మీతో మీరు కాసేపు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

మీతో మీరు కాసేపు

ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోనూ మహిళల విషయంలో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురౌతూనే వుంటారు. అందులోనూ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులుగా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట.
సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కానీ తాజాగా చేసిన ఓ అధ్యయనంలో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్థారు ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా, ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసేవారికైతే శ్రమకి తగిన జీతం, పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కానీ గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరూ కష్టమయినదిగా గుర్తించరు. దానితో తమ పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని తేలింది. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని దానివలన ఇతర అనారోగ్యాలు కూడా దరి చేరవని పరిశోధకులు చెబుతున్నారు.
చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నా ఆ ప్రశంస దొరకటం కష్టంగా వుందంటే ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయంలో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే
బ మొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించు కోండి.
బ మీతో మీరు కొంత సమయం గడపండి.
బ మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి
ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడాల్సిన అవసరం వుండదు. వారినుంచి ప్రశంస దొరికినా లేకపోయినా కూడా ఆనందండి వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ఎన్నో మానసిక సమస్యలకి చెక్‌ చెప్పినట్టే.

మీతో మీరు కాసేపు

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

సాగులో ఆమె కీలకం

13-03-2020

ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు

manavi

ఉద్యోగి

సమానత్వ సాధన మనందరి బాధ్యత

08-03-2020

గర్భధారణ, మాతృత్వం, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత... వీటి వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లో సవాళ్ళను ఎదుర్కోలేరంట.. నెలసరి సమయంలో స్త్రీలు భర్తకు వండి పెడితే వచ్చే జన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడతారంట. చదువు, సంపద ఉన్న

manavi

ఉద్యోగి

ఆమె సృష్టించిన అద్భుతాలు

06-03-2020

ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు అడిగితే.. చాలామంది థామస్‌ ఎడిసన్‌.. మార్కోనీ.. గ్రాహం బెల్‌ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్‌.. అన్‌ త్సుకమోటోల సంగతేంటి..? అసలు వీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా... ఈ ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే.. మనం రోజూ వాడే ప్రతి

manavi

ఉద్యోగి

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె...

28-02-2020

మహిళలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అడుగుపెట్టలేని రంగాలు ఇంకా ఉన్నాయి. పురుషాధిక్యం రాజ్యమేలుతున్న రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగం ఒకటి. అందుకే ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'నేషనల్‌ సైన్స్‌ డే' సందర్భంగా ఏడాదికి

manavi

ఉద్యోగి

పనివేళలో..

28-02-2020

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్‌ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్‌ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్‌ మానిటర్‌ లేదా

manavi

ఉద్యోగి

అవరోధాలను అధిగమించి...

25-02-2020

ఇంట్లో చిన్నారి బుడి బుడి అడుగులు వేస్తుంటే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పరుగులు పెడుతుంటే ఆనందపడిపోయారు. కానీ ఆ నవ్వులు ఎంతో కాలం నిలువలేదు. ఐదేండ్లకే అంతుచిక్కని వ్యాధి వల్ల ఆ పాప నడక ఆగిపోయింది. ఎన్నో సర్జరీలు, ఎన్నో బాధలు.

manavi

ఉద్యోగి

ఒత్తిడి వదిలించుకునేదెట్లా...?

21-02-2020

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై

manavi

ఉద్యోగి

అలసట దరిచేరకుండా...

11-02-2020

మహిళ ఇంటా బయట రాణిస్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహౌద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే