శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె...

మహిళలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అడుగుపెట్టలేని రంగాలు ఇంకా ఉన్నాయి. పురుషాధిక్యం రాజ్యమేలుతున్న రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగం ఒకటి. అందుకే ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'నేషనల్‌ సైన్స్‌ డే' సందర్భంగా ఏడాదికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకునే ప్రభుత్వం ఈసారి 'ఉమెన్‌ ఇన్‌ సైన్స్‌' థీమ్‌తో ముందుకు వెళుతుంది. దేశంలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరని ఒక్కసారి గుర్తు చేసుకుంటే శ్రీనివాస రామానుజం, అబ్దూల్‌ కలాం పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. అయితే ప్రపంచానికి తెలియని గొప్ప మహిళా శాస్త్రవేత్తలు మన దగ్గర ఉన్నారు. ఇటీవల ఇన్ఫోసిస్‌ వారు అందించిన ప్రతిష్టాత్మక 'లైఫ్‌ సైన్సెస్‌' బహుమతికి ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు. వీరే కాక రాబోయే తరాలకు స్ఫూర్తిదాయక మార్గాన్ని చూపుతున్న మహిళా శాస్త్రవేత్తలు మరెందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి ఈ రోజు మానవి పాఠకుల కోసం...
21వ శతాబ్దంలోనూ కొన్ని రంగాలు కేవలం మగవారికి మాత్రమే పరిమితమయ్యాయి. కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, కొన్ని పరిమితుల రీత్యా మహిళలు ఆయా రంగాలలో రాణించలేకపోతున్నారు. అయితే ఎన్ని ఆటంకాలను ఎదురైనా వాటిని జయిస్తూ విజ్ఞాన శాస్త్రానికి సేవలు అందిస్తున్న మహిళలు మన దేశంలో ఎందరో ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగానికి విశేష సేవలు అందిస్తూ ప్రపంచ పటంలో మన దేశాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
మహిళా భాగస్వామ్యం
సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలంటే శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలు పేదరికం, ఆహార కొరత, అనారోగ్యం, వాతావరణ కాలుష్యం ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటిని పరిష్కరించాలంటే సైన్స్‌ అభివృద్ధి చెందాలి. కేవలం ఈ సమస్యల పరిష్కారానికే కాదు. స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా శాస్త్ర సాంకేతిక రంగం ప్రభావం చూపుతుంది. అలాంటి ఈ రంగంలో మహిళలను కూడా భాగస్వాములను చేయడం ఎంతో అవసరం. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలు ఇలాంటి క్లిష్టమైన రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన దేశ మహిళలను కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ భాగస్వాములు అయినట్లయితే సమాజం మరింతగా అభివృద్ధి పధంలో నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
మంజులా రెడ్డి
మంజులా... హైదరాబాద్‌లోని సీసీఎంబీలో చీఫ్‌ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. బ్యాక్టీరియా కణ గోడ నిర్మాణం, సంశ్లేషణను అర్థం చేసుకోవడంలో చేసిన కృషికి గాను ఆమెకు ఇన్ఫోసిస్‌ 2019 'లైప్‌ సైన్సెస్‌' బహుమతి ప్రకటించింది. కొత్త యాంటీబయాటిక్స్‌ అభివృద్ధికి బ్యాక్టీరియా పెరుగుదల, విభజనకు సంబంధించిన ప్రాథమిక దశలను అర్థం చేసుకోవడం చాలా అవసరం అంటారు ఈమె.
సునీత సారావాగి
సారావాగి బొంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా చేశారు. ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ విభాగంలో ఈమె చేసిన కృషికి 2019లో ఇన్ఫోసిస్‌ వారి బహుమతికి ఎంపికయ్యారు. ఇన్ఫర్‌మేషన్‌ రీసెర్చ్‌ను అభివృద్ధి(సమాచార వెలికితీత) చేసిన తొలి పరిశోధకురాలు ఈమె. ఈ రీసెర్చ్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. డేటాబేస్‌, డేటా మైనింగ్‌, అధ్యయనం, గ్రాఫికల్‌ నమూనాలు సమాచార వెలికితీత వంటి రంగాలలో ఈమె పరిశోధన చేస్తున్నారు. ఈమె బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి డేటాబేస్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ ఖర్గ్‌పూర్‌ నుండి బాచిలర్‌ డిగ్రీ చేశారు. గూగుల్‌ రీసెర్చ్‌, మౌంటెన్‌ వ్యూ, సీ, సీఎంయు వంటి చోట విజిటింగ్‌ ఫ్యాకల్టీగా చేశారు. అలాగే ఐబీఎం అల్మాడెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పరిశోధనా సిబ్బందిగా ఉన్నారు. అలాగే డేటాబేస్‌, డేటా మైనింగ్‌ గురించి అనేక వ్యాసాలు రాశారు.
మంగళ నార్లికర్‌
ఈమె గణిత శాస్త్రవేత్త. పూణే, బొంబే విశ్వవిద్యాలయంలో అంక గణితం, అధునాతన గణిత రంగాలలో విశేష కృషి చేశారు. దేశంలో గుర్తింపు పొందిన గణిత శాస్త్రవేత్తలో ఈమె ఒకరు. పెండ్లి చేసుకున్న 16ఏండ్లకు పీహెచ్‌డీ పూర్తి చేశారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పని చేశారు. మంగళ పబ్లికేషన్‌ పేరుతో గణిత శాస్త్రంలో ఇంగ్లీషు, మరాఠీ భాషలో ఎన్నో పుస్తకాలు ముద్రించారు. ఈమె మరాఠీలో రచించిన ఓ పుస్తకానికిగాను 2002లో విశ్వనాథ్‌ పార్వతి గోఖలే అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు ఆసక్తి కరంగా గణితాన్ని బోధించడం ఈమె ప్రత్యేకత.
అదితి పంత్‌
ఈమె సముద్ర శాస్త్రవేత్త. భూగర్భ, సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు 1983లో అంటార్కిటికాకు ప్రయాణించిన మొట్ట మొదటి భారతీయ మహిళ. అలిస్టర్‌ హార్డీ రచించిన 'ది ఓపెన్‌ సీ' అనే పుస్తకం నుండి స్ఫూర్తి పొందిన ఈమె అమెరికా ప్రభుత్వం అందించిన స్కారల్‌షిప్‌ ద్వారా హవాయి యూనివర్సిటీ నుండి మెరైన్‌ సైన్సెస్‌లో ఎంఎస్‌ చేశారు. లండన్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌ కాలేజీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చిన ఈమె గోవా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో చేరారు. భారత పశ్చిమ తీర ప్రాంతాన్ని పర్యటించి తీరప్రాంతాలపై ఎన్నో అధ్యయనాలు చేశారు.
ఇందిర హిందూజ
ముంబయికి చెందిన ఈమె ప్రముఖ స్త్రీ వైద్య, సంతాన సాఫల్య నిపుణురాలు. భారతదేశంలోని మొదటి టెస్ట్‌ట్యూబ్‌ బేబీకి డెలివరీ చేసింది ఈమెనే. అలాగే సంతాన సాఫల్యతకు సంబంధించిన 'గామేట్‌ ఇంట్రా ఫెలోపియన్‌ ట్రాన్స్ఫర్‌ టెక్నిక్‌' అనే అత్యాధునిక పద్దతిని ప్రవేశపెట్టి భారతదేశానికి మొదటి బిడ్డను అందించినది కూడా ఈమెనే. అలాగే అండాశయ సమస్యలు, మెనోపాజ్‌ దశలోనూ పిల్లలు కావాలని కోరుకునే మహిళల కోసం అండాలు సేకరించి భద్రపరిచే సాంకేతికతను సైతం కనిపెట్టారు.
పరంజిత్‌ ఖురానా
ప్లాంట్‌ బయోటెక్నాలజీ, జెనోమిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ రంగ శాస్త్రవేత్త ఈమె. ఢిల్లీ యూనివర్సిటీలో ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌. అలాగే తన సబ్జెక్టుకు సంబంధించి125కు పైగా పత్రాలను ముద్రించారు. ఎన్నో అవార్డులను పొందిన ఈమె 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంతవాయ సంస్థ నుండి 'సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఆనర్‌' అవార్డును అందుకున్నారు.
సునేత్ర గుప్తా
సునేత్ర గుప్తా ఓ నవలా రచయిత. అలాగే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో థీరిటికల్‌ ఎపిడెమియాలజీ (వారసత్వంగా వచ్చే వ్యాధులు) విభాగంలో ప్రొఫెసర్‌. మలేరియా వంటి అంటు వ్యాధులు గురించి ఈమె ఎన్నో పరిశోధనలు చేశారు. ఈ రంగంలో ఆమె చేసిన కృషికి జులాజికల్‌ సొసైటి ఆఫ్‌ లండన్‌ వారు ఈమెను 'సైంటిఫిక్‌ మెడల్‌'తో సత్కరించింది. అలాగే రాయల్‌ సొసైటీ వారి నుండి 'రోసలిండ్‌ ఫ్రాంక్లిన్‌' అవార్డును కూడా అందుకున్నారు.
నందిని హరినాథ్‌
బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) లో శాటిలైట్‌ సెంటర్‌లో రాకెట్‌ శాస్త్రవేత్త. తన 20 ఏండ్ల ఉద్యోగ జీవితంలో 14 మిషన్లలో భాగస్వామిగా ఉన్నారు. మంగళ్యాన్‌ మిషన్‌కు డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పని చేశారు.
రోహిణి గాడ్‌బోలే
రోహిణి భౌతిక శాస్త్రవేత్త. బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ ఫిజిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌. పార్టికల్‌ ఫెనోమెనాలజీపై మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. స్టాండర్డ్‌ మోడల్‌ ఆఫ్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌కు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఈమె ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని మూడు సైన్స్‌ అకాడమీలలో ఫెలోఫిప్‌కు ఎంపికయ్యారు.
నీనా గుప్తా
కోల్‌కొతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ లో స్టాటిస్టిక్స్‌, మ్యాథమెటిక్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఆల్జిబ్రా, బీజగణితం ఈమె ప్రత్యేకతలు. ఓ సంస్థలో విజిటింగ్‌ సైంటిస్ట్‌గా, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో విజిటింగ్‌ ఫెలోగా చేశారు. 2014లో ఈమె ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ నుండి 'యంగ్‌ సైంటిస్ట్‌' అవార్డు అందుకున్నారు. అలాగే గణిత శాస్త్ర విభాగంలో 'శాంతి స్వరూప్‌ భట్నాగర్‌' అవార్డును కూడా అందుకున్నారు. ఇది సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు.
నీతూ సింగ్‌
ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ డిగ్రీలను పొందారు. ఆ తర్వాత తన ప్రొఫెసర్‌తో కలిసి కెమిస్ట్రీలో డాక్టరల్‌ చేయడానికి యుఎస్‌ వెళ్ళారు. అట్లాంటాలోని జార్జియా ఇనిస్టిట్యూట్‌లో మల్టీ ఫంక్షనల్‌ హైడ్రోజెల్‌ నానోపార్టికల్స్‌ రూపకల్పనకు విశేష కృషి చేశారు. పీహెచ్‌డీ తర్వాత పోస్ట్‌ డాక్టోరల్‌ కూడా చేశారు. 2012లో దేశానికి తిరిగి వచ్చి పూణేలోని నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీలో పాలిమర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అధ్యాపకురాలిగా చేశారు. అలాగే ఎన్నో రచనలు కూడా చేశారు. 2013లో 'ఇన్నో వేటివ్‌ యంగ్‌ బయోటెక్నాలజిస్ట్‌ అవార్డు' అందుకున్నారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె...

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

ఏకాగ్రత ఉంటేనే...

14-04-2020

మన లక్ష్య సాధనాలే కాదు.. ఆనందంగా ఉండటానికి కూడా ఏకాగ్రత దోహదపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ మధ్య

manavi

ఉద్యోగి

సాగులో ఆమె కీలకం

13-03-2020

ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు

manavi

ఉద్యోగి

సమానత్వ సాధన మనందరి బాధ్యత

08-03-2020

గర్భధారణ, మాతృత్వం, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత... వీటి వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లో సవాళ్ళను ఎదుర్కోలేరంట.. నెలసరి సమయంలో స్త్రీలు భర్తకు వండి పెడితే వచ్చే జన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడతారంట. చదువు, సంపద ఉన్న

manavi

ఉద్యోగి

ఆమె సృష్టించిన అద్భుతాలు

06-03-2020

ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు అడిగితే.. చాలామంది థామస్‌ ఎడిసన్‌.. మార్కోనీ.. గ్రాహం బెల్‌ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్‌.. అన్‌ త్సుకమోటోల సంగతేంటి..? అసలు వీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా... ఈ ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే.. మనం రోజూ వాడే ప్రతి

manavi

ఉద్యోగి

పనివేళలో..

28-02-2020

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్‌ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్‌ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్‌ మానిటర్‌ లేదా

manavi

ఉద్యోగి

అవరోధాలను అధిగమించి...

25-02-2020

ఇంట్లో చిన్నారి బుడి బుడి అడుగులు వేస్తుంటే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పరుగులు పెడుతుంటే ఆనందపడిపోయారు. కానీ ఆ నవ్వులు ఎంతో కాలం నిలువలేదు. ఐదేండ్లకే అంతుచిక్కని వ్యాధి వల్ల ఆ పాప నడక ఆగిపోయింది. ఎన్నో సర్జరీలు, ఎన్నో బాధలు.

manavi

ఉద్యోగి

ఒత్తిడి వదిలించుకునేదెట్లా...?

21-02-2020

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై

manavi

ఉద్యోగి

అలసట దరిచేరకుండా...

11-02-2020

మహిళ ఇంటా బయట రాణిస్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహౌద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే