నవతెలంగాణ-గుండాల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ వేడుకలను బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని మామకన్ను గ్రామ పంచాయితీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు, మామకన్ను సర్పంచ్ ముత్యమాచారి, ఉప సర్పంచ్ కల్తి కుమార్, వార్డు సభ్యులు నాగేశ్వరరావు, సారయ్య, చిరంజీవి, గ్రామ పెద్దలు కృష్ణ, రమేష్, కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ సీనియర్ నాయకులు పొంబొయిన ముత్తయ్య, మండల నాయకులు ఈసం పాపారావు, శోభన్, రాజేష్, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:43PM