ఏకాగ్రత ఉంటేనే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఉద్యోగి

ఏకాగ్రత ఉంటేనే...

మన లక్ష్య సాధనాలే కాదు.. ఆనందంగా ఉండటానికి కూడా ఏకాగ్రత దోహదపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ మధ్య ఆనందానికీ, ఆలోచనకూ మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవటానికి అమెరికాలో ఓ అధ్యయనం నిర్వహించారట. దీనిలో భాగంగా 83 దేశాలకు చెందిన వివిధ వత్తులు, వయసుల వారిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. వాటి ఆధారంగా అధ్యయన కర్తలు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేసేవారు ఆనందంగా ఉంటారని తేల్చారు.
83 దేశాలకు చెందిన వివిధ వత్తులు, వివిధ వయసుల వారిని ఏ యే సమయాలలో ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. అప్పుడు వారి అనుభూతి, ఏ పని చేస్తున్నప్పుడు ఏ దక్పథంతో వున్నారు వంటి అంశాల పై ప్రశ్నించి వాటిని విశ్లేషించి, పరిశీలించారు. వీరిలో చాలా మంది పనిచేస్తున్న, టీవీ చూస్తున్నా, తింటున్నా, చివరికి షాపింగ్‌ చేస్తున్న ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు గుర్తించారు. ఫలితంగా ఆ సమయంలో న్యాయంగా పొందల్సినంత ఆనందాన్ని వారు పొందలేకపోతున్నారని గుర్తించారు పరిశోధకులు.
ఏకాగ్రతతో చేసే ఏ పనైనా పూర్తి ఆనందాన్ని అందిస్తుంది అని రుజువు చేయటానికి చేసిన అధ్యయనంలో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించేవారు అనుభూతులను పూర్తిగా ఆస్వాదించలేరు అని తేలింది. నిజానికి మనం మనకి తెలియకుండానే నిరంతరం ఆలోచనల్లో మునిగి వుంటాం. అవి సంతోషాన్నిచ్చే ఆలోచనలు అయినపుడు అప్పటి మన అనుభవంతో సంబంధం లేకుండా మన మనసు సంతోషంగా వుంటుంది. అదే నెగెటివ్‌ ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతుంటే ఆనందాన్నిచ్చే విషయాలుకి మన ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వుండదు. ఏది ఏమైనా మనసు లగం చేయందే ఏ పని పూర్తి ఆనందాన్ని అందించదు అని కచ్చితంగా చెబుతున్నారు అధ్యయకర్తలు.
మన మనసుకి బాధ కలిగించే సంఘటన ఏదైనా జరిగినపుడు ఆ ప్రభావం మన ఆలోచనలపై పడుతుంది. మన ఆలోచనలన్ని వ్యతిరేక భావంతో ఉంటాయి. ప్రతి అంశం మనకి నచ్చనట్టుగానే అనిపిస్తుంది. ఆ సమయంలో మనం వంట చేసినా, ఆఫీసు పని చేసినా ఏదైనా మన మనసు పూర్తిగా ఆ పనిపై లగం కాదన్నది నిజం. దాంతో చేసేపని విసుగ్గా అనిపిస్తుంది. దాంతో ఆ పని సరిగ్గా చేయలేం, ఫలితం కూడా అలాగే ఉంటుంది. దాంతో తిరిగి మనం మరింత వ్యతిరేక భావనలో కూరుకుపోతాం. ఇది ఒక వలయంలో అలా సాగుతూనే వుంటుంది. చాలా మంది జీవితం విసుగ్గా ఉంది అనటానికి కారణం అదే. అందుకే నిరంతరం మనపై దాడిచేసే ఆలోచనల నుంచి తప్పించుకోవటం అలవాటు చేసుకోవాలి.
మనసుకి ఏకాగ్రత అలవాటు చేయటం కష్టం కాదు. ధ్యానం, యోగా వంటివి మనలో ఏకాగ్రత పెంచుతాయని చెబుతారు పెద్దలు. ఈ వయసులో నాకెందుకు అనుకోకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని వాటికి కేటాయిస్తే మనసుకి ఏకాగ్రత అలవాటుగా మారుతుందో ప్రతీ పనిని ఆనందించగలుగుతాం. అనుభూతులని అందుకోగలుగుతాం.

ఏకాగ్రత ఉంటేనే...

MORE STORIES FROM THE SECTION

manavi

ఉద్యోగి

సాగులో ఆమె కీలకం

13-03-2020

ఆమె అడుగు పెడితే నేలమ్మ పులకరించిపోతుంది. ఆమె స్వేదంతో తడిసి కొత్త పరిమళాన్ని అందిస్తుంది. ఆమె లేకుంటే వ్యవసాయమే లేదు. ఇంటెడు చాకిరి చేస్తుంది. పొద్దంతా చెమట చిందించి సాగు చేస్తుంది. అవసరమైతే అరకపడుతుంది. నాట్లు వేయడం, కలుపు

manavi

ఉద్యోగి

సమానత్వ సాధన మనందరి బాధ్యత

08-03-2020

గర్భధారణ, మాతృత్వం, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత... వీటి వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లో సవాళ్ళను ఎదుర్కోలేరంట.. నెలసరి సమయంలో స్త్రీలు భర్తకు వండి పెడితే వచ్చే జన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడతారంట. చదువు, సంపద ఉన్న

manavi

ఉద్యోగి

ఆమె సృష్టించిన అద్భుతాలు

06-03-2020

ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు అడిగితే.. చాలామంది థామస్‌ ఎడిసన్‌.. మార్కోనీ.. గ్రాహం బెల్‌ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్‌.. అన్‌ త్సుకమోటోల సంగతేంటి..? అసలు వీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా... ఈ ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే.. మనం రోజూ వాడే ప్రతి

manavi

ఉద్యోగి

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె...

28-02-2020

మహిళలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అడుగుపెట్టలేని రంగాలు ఇంకా ఉన్నాయి. పురుషాధిక్యం రాజ్యమేలుతున్న రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగం ఒకటి. అందుకే ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'నేషనల్‌ సైన్స్‌ డే' సందర్భంగా ఏడాదికి

manavi

ఉద్యోగి

పనివేళలో..

28-02-2020

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్‌ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్‌ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్‌ మానిటర్‌ లేదా

manavi

ఉద్యోగి

అవరోధాలను అధిగమించి...

25-02-2020

ఇంట్లో చిన్నారి బుడి బుడి అడుగులు వేస్తుంటే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పరుగులు పెడుతుంటే ఆనందపడిపోయారు. కానీ ఆ నవ్వులు ఎంతో కాలం నిలువలేదు. ఐదేండ్లకే అంతుచిక్కని వ్యాధి వల్ల ఆ పాప నడక ఆగిపోయింది. ఎన్నో సర్జరీలు, ఎన్నో బాధలు.

manavi

ఉద్యోగి

ఒత్తిడి వదిలించుకునేదెట్లా...?

21-02-2020

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై

manavi

ఉద్యోగి

అలసట దరిచేరకుండా...

11-02-2020

మహిళ ఇంటా బయట రాణిస్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహౌద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే