సాగులో ఆమె కీలకం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

సాగులో ఆమె కీలకం

ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతలు కోయడం, నూర్పిడి చేయడం, పంట ఇంటికి చేర్చడం... ప్రతి పనిలో ఆమె వుంది. అయినా ఆమె శ్రమకు విలువ లేదు. సొంత భూమి లేదు. రైతుగా గుర్తింపు లేదు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మహిళా రైతు సదస్సులో కొందరు మహిళా రైతులు తమ ఆవేదనను మానవితో ఇలా పంచుకున్నారు.
మహిళలు ఇంటి పనులతో పాటు ఎంతో కష్టంతో కూడిన పనులు చేస్తున్నారు. వ్యవసాయంలో విత్తడం, నాటు పెట్టడం, కలుపు తీత, అంతరకృషి, పంటకోత, పంట నూర్పిడి, వ్యవసాయోత్పత్తుల శుద్ధి, వంట చెరకు సేకరణ, పశుపోషణ, నీటిని తెచ్చే పని, ఇంటి పని, వంట, పిల్లల పోషణ, పాడి పశువుల పోషణ ఇలా వ్యవసాయ సంబంధిత రంగాలలో పని చేస్తున్నారు. దాంతో శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. అనేక అనారోగ్యాలకు గురౌతున్నారు. ఈ పనులు మహిళలు తరతరాలుగా చేస్తూనే వున్నారు.
చట్టాన్ని మార్చాలి
వ్యవసాయంలో అన్ని పనులు తానై చేస్తున్నా రైతు అనగానే పురుషులేనని భావిస్తూ మహిళల్ని వారికి తోడ్పడే వారిగానే చూస్తున్నారు. వ్యవసాయంలో కీలకంగా మారుతున్న మహిళల పాత్రను గుర్తించి ఈ భావాన్ని పోగొట్టాలి. దీనికోసం పురుష రైతులకు కల్పించే అన్ని ప్రభుత్వ పథకాలు మహిళా రైతులకు కూడా వర్తింపజేయాలి. చట్టపరమైన మార్పులు తేవాలి. ప్రభుత్వ ప్రయోజనాలన్నీ మహిళలకు అందేలా అన్ని రెవెన్యూ రికార్డుల్లో పురుషులతో పాటు మహిళల పేర్లు కూడా నమోదు అయ్యేలా చట్టాన్ని మార్చాలి. వ్యవసాయ మహిళల సామర్ధ్యం పెరగందే వ్యవసాయ ఉత్పాదన పెరగదు. అందువల్ల మహిళల్లో సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.


గుర్తింపు లేదు
మహిళలు ఎన్నో విధాలు గా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున ఐదు గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చేసి పొలం పనులకు వెళతారు. పంటలు పండిం చడానికి ప్రభుత్వం నుండి సరైన సాయం అందడం లేదు. ఎన్ని సాధించినా మహిళలను తక్కువగానే చూస్తు న్నారు. ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని పిల్లల్ని పోషించు కోడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు వ్యవసాయం చేసే మహిళలను రైతుగానే గుర్తించడం లేదు. వ్యవసాయంలో అన్ని రకాల పనులు మహిళలు చేస్తారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలి. అదే మేము ప్రభుత్వం నుండి కోరుకుం టున్నాం.
- కుమారి,భద్రాద్రి కొత్తగూడెం

మా భూమి మాకు కావాలి
మాకు ఓ ఎకరం సొంత పొలం వుంది. ఆ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవదు. అందుకే కూలి చేసుకుంటాం. అగ్రకుల పెత్తందార్లు మా పొలాన్ని మాకు కాకుండా చేస్తున్నారు. మా తాతల కాలం నుండి ఆ పొలం మేమే పండించుకుంటున్నాం. పన్నెండేండ్ల నుండి దాని కోసం పోరాటం చేస్తూనే వున్నాం. ప్రభుత్వం మా స్థలం మాకు ఇవ్వాలి. మా పేరుతో కాగితాలు కూడా ఉన్నాయి. కస్తూరి బాయి స్కూల్‌కు, డబుల్‌ బెడ్‌రూంకి మా స్థలాలు ఇచ్చాం. కలెక్టర్‌ మేము ఇచ్చిన భూమికి మళ్ళీ భూమి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పొలం కోసమే పోరాడుతున్నాం.
- అబ్బవ్వ, బోధన్‌ మండలం, హమ్దాపూర్‌

కూలి రేట్లు పెంచాలి
మాకు సొంత పొలం అంటూ లేదు. కూలి పనులే చేసుకుంటాం. నార్లు, కలుపులు అయిపోయాయంటే పనులు ఏమీ వుండవు. తర్వాత ఖాళీగానే ఉంటాం. మగవాళ్ళు చేయాలన్నా పనులు దొరకవు. ఇప్పుడు మాది మున్సిపాల్టీలో కలిసింది. దాంతో ఉపాధి హామీ పథకం కూడా లేదు. ఇక ఆ పని కూడా పోయినట్టే. ఉండటానికి ఇల్లు లేవు. సొంత భూమి లేదు. కూలీ చేసి బతకడం తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదు. పిల్లల్ని ఎలా సాదుకోవాలి. మేం ఎలా బతకాలి. కూలి రేట్లు పెంచాలి. ఆడవాళ్ళకు 250, 200 కూలి ఇస్తున్నారు. మగవాళ్ళకు 300 ఇస్తారు. ఎండలు వస్తే కూలీ తగ్గిపో తుంది. కూలిలో కూడా తేడాలు చూపిస్తున్నారు.
- కె.లింగామణి, నర్సాపూర్‌

మహిళల కష్టాన్ని గుర్తించాలి
రైతు సమస్యలపై చాలా పని చేశాం. 1994లో సర్పంచ్‌గా చేశాను. వ్యవసాయం చేసే మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఐదు గంటకు లేవాలి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. తర్వాత పొలంలో చేయాలి. కానీ విలువ లేదు. రైతుగానే గుర్తించరు. ఇంకా ఇంకా పండించాలనే కోరిక మహిళలకు బాగా ఉంటుంది. ఇంట్లో మగవాళ్ళు బాధ్యతగా ఉండరు. అలాంటప్పుడు ఇటు ఇంటి పనులు అటు పొలం పనులు అన్నీ మహిళలే చూసుకోవాలి. ఎంతకష్టపడినా భూమి మాత్రం మహిళల పేరుతో ఉండదు. పిల్లల చదువులు, ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మహిళలు వ్యవసాయం చేస్తూనేవున్నారు. ప్రభుత్వం మహిళల కష్టాన్ని గుర్తించాలి. మహిళలు బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా పోరాడాలి. సమస్యలు పరిష్కరించుకోవాలి.
- విజయమ్మ, పోతిరెడ్డి పల్లి,కల్వకుర్తి తాలుక

సాగులో ఆమె కీలకం

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

సమానత్వ సాధన మనందరి బాధ్యత

08-03-2020

గర్భధారణ, మాతృత్వం, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత... వీటి వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లో సవాళ్ళను ఎదుర్కోలేరంట.. నెలసరి సమయంలో స్త్రీలు భర్తకు వండి పెడితే వచ్చే జన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడతారంట. చదువు, సంపద ఉన్న

manavi

ఉద్యోగి

ఆమె సృష్టించిన అద్భుతాలు

06-03-2020

ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు అడిగితే.. చాలామంది థామస్‌ ఎడిసన్‌.. మార్కోనీ.. గ్రాహం బెల్‌ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్‌.. అన్‌ త్సుకమోటోల సంగతేంటి..? అసలు వీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా... ఈ ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే.. మనం రోజూ వాడే ప్రతి

manavi

ఉద్యోగి

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె...

28-02-2020

మహిళలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అడుగుపెట్టలేని రంగాలు ఇంకా ఉన్నాయి. పురుషాధిక్యం రాజ్యమేలుతున్న రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగం ఒకటి. అందుకే ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'నేషనల్‌ సైన్స్‌ డే' సందర్భంగా ఏడాదికి

manavi

ఉద్యోగి

పనివేళలో..

28-02-2020

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్‌ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్‌ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్‌ మానిటర్‌ లేదా

manavi

ఉద్యోగి

అవరోధాలను అధిగమించి...

25-02-2020

ఇంట్లో చిన్నారి బుడి బుడి అడుగులు వేస్తుంటే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పరుగులు పెడుతుంటే ఆనందపడిపోయారు. కానీ ఆ నవ్వులు ఎంతో కాలం నిలువలేదు. ఐదేండ్లకే అంతుచిక్కని వ్యాధి వల్ల ఆ పాప నడక ఆగిపోయింది. ఎన్నో సర్జరీలు, ఎన్నో బాధలు.

manavi

ఉద్యోగి

ఒత్తిడి వదిలించుకునేదెట్లా...?

21-02-2020

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై

manavi

ఉద్యోగి

అలసట దరిచేరకుండా...

11-02-2020

మహిళ ఇంటా బయట రాణిస్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహౌద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే