బాధ్యత ఎవరు తీసుకోవాలి..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

బాధ్యత ఎవరు తీసుకోవాలి..?

ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు, మీరు అనుమానంగా భావిస్తున్నప్పుడు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు. ఆ పరిస్థితి నుంచి కానీ, మీ మీద దాడిని అరికట్టడానికి గానీ ఆత్మరక్షణ ముఖ్యమైన అంశం. అందుకోసం మీరు మొదట మీ పరిసరాల గురించి తెలుసుకోవాలి. మీదగ్గర అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. మీ బాధ్యత మీ చేతుల్లోనే.. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోనే శక్తి మీ సొంతం. కాకపోతే కొన్ని విషయాల పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. అవేంటో చూద్దాం...
  సాధారణంగా ఒంటరి మహిళలపై దాడులు జరిగే అవకాశం ఎక్కువ. మీరు వెళ్తున్న లేదా వెళ్లాల్సిన ప్రదేశం గురించి మీకు అవగాహన ఉండాలి. ఒంటరిగా వెళ్తున్నప్పుడు అప్రమత్తత అవసరం. మొబైల్‌ ఫోన్లు, ఇయర్‌ ఫోన్స్‌ మీ అప్రమత్తతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఒంటరి ప్రయాణంలో ఎక్కువగా వీటిని ఉపయోగించటం మత్తుతో సమానం. ఇవి ఎక్కువ హానికరం. ఒంటరి మహిళలనే లక్ష్యంగా అగంతకులు దాడులు చేస్తారు. వాళ్లు మిమ్మల్ని అనుసరిస్తారు. ఇలా అనుమానాస్పదంగా ఎవరినైనా మీరు గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. జనావాసాల్లో నడవడం, అగంతకుని దృష్టి మల్లించడం చేయాలి. ప్రమాదాన్ని ముందే పసిగడితే వెంటనే ఇతరులకు చేరవేయాలి. ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలి, తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేయాలి.
ప్రమాదం వస్తే: అగంతకులు మీ మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ ముఖ్యం.ప్రమాదం నుంచి బయటపడడం చాలా అవసరం. ఆత్మరక్షణ అవకాశం లేనప్పుడు సాయం కోసం అరవండి. ఇది చుట్టుపక్కల ఉన్నవాళ్లను అప్రమత్తం చేస్తుంది. మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువునూ ఆయుధంగా ఉపయోగించవచ్చు. తాళాలు, సెఫ్టీ పిన్నులు, హ్యాండ్‌ బ్యాగ్‌, మొబైల్‌ ఫోన్‌ వీటిని ఉపయోగించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎప్పుడూ పెప్పర్‌ స్ప్రేను వెంటపెట్టుకోవడం ముఖ్యం.
మై సర్కిల్‌: మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపయోగపడేది 'మై సర్కిల్‌' యాప్‌. ఈ యాప్‌ వినియోగించే మహిళలు ఆపద సమయాల్లో తమకు తెలిసిన ఐదుగురు సన్నిహితులకు ఎస్‌ఎంఎస్‌ పంపించవచ్చు. ఈ సందేశంలో ఉన్న లింక్‌ ఆధారంగా ఎస్‌ఎంఎస్‌ పంపిన మహిళ గూగుల్‌మ్యాప్‌ ద్వారా లొకేషన్‌కు వెంటనే చేరుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషు, హిందీతో కలిపి 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్‌ఓఎస్‌ అలెర్ట్స్‌ పంపుకోవచ్చు.
గార్డియన్‌ యాప్‌: గార్డియన్‌ పేరుతో మైక్రోసాప్ట్‌ విడుదల చేసిన ఈ యాప్‌తో చాలా ఉపయోగాలున్నాయి. తెలియని ప్రదేశంలో చిక్కుకుపోయినా, అపహరణకు గురైన సందర్భంలో ఈ ఆప్లికేషన్‌లోని 'ట్రాక్‌ మీ' బటన్‌ను నొక్కడం ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు బాధితురాలు ఎక్కడ ఉన్నదీ గుర్తించేందుకు వీలవుతుంది. ఈ అప్లికేషన్‌ ద్వారా ఒకే టచ్‌తో వాయిస్‌నే కాకుండా వీడియో రికార్డు, ఫొటోలు తీయవచ్చు. అవి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.
ఇద్దరూ సమానమే: చాలా ఇండ్లల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ, మగ భేదం చూపుతూ పెంచుతుంటారు. ఈ వ్యత్యాసం కారణంగా బాలికలు, యువతులు మానసికంగా కుంగిపోతుంటారు. అలాకాకుండా ఆడ, మగ ఇద్దరూ సమానమేనన్న భావనతో పెంచాలి. ప్రస్తుతం ఎవరి బిజీ వాళ్లది. కానీ అవసరమైన సమయంలో మానవత్వాన్ని చూపాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వారు ఆపదలో ఉంటే వీలైనంత సాయం చేయాలి. మాకెందుకులే అనుకోకుండా మన ఇంటి బిడ్డనే అనుకోవాలి. బస్సులోనో, కాలేజీలోనో, పని స్థలమో మరో చోటో ప్రమాదంలో ఉన్న మహిళలకు అండగా నిలబడాలి. స్కూల్లో ఆత్మరక్షణ విద్యకు ఒక పీరియడ్‌ కేటాయిస్తే బాగుంటుంది. స్త్రీలకు భరోసా ఇస్తూనే కాలేజీలు, క్లాస్‌ రూముల్లో యువకులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. తప్పు చేస్తే ఎలాంటి శిక్ష అనుభవిస్తారో కళ్లకు కట్టినట్లు చెప్పాలి.
- స్వేచ్ఛ


బాధ్యత ఎవరు తీసుకోవాలి..?

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

అలసట దరిచేరకుండా...

11-02-2020

మహిళ ఇంటా బయట రాణిస్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహౌద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే

manavi

ఉద్యోగి

సురక్షిత జీవనం మా హక్కు

07-02-2020

నేలలో సగం.. నింగిలో సగం.. విశ్వంలో సగం.. ఉత్పత్తిలో సగం.. ఇప్పుడు ఆ సగానికి జీవించే హక్కు కాలరాయబడుతున్నది. ఇంటా బయట రక్షణ కరువయింది. ఈ పెరిగిపోతున్న హింసకు కారణాలను మూలాల నుండి వెదికి వాటిని సమూలంగా తుడిచివేయాలి. దీని కోసం

manavi

ఉద్యోగి

ఆఫీస్‌లో ఫోన్‌ మాట్లాడుతున్నారా?

02-02-2020

ఆఫీసులో పనిలో తలమునకలైపోయి ఉంటామా! ఇంటి దగ్గర్నుంచీ ఫోన్‌ వస్తుంది. అలాగని అదేమీ ఎమర్జన్సీ ఫోన్‌ కూడా కాదు. ఎలా ఉన్నారో ఓసారి పలకరించేందుకో, సాయంత్రం వచ్చేటప్పుడు కందిపప్పు తెమ్మని గుర్తుచేసేందుకో... చేసిన పోన్‌.... ఇక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా

manavi

ఉద్యోగి

చాందినీ గాత్రానికి ఫిదా...

29-01-2020

కండ్లతోనే వెయ్యి భావాలు పలికిస్తుంది.. ఎంతటి డైలాగ్‌ అయినా చక్కగా చెప్పేస్తుంది. సెంటిమెంట్‌, లవ్‌, కామెడీ ఏదైనాసరే.. యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇదంతా ఏ హీరోయిన్‌ గురించో అనుకుంటున్నారా.. కానే కాదు. కేరళలోని డిఫరెంట్లీ ఎబుల్డ్‌ పర్సన్‌ చాందినీ నాయర్‌

manavi

ఉద్యోగి

మగవాళ్ల జీతం, ఆడవాళ్ల వయసు.....

18-01-2020

మగవాళ్ల జీతం, ఆడవాళ్ల వయసు అడక్కూడదనే మాట పాతబడి చాలాకాలమే అయింది. ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. మగవాళ్ళ కన్నా ఎక్కువగానే కష్టపడి నాలుగు రాళ్లు మోసుకొస్తున్నారు. ఇప్పుడిక ఆడవాళ్ల జీతం, మగవాళ్ల వయసు