత దేహం దొరికింది. దీన్ని భరించలేని మహిళలు ''మేము లేని ఓ రోజు'' ( ఏ డే వితౌట్‌ అజ్‌) హాష్‌ట్యాగ్‌తో జరిగిన ఈ ప్రచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నిరసనకు మెక్సికన్‌ల నుంచి విశేష స్పందన లభించింది.
మెక్సికో వీధుల నుండి...
మెక్సికోలో 21 మిలియన్ల మంది మహిళా కార్మికులు ఉన్నారు. మహిళా సంఘాల ఐక్య కూటమి ఇచ్చిన ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడానికి మహిళా కార్మికులే కాకుండా ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, చివరకు కార్పొరేట్‌లు కూడా ముందుకు వచ్చారు. ఉద్యోగాలు చేయని మహిళలు కూడా మార్చి 9న ఇళ్ల నుండి బయట అడుగుపెట్టమంటూ ప్రతినబూనారు. ''ఈ రోజు మేము మెక్సికో వీధుల నుండి మాయమవుతున్నాం, విధులకు హాజరు కాము'' అంటూ ప్రతి మహిళా గట్టి నిర్ణయం తీసుకుంది.
నిరసన నృత్యాలు
ఈ మీటూ నిరసన ఉద్యమ ప్రచారంలో మెక్సికన్‌ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు మహిళలు బృందాలుగా ఏర్పడి 'మీ మార్గంలో ఓ రేపిస్ట్‌' అనే నిరసన నృత్యాన్ని ప్రధాన కూడళ్లలో ప్రదర్శించారు. మెక్సికోలో అత్యంత శక్తి వంతమైన వాల్‌మార్ట్‌లో ఈ నిరసన ఉద్యమంలో లక్షలాది మంది మహిళా ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని ప్రకటించారు.
మన దేశంతో పోల్చితే
మహిళలపై జరుగుతున్న హింస విషయంలో మెక్సికో నగరానికి, భారతదేశానికి కొంత సారూప్యత ఉంది. మన దగ్గర ఇటీవల ఓ మహిళ అత్యంత దారుణంగా చంపబడింది. తన సొంత ఇంట్లోనే భర్త చేతిలో ఆమె హత్యకు గురయ్యింది. మన దేశంలో అమ్మాయిలు, మహిళలు ఇంట్లోనే దారుణమైన హింసకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు, భర్త చేతిలో దెబ్బలు లాంటివి హింసకు కొన్ని ఉదాహరణలు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం హత్యకు గురయిన 25 శాతం మంది మహిళలు తమ సొంత ఇళ్లలోనే తుది శ్వాస వదులుతున్నారు. భారతదేశం మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని మహిళా కార్యకర్తలు, పరిశోధకులు చెప్పడం మనం ఎన్నోసార్లు విన్నాం. అంతే కాకుండా మన దేశంలో దగ్గరి బంధువులు, సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే మహిళలు లైంగిక వేధింపులకు గురౌతున్నారు.
అధ్యక్షుడిపై నిరసన...
అయితే భారతదేశంలో వలే మెక్సికోలో మహిళలపై పెరుగుతున్న హింసను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ప్రభుత్వం, పోలీసులు, న్యాయ వ్యవస్థ తగినంతగా లేవని అక్కడి మహిళలు భావిస్తున్నారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న హింసపై స్పందించని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌పై మెక్సికన్‌ మహిళా సంఘాలకు రోజు రోజుకు నిరాశ పెరుగుతోంది. అయితే దేశ చరిత్రలోనే మహిళలు చేసిన ఇంత పెద్ద నిరసన కార్యక్రమాన్ని ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా కొట్టిపారేశారు. అయితే ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే అలా కొట్టి పారేసిన క్యాబినెట్‌లో ప్రస్తుతం 16 మంది సభ్యులు ఉంటే అందులో ఏడుగురు మహిళలు.
విశేష స్పందన
ఏది ఏమైనా లింగ సమానత్వం కోసం, స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మెక్సికో మహిళలు చేసిన ఈ తీవ్రమైన నిరసన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పూర్తి మద్దతు లభించింది. మహిళలపై దాడులు జరిగినపుడు కేవలం సోషల్‌ మీడియాలకు, ట్విట్టర్‌ల వరికే పరిమితం కాకుండా ఇలా బయటకు వస్తే మహిళా సమానత్వం మరింత త్వరగా సాధింగలమని కొందరు బలంగా నమ్ముతున్నారు. మహిళలకు, పిల్లలకు రక్షణ లేని మన భారత దేశంలో కూడా ఇలాంటి పోరాటాలు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. మెక్సికన్‌ మహిళలు చేసిన ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా, మన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న షాహిన్‌ బాగ్‌ పోరాట స్ఫూర్తిగా మన ఉద్యమాలకు మరింత పదును పెట్టాలి. హింసకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి. మహిళా శక్తిని చాటాలి.

మేములేని ఓ రోజు

MORE STORIES FROM THE SECTION

manavi

సామాజిక సేవ

సమస్యలు పెరిగితే గొడవలే...

14-03-2020

ఇంటర్‌లో వున్నప్పుడు రవిని ప్రేమించింది మాధురి. చదువు మధ్యలోనే ఆపేసి పెండ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టింది. ఇంటి గురించి మాధురి పెద్దగా పట్టించుకోదు. దాంతో అత్త ఆమెపై కోప్పడేది. 'మీ అమ్మ

manavi

సామాజిక సేవ

అరుదైన అదితి

05-03-2020

కృషి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. దీన్నే ఆ యువతి మరోసారి రుజువు చేసింది. వెయ్యి మందిలో ఒకరికి వచ్చే ఓ అరుదైన వ్యాధితో పుట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వడివడిగా అడుగులు వేసింది. ప్రస్తుతం ముంబయిలో సొంతంగా ఓ హౌటల్‌ని నడుపుతూ

manavi

సామాజిక సేవ

పేదలే లక్ష్యంగా....

03-03-2020

భార్యాభర్తలిద్దరివీ కార్పొరేట్‌ ఉద్యోగాలు. కోరినంత జీతం. విలాసవంతమైన జీవితం.. కానీ ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేదు. ఇంకేదో చేయాలనుకున్నారు. అది కూడా గ్రామీణ మహిళలకు చేయూతనందించేలా. అలా ఏడాది కిందట శుభం క్రాఫ్ట్స్‌ని స్థాపించారు. దీని ద్వారా మహిళలు ఉపాధి కల్పించడమే

manavi

సామాజిక సేవ

ఆచరించి చూపారు..!

20-02-2020

పంతొమ్మిదేండ్ల వయసులోనే బలవంతపు వివాహం. అది కూడా తన కంటే 26 ఏండ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో. పైగా ఆయన్ని నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిన పరిస్థితి. అంతలోనే పెద్ద అలజడి. అతను మృతి చెందడం. అప్పటికి వివాహం జరిగి ఏడేండ్లు మాత్రమే.

manavi

సామాజిక సేవ

చట్టాలెన్నొచ్చినా మహిళకు రక్షణేదీ..?

16-02-2020

మనసుకు రాయాలనిపించినప్పుడు అప్పటికప్పుడు రాసేస్తారు. తనకు ఎదుట పడిన వ్యక్తుల జీవితాలే ఆమె కథల్లో పాత్రలుగా మలుచుకుంటారు. హైకోర్టు జడ్జికి భార్యగా కాక వివిధ లా కళాశాలల్లో అధ్యాపకురాలిగా పని చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

manavi

సామాజిక సేవ

శ్రమను బట్టి విజయం

12-02-2020

పదునాగేండ్ల వయసులోనే రచనలు చేయడం ప్రారంభించిన ఆమె ఎనిమిది దశాబ్దాలుగా సాహిత్యరంగంలోనే కొనసాగుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు ముందడుగు వేసినప్పుడే