అలసట దరిచేరకుండా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

అలసట దరిచేరకుండా...

మహిళ ఇంటా బయట రాణిస్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహౌద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే అలసటను దరిచేరనివ్వద్దు. అందుకని ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. ఆరోగ్య చిట్కాలను పాటించాలి.
- రోజంతా చలాకీగా ఉండాలంటే కనీసం అరగంట సమయం వ్యాయామానికి కేటాయించండి. నడక శరీరానికి చక్కని ఎక్సర్సైజ్‌ అని గుర్తించండి. వీలైతే లిఫ్ట్‌కి బదులు మెట్లు ఉపయోగించడం మంచిది.
- కంప్యూటర్‌ స్క్రీన్‌ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు. కళ్ళు తొందరగా అలసిపోవు.
- అదేపనిగా గంటల తరబడి కూర్చోకుండా మధ్యమధ్యలో నిటారుగా నిలబడడం, నాలుగు అడుగులు వేయడం చేయాలి.
- కంప్యూటర్‌ కీబోర్డ్‌, మౌస్‌ వాడడంలో చేతి వేళ్లు నొప్పిపెట్టవచ్చు. వేళ్లు రిలాక్స్‌ అవ్వాలంటే రబ్బర్‌ బ్యాండ్‌ తీసుకుని రెండు చేతులను దగ్గరగా చేర్చి వేసుకోవాలి. ఇప్పుడు రబ్బర్‌ బ్యాండ్‌ని సాగదీస్తూ, వదిలేస్తూ ఐదు నిమిషాల పాటు చేయాలి. స్ట్రెస్‌ బాల్‌ని కూడా వినియోగించవచ్చు.
- ఉదయంపూట టిఫిన్‌ నిర్లక్ష్యం చేయకూడదు. అల్పాహారంలో ఆరోగ్యకరమైన తణధాన్యాలు, నట్స్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ తీసుకొనే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ చేర్చుకోవాలి. తగినంత మంచినీళ్లు అవసరం.
- వారాంతాల్లోనే కాక రోజూ కనీసం అరగంట వ్యక్తిగత సమయం అంటూ పెట్టుకోండి. దాన్ని కేవలం మీకోసమే సద్వినియోగం చేసుకోండి. దీంతో మీకు చక్కని విశ్రాంతి దొరకడంతో పాటు యాంత్రికత, విసుగూ మటుమాయమవుతాయి. 

అలసట దరిచేరకుండా...

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

సాగులో ఆమె కీలకం

13-03-2020

ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు

manavi

ఉద్యోగి

సమానత్వ సాధన మనందరి బాధ్యత

08-03-2020

గర్భధారణ, మాతృత్వం, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత... వీటి వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లో సవాళ్ళను ఎదుర్కోలేరంట.. నెలసరి సమయంలో స్త్రీలు భర్తకు వండి పెడితే వచ్చే జన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడతారంట. చదువు, సంపద ఉన్న

manavi

ఉద్యోగి

ఆమె సృష్టించిన అద్భుతాలు

06-03-2020

ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు అడిగితే.. చాలామంది థామస్‌ ఎడిసన్‌.. మార్కోనీ.. గ్రాహం బెల్‌ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్‌.. అన్‌ త్సుకమోటోల సంగతేంటి..? అసలు వీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా... ఈ ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే.. మనం రోజూ వాడే ప్రతి

manavi

ఉద్యోగి

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె...

28-02-2020

మహిళలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అడుగుపెట్టలేని రంగాలు ఇంకా ఉన్నాయి. పురుషాధిక్యం రాజ్యమేలుతున్న రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగం ఒకటి. అందుకే ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'నేషనల్‌ సైన్స్‌ డే' సందర్భంగా ఏడాదికి

manavi

ఉద్యోగి

పనివేళలో..

28-02-2020

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్‌ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్‌ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్‌ మానిటర్‌ లేదా

manavi

ఉద్యోగి

అవరోధాలను అధిగమించి...

25-02-2020

ఇంట్లో చిన్నారి బుడి బుడి అడుగులు వేస్తుంటే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పరుగులు పెడుతుంటే ఆనందపడిపోయారు. కానీ ఆ నవ్వులు ఎంతో కాలం నిలువలేదు. ఐదేండ్లకే అంతుచిక్కని వ్యాధి వల్ల ఆ పాప నడక ఆగిపోయింది. ఎన్నో సర్జరీలు, ఎన్నో బాధలు.

manavi

ఉద్యోగి

ఒత్తిడి వదిలించుకునేదెట్లా...?

21-02-2020

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై