నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
'చరిత్ర చదవని వారు చరిత్ర సృష్టించ లేరు' అని చెప్పిన అంబేద్కర్ మాటలను గుర్తుచేస్తున్నా బహుజన్ సమాజ్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ జోన్ కోఆర్డినేటర్ మహతి రమేష్ నవతెలంగాణ తో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలలో కులాలు, మతాలు అంటరానితనం పోవాలనే ఉద్దేశం తో పాటు ధనికులు, రెడ్డిలు, రాజులు, దొరలు ఏర్పాటుచేసిన పార్టీలలో ఉంటే అంబేద్కర్ ఆశయాలు నెరవేరవని, వారి పాలనకు విముక్తి చెప్పాలని ఆలోచనతో ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రజలందరికీ చేకూరే విధంగా రాజ్యాంగం లో ఓటు హక్కును వజ్రాయుధంగా కల్పించారు అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలి అని అంబేద్కర్ పోరాడారు అని అన్నారు. అన్ని కులాల వారు మతాలవారు అసెంబ్లీ, పార్లమెంట్ లోకి వెళ్లి గొంతు విప్పి మాట్లాడినప్పుడే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని అన్నారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కారు సమాజం లో అందరి వ్యక్తి అని, బహుజనులకు ఎస్సీ, ఎస్టీ, బిసి లకు అన్ని కులాల వర్గాల వారు ఒకే తాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలనె అంబేద్కర్ దృష్టి అని ఆయన అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా అందరూ విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా అందించాలి అనేదే అంబేద్కర్ ఆలోచన అని అవి నెరవెర్చుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో రాజ్యాంగంలో ఎన్నో అంశాలను చేకూర్చారని ఆయన అన్నారు. అంబేద్కర్ తన జీవితంలో భార్య, నలుగురు పిల్లలను కోల్పోయిన దేశం లో అనుగారిన వారు, బహుజనులు అందరూ బాగు పడాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆయన ఒక వర్గానికి చెందిన వారే అనే విధంగా సృష్టించడం జరుగుతుందని అన్నారు. ఁఅంబేద్కర్ అంటేనే ఒక రాజకీయ యుద్ధంఁ ఆయన రాజకీయం యుద్ధం చేయమన్నారు అని అన్నారు. ప్రపంచ దేశాలు ఆయన జ్ఞానాన్ని గుర్తించి ఏప్రిల్ 14ను అంతర్జాతీయ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని గుర్తించిన రోజు అని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను అమలు చేస్తే చాలు అని అన్నారు. అంబేద్కర్ కు చట్టం సభకు రానివ్వకుండా ఉంటే స్వాతంత్ర్యం ఇచ్చేది లేదు అని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారు అన్నారు అని తెలియజేశారు. రాజ్యాంగ రాయడానికి అవకాశం కల్పించాలని 1946 లోనే ఒప్పందం చేసుకోవడం జరిగింది అనే అంశాన్ని తెలియజేశారు. నిజమైన దేశభక్తుడు ఉన్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 05:47PM