సమస్యలు పెరిగితే గొడవలే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిసామాజిక సేవ

సమస్యలు పెరిగితే గొడవలే...

ఇంటర్‌లో వున్నప్పుడు రవిని ప్రేమించింది మాధురి. చదువు మధ్యలోనే ఆపేసి పెండ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టింది. ఇంటి గురించి మాధురి పెద్దగా పట్టించుకోదు. దాంతో అత్త ఆమెపై కోప్పడేది. 'మీ అమ్మ నన్ను మాటిమాటికి తిడుతుంది. ఇక్కడ నేను ఉండలేను' అంటూ రవి ఇంటికి వచ్చీ రాగానే చెప్పడం మొదలుపెట్టేది. రవి క్యాబ్‌ డ్రైవర్‌. పగలంతా కష్టపడి వచ్చిన అతను మాధురి మాటలను పెద్దగా పట్టించుకునే వాడు కాదు. మాధురి కాస్త గోల చేస్తే వినీ వినట్టు వదలేయమంటూ సర్దిచెప్పే వాడు. దాంతో భర్త తనను పట్టించుకోకుండా తల్లికే సపోర్ట్‌ చేస్తున్నాడని లోలోపలే బాధపడేది. రాను రాను మాధురి అత్తపై ద్వేషం పెంచుకుంది. ఇంట్లో గొడవలు కూడా ఎక్కువయ్యాయి. ఇటు తల్లికీ, అటు భార్యకు ఇద్దరికీ చెప్పలేక రవి తాగడం మొదలుపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాధురి నెల తప్పింది. డాక్టర్లు బెడ్‌ రెస్ట్‌ అని చెప్పారు. దాంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. పాప పుట్టే వరకు అక్కడే ఉండిపోయింది. పాపకు ఆరో నెలలో తిరిగి వచ్చింది. మళ్ళీ గొడవలు మొదలు. ఇక అప్పటి నుంచి భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రవి మాత్రం ఒప్పుకోవడం లేదు.
మాధురి ఏదో ఒకటి అనడం, రవి ఆమెను కొట్టడం ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అత్తాకోడళ్ళకు చిన్న విషయంపై మాటమాట పెరిగింది. దాంతో మాధురి పాపను తీసుకుని రోడ్డుపై కూర్చుంది. వేరు కాపురం పెడితే తప్ప ఇంట్లో అడుగు పెట్టనని మొండి కేసింది. లోపలికి రమ్మంటూ ఎంత బతిమలాడినా రాలేదు. కనీసం పాపను తీసుకుం దామన్నా ఇవ్వలేదు. దాంతో రవి కూడా ఆ రోజు ఆమెను అలాగే వదిలేశాడు. దాంతో మాధురి పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. తెలిసిన వారు ఐద్వా లీగల్‌సెల్‌కు వెళ్ళమని సలహా ఇస్తే వచ్చి తన సమస్యంతా చెప్పుకున్నాడు.
లీగల్‌ సెల్‌ సభ్యులు మాధురికి లెటర్‌ పంపారు. తర్వాతి వారం మాధురి తన తల్లిని తీసుకుని లీగల్‌సెల్‌కు తీసుకొచ్చింది. ''చూడు మాధురి నువ్వు అనవసరంగా సమస్య పెద్దది చేసుకుంటున్నావు. ఏ ఇంట్లో అయినా ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుని పుట్టింటికి వెళితే ఎలా. నీకు వేరు కాపురం పెట్టాల నుంది. వేరుగా ఉంటే హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. నీ ఆలోచన మంచిది కాదు. మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. వేరు కాపురమంటే ఎంత ఖర్చు. వాటిని భరించడం నీ భర్త వల్ల అవుతుందా? ఆర్ధిక సమస్యలు పెరిగితే గొడవలు ఇంకా పెరుగుతాయి. ప్రేమించి పెండ్లి చేసుకున్న రవికి, నీకు మధ్య గొడవలు. చిన్న వయసులో ప్రేమించి పెండ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లివి. కాస్త ఆలోచించు. లేని పోని సమస్యలు తెచ్చుకోవద్దు'' అంటూ నచ్చజెప్పారు.
''మీరు చెప్పింది నిజమే. కానీ ఆయన నాతో సరిగా మాట్లాడడు. ఎప్పుడూ వాళ్ళ అమ్మకే సపోర్ట్‌ చేస్తాడు. నన్ను కొడతాడు. సరదాగా బయటకు వెళదామన్నా తీసుకెళ్ళడు. ఆయన అలా ఉంటే నేను అక్కడ ఉండలేను'' అన్నది మాధురి.
రవి మాట్లాడుతూ ''మేడమ్‌ నాకు వచ్చే ఆదాయం తక్కువ. అందులోనే అన్ని ఖర్చులు చూసుకోవాలి. మాధురి ప్రతి విషయానికీ గొడ వలు పెట్టుకుంటుంది. అలుగు తుంది. ఎప్పుడూ వేరు కాపురం పెడదామంటుంది. వేరు కాపురం అంటే మాటలు కాదు. అది నావల్ల కాదు. ఇవన్నీ చెబితే ఆమె అర్థం చేసుకోదు. దాంతో మందు కూడా అలవాటయింది. కోపం వచ్చినప్పుడు కొడతాను'' అని చెప్పుకొచ్చాడు.
'' భార్యకు, తల్లికి చెప్పుకోలేక మందు అలవాటు చేసుకున్నానంటున్నావు. తాగడం వల్ల నీ సమస్య పరిష్కారం దొరికిందా? పైగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఏది ఏమైనా మీరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. భార్య కోర్కెలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. పైగా మీ ఇద్దరి వయసు కూడా చిన్నదే. అప్పుడప్పుడు నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలని ఆమెకు ఉంటుంది. నవ్వు కష్టపడుతున్నావు. కానీ సంతోషంగా లేవు. వారంలో కనీసం ఒక్క పూట నీ భార్య కోసం కేటాయించు. అప్పుడు నీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ అమ్మ ఇంట్లో ఉండడం వల్లనే నువ్వు తనతో ప్రేమగా ఉండడం లేదనుకుంటుంది మాధురి. అందుకే వారిద్దరి మధ్య ఇన్ని గొడవలు. కాబట్టి ముందు మాధురిలో ఆ ఆలోచన రాకుండా చెయ్యి. భార్యకు కాస్త సమయం కేటా యించు. అప్పుడే నీ సమస్యలు పరిష్కా రమవుతాయి. మేం మాధురి తో మాట్లాడాం. నువ్వు కాస్త ఆమెతో ప్రేమగా ఉంటే చాలు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి'' అన్నారు రవితో లీగల్‌సెల్‌ సభ్యులు.
ఇద్దరూ లీగల్‌సెల్‌ సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తామన్నారు. మాధురి పాపను తీసుకుని రవితో కలిసి అత్తారింటికి వెళ్ళింది. రవి అప్పుడప్పుడు మాధురిని తీసుకొని బయటకు వెళుతున్నాడు. దాంతో అత్త ఏమన్నా ఆమెపెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు.              - సలీమా

సమస్యలు పెరిగితే గొడవలే...

MORE STORIES FROM THE SECTION

manavi

సామాజిక సేవ

మేములేని ఓ రోజు

11-03-2020

మహిళలపై జరుగుతున్న హింసకు ప్రాంతం, దేశం అంటూ తేడా లేదు. ఎక్కడైనా ఆమె ద్వితియ శ్రేణి పౌరురాలే. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు వివక్ష తప్పడం లేదు. అందుకే హింసకు వ్యతిరేకంగా మెక్సికోలో

manavi

సామాజిక సేవ

అరుదైన అదితి

05-03-2020

కృషి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. దీన్నే ఆ యువతి మరోసారి రుజువు చేసింది. వెయ్యి మందిలో ఒకరికి వచ్చే ఓ అరుదైన వ్యాధితో పుట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వడివడిగా అడుగులు వేసింది. ప్రస్తుతం ముంబయిలో సొంతంగా ఓ హౌటల్‌ని నడుపుతూ

manavi

సామాజిక సేవ

పేదలే లక్ష్యంగా....

03-03-2020

భార్యాభర్తలిద్దరివీ కార్పొరేట్‌ ఉద్యోగాలు. కోరినంత జీతం. విలాసవంతమైన జీవితం.. కానీ ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేదు. ఇంకేదో చేయాలనుకున్నారు. అది కూడా గ్రామీణ మహిళలకు చేయూతనందించేలా. అలా ఏడాది కిందట శుభం క్రాఫ్ట్స్‌ని స్థాపించారు. దీని ద్వారా మహిళలు ఉపాధి కల్పించడమే

manavi

సామాజిక సేవ

ఆచరించి చూపారు..!

20-02-2020

పంతొమ్మిదేండ్ల వయసులోనే బలవంతపు వివాహం. అది కూడా తన కంటే 26 ఏండ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో. పైగా ఆయన్ని నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిన పరిస్థితి. అంతలోనే పెద్ద అలజడి. అతను మృతి చెందడం. అప్పటికి వివాహం జరిగి ఏడేండ్లు మాత్రమే.

manavi

సామాజిక సేవ

చట్టాలెన్నొచ్చినా మహిళకు రక్షణేదీ..?

16-02-2020

మనసుకు రాయాలనిపించినప్పుడు అప్పటికప్పుడు రాసేస్తారు. తనకు ఎదుట పడిన వ్యక్తుల జీవితాలే ఆమె కథల్లో పాత్రలుగా మలుచుకుంటారు. హైకోర్టు జడ్జికి భార్యగా కాక వివిధ లా కళాశాలల్లో అధ్యాపకురాలిగా పని చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

manavi

సామాజిక సేవ

శ్రమను బట్టి విజయం

12-02-2020

పదునాగేండ్ల వయసులోనే రచనలు చేయడం ప్రారంభించిన ఆమె ఎనిమిది దశాబ్దాలుగా సాహిత్యరంగంలోనే కొనసాగుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు ముందడుగు వేసినప్పుడే